
కిరణజన్య సంయోగ క్రియ General Science Gk in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
కిరణజన్య సంయోగ క్రియను జరిపే మొక్కలు పత్రాలు ఆకుపచ్చరంగులో ఉండే వర్ణకాన్ని కల్గి ఉంటాయి. దీనిని ‘పత్రహరితం’ అంటారు. ఇవి కాంతిశక్తిని వనరుగా ఉపయోగించి సరళ అకర్భన పదార్థాలను సంక్లిష్ట కర్భన అణువులుగా మారుస్తాయి. ఈ విధానాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ విధానంలో అనేక రకాల చర్యలు క్రమపద్దతిలో జరగడంతో పాటుగా అనేక మధ్యస్థ సమ్మేళనాలు కూడా ఏర్పడుతుంటాయి. శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని సరళమైన సమీకరణ రూపంలో సూచించడానికి ప్రయత్నించారు. 1931వ సంవత్సరంలో సి.బి.వాన్ నీల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించి ఇప్పటికీ కూడా ఉపయోగిస్తున్నాము. అతని ప్రకారం ‘‘ప్రతి కార్పోహైడ్రేట్ అణువు తయారీకి ఒక కార్భన్ డై ఆక్సైడ్ అణువు మరియు రెండు అణువుల నీరు అవసరతమవుతాయి. ఈ ప్రక్రియలో కార్భోహైడ్రేట్‌తో పాటు ఒక ఆక్సీజణÊ మరియు ఒక నీటి అణువు ఉత్పత్తి అవుతుంది.
మొక్కలు మొదటగా సరళమైన కార్భోహైడ్రేట్స్ తయారుచేసుకుంటాయి. తర్వాత స్టార్చ్‌మరియు సెల్యూలోజ్ వంటి సంక్లిష్టమైన పిండిపదార్థాలను సంశ్లేషిస్తాయి. ఇవేకాకుండా మొక్కలు ప్రొటీన్లు, లిపిడ్లు మొదలైన పదార్థాలను కూడా తయారు చేసుకోగల్గుతాయి. అయితే జంతువులు కార్భోహైడ్రేట్లను సొంతంగా తయారుచేసుకోలేవు. కాబట్టి అవి వాటి కొరకు మొక్కలపైన ఆధారపడాల్సి వస్తుంది.
0 Comments