
తెలంగాణ హిస్టరీ - సాలర్‌జంగ్-I సంస్కరణలుTelangana History Reforms of Salar Jung in Telugu | Telangana History in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
మొదటి సాలార్‌జంగ్ సంస్కరణలు
Telangana History in Telugu : మొదటి సాలార్‌జంగ్ పూర్తి పేరు మీర్ తురాబ్ ఆలీఖాన్. ఇతను హైదరాబాద్ సంస్థానంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సంక్షోభాల నుండి రక్షించాడు. హైదరాబాద్ రాజ్యానికి దివాన్‌గా పనిచేశాడు. హైదరాబాద్ రాజ్యానికి దివాన్లుగా పనిచేసినవారిలో గొప్పవాడు. నిజాం పాలకులు ఇతనికి సాలార్ జంగ్ అని, బ్రిటీష్ వారు సర్ అనే బిరుదునివ్వడంతో సర సలార్‌జంగ్‌గా ప్రసిద్ది చెందాడు.
➺ మొదటి సాలార్ జంగ్ చేపట్టిన సంస్కరణలు :
- ఇతను 1853 నుండి 1883 వరకు ముగ్గురు నిజాం రాజులైన నసీరుద్దౌలా, అప్జల్-ఉద్దౌలా, మీర్ మహబూబ్ ఆలీఖాన్‌ల వద్ద ప్రధానమంత్రిగా పనిచేసినాడు.
- 1855లో దార్-ఉల్-ఉల్మ్ (దారుల్ ఉల్మ్) అను ఇంగ్లీషు విద్యా సంస్థను స్థాపించాడు.
Also Read :
- మొట్టమొదటి పారిశ్రామిక ప్రదర్శన శాలను 1856లో ఏర్పాటు చేశాడు.
- 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత అప్జల్ ఉద్దౌలా పేరుమీదుగా నాణేలను చలామణిలోకి తెచ్చాడు. ఈ నాణేలను హాలీసిక్కాలని పిలుస్తారు.
- ‘జిలేసంధి’ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం రాజ్యం 5 భాగాలుగా, 17 జిల్లాలుగా విభజింపబడిరది. సుభాకు సుబేదారును, జిల్లాకు తాలూకాదారు (రెవెన్యూ కలెక్టర్)ను, తాలూకాకు తహశీల్దార్‌ను నియమించాడు.
- అధిక వేతనాలు తీసుకున్న ఉన్నత ఉద్యోగాలను తొలగించాడు.
- పరిపాలనా యంత్రాంగానికి ప్రధానమంత్రి అత్యున్నత అధికారిగా వ్యవహరించేలా చేశాడు.
- 1865లో పోలీసు పాలనావిధానాన్ని సంస్కరించాడు. జిల్లాకొక పోలీసు సూపరింటెండెంట్‌ను నియమించాడు. 1867లో పోలీసు శాఖను రెవెన్యూ శాఖను నుండి వేరుచేసి పరిపాలన కొనసాగించాడు.
- 1875లో భూమి సర్వే మరియు సెటిల్‌మెంట్‌ని ఏర్పాటు చేశాడు. దాని ద్వారా భూమిని సర్వే చేయించి భూమిశిస్తు విధానాన్ని రూపొందించాడు.
- హైదరాబాద్ `షోలాపూర్, హైదరాబాద్`నాందేడ్‌ల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టాడు.
ఇది కూడా చదవండి :
- బొంబాయి-మద్రాసు రైల్వే లైన్, మీటర్‌గేజీ, బ్రాడ్‌గేజీ కూడా హైదరాబాద్ రాష్ట్రం గుండా ఏర్పాటు చేశాడు.
- 1870లో సిటీ హైస్కూల్‌ను, 1872లో చాదర్‌ఘాట్ హైస్కూల్‌ను స్థాపించాడు.
- ప్రభువుల పిల్లల కోసం తన ఇంటిలోనే 1873లో ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఇదే తర్వాత మదరస ఏ అలియాగా మారింది.
- హైదరాబాద్‌లో ఉర్దూభాషను రాజభాషగా మార్చాడు.
- న్యాయనిర్వహణను మెరుగుపరిచేందుకు అదాలత్ -ఇ-షాదుషాహి ను అప్పీలు న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. మున్సిప్, మీర్ అదిల్ అనే న్యాయాధికారులను నియమించాడు.
- మహబూబ్ అలీఖాన్ కాలంలో రైల్వేలైన్ పూర్తి చేయించాడు.
- 1882లో చంచల్‌గూడ జైలును నిర్మించాడు.
- హైదరాబాద్ సంస్థానానికి 30 సంవత్సరాలు సేవచేసి 1883 ఫిబ్రవరి 08న కలరా వ్యాదితో మరణించాడు.
0 Comments