Vijayanagara Dynasty in Telugu || విజయనగర సామ్రాజ్యం || History in Telugu || General Knowledge in Telugu

Vijayanagara Dynasty in Telugu ||  విజయనగర సామ్రాజ్యం

 విజయనగర సామ్రాజ్యం 
The Vijayanagara Empire in Telugu || List of Vijayanagara Kings in Telugu 


     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

విజయనగర సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తుంగుభద్ర నది ఒడ్డున ఆవిర్భవించింది. ఈ సామ్రాజ్యాన్ని విద్యారణ్య స్వామి ఆశీస్సులతో 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని కొలిచేవారు. విజయనగర సామ్రాజ్యం దాదాపు 300 సంవత్సరాలకు పైగా విరాజిల్లింది. హరిహరబుక్క రాయలు తర్వాత సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలకు చెందిన రాజులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఇందులో కొందరు రాజులు కన్నడ భాష మాట్లాడగా, శ్రీ కృష్ణదేవరాయలు రాజు మాత్రం తెలుగుకి ప్రాధాన్యమిచ్చాడు. 

➺ సైన్యం  - సైనిక అధికారులు :

విజయనగర సామ్రాజ్యంలో రాజులు సైనిక శక్తిని బలోపేతం చేయడం కోసం అధిక మొత్తం ఖర్చు చేసేవారు. అరేబియా, ఇరాన్‌, దేశాల నుండి మేలి రకం గుర్రాలను పశ్చిమ తీరంలోని ఓడల ద్వారా దిగుమతి చేసుకున్నారు. వాటికి సైనికులను నియమించుకున్నారు. కోట గోడలు పటిష్టవంతంగా నిర్మించారు. రెండవ దేవరాయలు ముస్లిం పోరాట యోధులను నియమించి వారికి నూతన యుద్దతంత్రాలు నేర్పించారు. ఆ రోజుల్లోనే తుపాకులు, ఫిరంగులను ప్రవేశపెట్టారు. భారతదేశంలోనే ఆధునిక అశ్వదళం, సైనిక దళాలను రెండిరటిని కలిపి ఒక శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరచారు. 

విజయనగర సామ్రాజ్యంలో సైనిక దళాధిపతులను నాయకులుగా కూడా నియమించేవారు. వీరినే అమరనాయకులుగా పిలిచేవారు. వీరికి ‘అమరం’పైన ఆదాయం వసూలు చేసే బాద్యతను అప్పగించేవారు. అమరం అంటే నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం. 

➺ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు :

  • హరిహరరాయలు (1336 - 1357)
  • మొదటి బుక్క రాయలు (1357 - 1377)
  • రెండవ హరిహరరాయలు (1377 - 1404)
  • రెండవ దేవరాయలు (1426 - 1446)
  • సాళువ నర్సింహరాయలు (1486 - 1491)
  • శ్రీకృష్ణదేవరాయలు (1509 - 1529)
  • అచ్యుత రాయలు (1529 - 1542)
  • ఆలియారామరాయలు (1543 - 1565)
  • వెంకటపతిరాయలు (1585 - 1614)

➺ విజయనగర సామ్రాజ్యం గురించి ఎలా తెలుసు ? 

విజయనగర సామ్రాజ్య చరిత్ర గురించి సమకాలీన గ్రంథాలు, రాతప్రతులు, శాసనాలు, నాడు నిర్మించిన భవనాలు, నిత్య జీవిత పరిపాలన, సామాజిక సంస్థలు అందించిన వివరాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పలుదేశాల నుండి వచ్చిన పర్యాటకులలో ఇటలీ యాత్రికుడైన నికోలో కోంటి విజయనగరాన్ని 1420లో సందర్శించాడు. అబ్దుల్‌ రజాక్‌ అనే పర్షియన్‌ వర్తకుడు 1443లో, పోర్చుగీసు యాత్రికులైన డొమింగో పెయిజ్‌ 1520లో, నూనిజ్‌ 1537లో సందర్శించి రాసిన రచనల ద్వారా విజయనగర చరిత్రకు సంబంధించిన విలువైన సమాచారం తెలుస్తుంది. 


Also Read :

    బాగపెల్సి తామ్రశాసనం మొదటి హరిహరరాయల విజయాలను వివరిస్తుంది. రెండో సంగముడు వేయించిన బిట్రగుంట దాన శాసనం సంగమ సోదరుల గురించి తెలుపుతుంది. రెండో హరిహరుడు వేయించి చెన్నరాయపట్టణ శాసనం, రెండో దేవరాయలు వేయించి శ్రీరంగం తామ్ర ఫలకాలు, ఇమ్మడి నరసింహుడు వేయించిన దేవులపల్లి తామ్ర శాసనాలు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. 

➺ నాణేలు :

విజయనగర కాలంలో ప్రధాన బంగారు నాణెం గద్యాణం. దీన్నే వరహ అనే వారు. ప్రతాప ఫణం, చిన్నం కూడా బంగారు నాణాలే. తార్‌ వెండి నాణెం. జిటాలు, కాసు రాగి నాణేలు. దీనారం ఈజిప్షియన్‌ నాణెం, నాణేలపై హిందూ దైవాల ప్రతిమలు, ఏనుగులు, నంది గండబేరుండ పక్షి ఒక పక్క, రాజుల పేర్లు, బిరుదులు మరో పక్క ఉండేవి. 

➺ శ్రీ కృష్ణదేవరాయలు :

శ్రీ కృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. బహమనీ సుల్తానులు, గజపతులకు వ్యతిరేకంగా విజయనగర సామ్రాజ్యాన్ని విజయవంతంగా పాలించిన గొప్ప యోధుడు. ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్ణాటక, ఆంధ్ర , తమిళనాడు ప్రాంతాలలోని నాయకులను అణచివేశాడు. ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతం, కృష్ణా నది తూర్పు తీర ఓడరేవులపై నియంత్రణ సాధించాడు. ఇదే సమయంలో పశ్చిమ తీరంలో గోవాలో పోర్చుగీసువారు ఓడరేవుల వద్ద స్థావరాలు ఏర్పరచుకొని నియంత్రణ సాధించారు. శ్రీ కృష్ణదేవరాయలు వీరితో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పాడు. ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా సైనిక ప్రదర్శన నిర్వహించేవారు. ఈ రోజున అమరనాయకులు, ప్రముఖులు, చక్రవర్తికి కానుకలు, కప్పం చెల్లించేవారు. శ్రీ కృష్ణదేవరాయలు తమ సామ్రాజ్యంలోని దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ద కనబర్చేవారు. వారు స్వయంగా తిరుపతి, శ్రీశైలం, అహోబిలం సందర్శించేవారు. చాలా దేవాలయాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేవారు. 

శ్రీ కృష్ణదేవరాయలు శాసనాల ప్రకారం అనేక యుద్దాలలో విజయం సాధించి పొందిన ధనరాశులను దక్షిణ భారతదేశంలోని పెద్ద పెద్ద దేవాలయాలకు పంచిపెట్టాడు. ఈ దేవాయాలలో ఇతని గౌరవార్థం ‘రాయగోపురం’ అనే ఎత్తయిన ఆలయ ముఖద్వారాలను నిర్మించారు. ఈ రకమైన పరిశీలన వల్ల దక్షిణ భారతదేశంలోని ప్రజలలో అతని పేరు చిరస్మరణీయంగా నిలించింది. 

శ్రీ కృష్ణదేవరాయలు స్వయంగా తెలుగు సాహిత్యంలో కవి. అతడు ‘ఆండాళ్‌’ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా ‘‘అముక్తమాల్యద’’ గ్రంథం రచించాడు. వీరికాలంలో అల్లసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, మాదయగారి మల్లన, అయ్యాలరాజు రామభద్రుడు వంటి ‘‘అష్ట దిగ్గజాలు’’ ఆస్థానంలో కొలువై ఉండేవారు. 

శ్రీ కృష్ణదేవరాయలు వారసులైన అచ్యుతదేవరాయ, ఆళియ రామరాయల కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం మరింతగా పెరిగింది. వీరు బహమనీ సుల్తానుల రాజ్య వ్యవహరాలలో జోక్యం చేసుకున్నారు. వీరి నిరంతర జోక్యం ఫలితంగా ఆందోళన చెందిన ఐదుగురు బహమనీ సుల్తానులు 1565లో ఏకమై రక్కసి తంగడి యుద్దం లేదా తళ్లికోట యుద్దంలో రామరాయలను ఓడిరచి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం చేశారు. అనంతరం వచ్చిన వారసులు రాజధానిని తిరుపతి సమీపంలోని చంద్రగిరికి తరలించారు. కానీ పూర్వ వైభవాన్ని సాధించలేకపోయారు. కొంత భాగాన్ని సుల్తానులు ఆక్రమించుకోగా మిగిలిన భూభాగాలపై నాయకులు స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. 


Post a Comment

0 Comments