
ఇండియా జీయోగ్రఫీ జీకే ప్రశ్నలు - జవాబులు Part - 5
Gk Questions in telugu (India Geography) Part - 5
☛ Question No.1
భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) రాజస్థాన్
4) మహారాష్ట్ర
5) గుజరాత్
ఎ) 1, 3, 2, 4, 5
బి) 1, 4, 3, 2, 5
సి) 3, 4, 1, 2, 5
డి) 3, 1, 4, 2, 5
జవాబు : డి) 3, 1, 4, 2, 5
☛ Question No.2
భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిచిన్న రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) సిక్కిం
2) గోవా
3) త్రిపుర
4) నాగాలాండ్
5) మిజోరాం
ఎ) 1, 2, 3, 4, 5
బి) 2, 3, 1, 4, 5
సి) 2, 1, 3, 4, 5
డి) 1, 2, 5, 3, 4
జవాబు : సి) 2, 1, 3, 4, 5
☛ Question No.3
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది
2) విస్తీర్ణం పరంగా తెలంగాణ దేశంలో 12వ స్థానంలో ఉంది
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కావు
జవాబు : బి) 1 మాత్రమే
☛ Question No.4
8 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న భారత రాష్ట్రం ఏది ?
ఎ) అస్సాం
బి) ఛత్తిస్‌ఘడ్
సి) ఉత్తరప్రదేశ్
డి) మధ్యప్రదేశ్
జవాబు : సి) ఉత్తరప్రదేశ్
☛ Question No.5
ఈ క్రిందవాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) ఈశాన్యంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలను సెవెన్ సిస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు
2) వీటి యొక్క ముఖ్య లక్షణం అల్ప జనసాంద్రత, అధిక అటవీ విస్తీర్ణత, అధిక జాతులు, తక్కువ ఆర్థిక కార్యకలాపాలు
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కావు
జవాబు : ఎ) 1 మరియు 2
☛ Question No.6
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) 23 1/2 ఉత్తర అక్షాంశమును కర్కాటక రేఖ అంటారు
2) కర్కాటకరేఖ భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా పోతుంది
3) కర్కాటక రేఖ అతి ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్ర మధ్యప్రదేశ్
ఎ) 1, 2 మరియు 3
బి) 2 మరియు 3
సి) 1 మరియు 2
డి) 1 మరియు 3
జవాబు : డి ) 1 మరియు 3
☛ Question No.7
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) భారతదేశంలో 5 భూపరివేష్టిత రాష్ట్రాలున్నాయి
2) అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం చత్తిస్‌ఘడ్
3) అతిచిన్న భూపరివేష్టిత రాష్ట్రం జార్ఘండ్
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మాత్రమే
సి) 1 మరియు 2
డి) 2 మరియు 3
జవాబు : బి) 1 మాత్రమే
Also Read :
☛ Question No.8
ఈ క్రింది ఏ ఖండానికి భూరివేష్టిత దేశాలు లేవు ?
ఎ) ఐరోపా
బి) అమెరికా
సి) ఆస్ట్రేలియా
డి) ఆసియా
జవాబు : సి) ఆస్ట్రేలియా
☛ Question No.9
ఈ క్రిందివాటిలో భారతదేశంలో సరిహద్దును పంచుకోని దేశం ఏది ?
ఎ) భూటాన్
బి) నేపాల్
సి) ఆప్ఘనిస్తాన్
డి) కజకిస్తాన్
జవాబు : డి) కజకిస్తాన్
☛ Question No.10
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) భారతదేశం ప్రపంచంలోనే 3వ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కల్గి ఉంది
2) ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు కల్గిన దేశం రష్యా
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు
జవాబు : బి) 1 మాత్రమే
☛ Question No.11
భారతదేశం అత్యధిక సరిహద్దును పంచుకుంటున్న దేశాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) పాకిస్తాన్
2) బంగ్లాదేశ్
3) చైనా
4) ఆప్ఘనిస్తాన్
ఎ) 2, 3, 1, 4
బి) 3, 2, 1, 4
సి) 2, 1, 3, 4
డి) 3, 1, 2, 4
జవాబు : ఎ) 2, 3, 1, 4
☛ Question No.12
ఆప్ఘనిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న ఈ క్రింది ప్రాంతం ఏది ?
ఎ) జమ్మూ కాశ్మీర్
బి) లడక్
సి) సిక్కిం
డి) హిమాచల్ ప్రదేశ్
జవాబు : బి) లడక్
☛ Question No.13
మూడు వైపుల ఒకే దేశంతో సరిహద్దును పంచుకుంటున్న భారత రాష్ట్రం ఏది ?
ఎ) ఉత్తరాఖండ్
బి) మిజోరాం
సి) అస్సాం
డి) త్రిపుర
జవాబు : డి) త్రిపుర
☛ Question No.14
అంతర్జాతీయ భూ సరిహద్దుతో పాటు జల సరిహద్దు రెండింటిని పంచుకుంటున్న భారత రాష్ట్రం ఏది ?
ఎ) పశ్చిమబెంగాల్
బి) సిక్కిం
సి) రాజస్థాన్
డి) కేరళ
జవాబు : ఎ) పశ్చిమబెంగాల్
☛ Question No.15
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత భూభాగం ఏది ?
ఎ) లక్షదీవులు
బి) గ్రేట్ నికోబార్ దీవులు
సి) అండమాన్ దీవులు
డి) నికోబార్ దీవులు
జవాబు : బి) గ్రేట్ నికోబార్ దీవులు
0 Comments