ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగం | UPSC NDA & NA (I) Recruitment in Telugu | Latest Jobs in Telugu

ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగం
యూపీఎస్‌సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ  ఎగ్జామినేషన్‌ (1) - 2024 నోటిఫికేషన్‌

యూపీఎస్‌సీ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ,ఏన్‌ఏ) ఎగ్జామినేషన్‌ (1) - 2024 కు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ద్వారా ఖాళీగా ఉన్న 400 ఎన్‌డీఏ, ఎన్‌ఏ భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 9 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షను 21 ఏప్రిల్‌ 2024 రోజున నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలున్నాయి.

➺ పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు 400 ఉన్నాయి.
  • ఇండియన్‌ ఆర్మీ -208
  • ఇండియన్‌ నేవి - 42
  • ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ప్లయింగ్‌ విభాగం) - 92
  • గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ విభాగం - 18
  • గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ - 10
  • నేవల్‌ అకాడమీ (10G2 కేడెట్‌ ఎంట్రీ స్కీమ్‌) - 30 ఖాళీలున్నాయి

అర్హత :

ఆర్మీ వింగ్‌ - ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మిడియట్‌ ఉత్తీర్ణత ఉండాలి
ఎయిర్‌ఫోర్స్‌, నేవీ, నేవల్‌ అకాడమీ - మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మిడియట్‌ ఉత్తీర్ణత ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. వీరు 24 డిసెంబర్‌ 2024 నాటికి సర్టిఫికేట్‌లు అందించాలి.

వయస్సు :

  • 02 జూలై 2005 నుండి 01 జూలై 2008 మధ్య జన్మించి ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ :

ఎన్‌డీఏ, ఎన్‌ఏకు అభ్యర్థుల ఖారారుకు రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ. తొలిదశలో యూపిఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్ష నిర్వహిస్తుంది.

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది.09 జనవరి 2024
  • ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు సవరణ తేది.10-16 నుండి జనవరి 2024 వరకు
  • ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష తేది.21 ఏప్రిల్‌ 2024



Also Read :

Post a Comment

0 Comments