
ఇండియా బడ్జెట్ జీకే ప్రశ్నలు - జవాబులు
Indian Polity MCQ Gk Questions with Answers in Telugu
☛ Question No.1
పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారు ?
ఎ) ప్రధానమంత్రి
బి) రాష్ట్రపతి
సి) ఆర్థిక శాఖ మంత్రి
డి) రిజర్వు బ్యాంక్ గవర్నర్
జవాబు : సి) ఆర్థిక శాఖ మంత్రి
☛ Question No.2
పార్లమెంట్‌లోని ఏ సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు ?
ఎ) లోక్‌సభ
బి) రాజ్యసభ
సి) ఎ మరియు బి
డి) రెండూ కాదు
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.3
భారతదేశంలో వ్యక్తులు మరియు వ్యాపారులు సంపాదించే ఆదాయంపై ఏ పన్ను విధించబడుతుంది ?
ఎ) జీఎస్టీ
బి) కార్పోరేట్ పన్ను
సి) కస్టమ్ డ్యూటీ
డి) ఆదాయపు పన్ను
జవాబు : డి) ఆదాయపు పన్ను
☛ Question No.4
భారతదేశంలో కేంద్ర బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటీ ?
ఎ) విదేశాంగ విధానం వివరించడం
బి) వడ్డీరేట్లను నిర్ణయించడం
సి) ఆర్థిక అభివృద్ది ప్రణాళిక
డి) సామాజిక కార్యక్రమాలను అమలు చేయడం
జవాబు : సి) ఆర్థిక అభివృద్ది ప్రణాళిక
☛ Question No.5
ఈ క్రిందివాటిలో ప్రభుత్వానికి పన్నుయేతర ఆదాయ వనరు ఏది ?
ఎ) ఆదాయపు పన్ను
బి) డివిడెండ్‌లు మరియు లాభాలు
సి) కార్పోరేట్ పన్ను
డి) జీఎస్టీ
జవాబు : బి) డివిడెండ్లు, లాభాలు
☛ Question No.6
కేంద్ర బడ్జెట్‌తో పాటు ఫైనాన్స్ బిల్లు ఎందుకు ప్రవేశపెడతారు ?
ఎ) ఆర్థిక విధానాలను వివరించడం
బి) కొత్త పన్నులను ప్రతిపాదించడం మరియు ఇప్పటికే ఉన్న వాటిని సవరించడం
సి) సామాజిక కార్యక్రమాలకు నిధులు కేటాయించడం
డి) ప్రభుత్వ విదేశీ సంబంధాలను వివరించడం
జవాబు : బి) కొత్త పన్నులను ప్రతిపాదించడం మరియు ఇప్పటికే ఉన్న వాటిని సవరించడం
☛ Question No.7
జీతాలు మరియు ప్రభుత్వ నిర్వహణ వంటి ప్రభుత్వ రోజువారీ ఖర్చుల కోసం వెచ్చించే బడ్జెట్‌ను ఏమని పిలుస్తారు ?
ఎ) క్యాపిటల్ బడ్జెట్
బి) రెవెన్యూ బడ్జెట్
సి) అభివృద్ది బడ్జెట్
డి) ఆర్థిక బడ్జెట్
జవాబు : బి) రెవెన్యూ బడ్జెట్
Also Read :
☛ Question No.8
బడ్జెట్‌లో ఆర్థిక రంగంలో చేపట్టిన ప్రభుత్వ విధానాలు, సవాళ్లు మరియు సంస్కరణల గురించి తెలిపేది ఏది ?
ఎ) వార్షిక ఆర్థిక ప్రకటన
బి) ఆర్థిక బిల్లు
సి) ఆర్థిక సర్వే
డి) బడ్జెట్ ప్రసంగం
జవాబు : సి) ఆర్థిక సర్వే
☛ Question No.9
భారతదేశంలో ఉత్పత్తి మరియు పంపిణీలో ఉన్న వస్తువులు మరియు సేవలపై విధించే పన్ను ఏది ?
ఎ) ఆదాయపు పన్ను
బి) కార్పోరేట్ పన్ను
సి) ఎక్సైజ్ డ్యూటీ
డి) వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ)
జవాబు : డి) వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ)
☛ Question No.10
పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో ‘‘జీరో అవర్’’ యొక్క ప్రాముఖ్యత ఏమిటీ ?
ఎ) ఇది అధికారికంగా బడ్జెట్‌ను సమర్పించే సమయం
బి) సభ్యులు ముందస్తు నోటీసు లేకుండా ముఖ్యమైన సమస్యలను లెవనెత్తే సమయం
సి) బడ్జెట్ ముగింపు చేసే సమయం
డి) బడ్జెట్ ప్రాతిపాదలపై ఓటింగ్ జరిగే సమయం
జవాబు : బి) సభ్యులు ముందస్తు నోటీసు లేకుండా ముఖ్యమైన సమస్యలను లెవనెత్తే సమయం
☛ Question No.11
ప్రభుత్వ వ్యయం మరియు ఆదాయం సమానమైనప్పుడు ఏ రకం బడ్జెట్ అంటారు ?
ఎ) లోటు బడ్టెట్
బి) మిగులు బడ్జెట్
సి) సమాన బడ్జెట్
డి) సంతులిత బడ్జెట్
జవాబు : డి) సంతులిత బడ్జెట్
☛ Question No.12
ప్రభుత్వ వ్యయం కంటే ఆదాయం తక్కువైనప్పుడు ఏ రకమైన బడ్జెట్‌గా పిలుస్తారు ?
ఎ) లోటు బడ్టెట్
బి) మిగులు బడ్జెట్
సి) సమాన బడ్జెట్
డి) సంతులిత బడ్జెట్
జవాబు : ఎ) లోటు బడ్టెట్
☛ Question No.13
ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువైనప్పుడు ఏ లోటు ఏర్పడుతుంది ?
ఎ) విత్తలోటు
బి) ప్రాథమిక లోటు
సి) రెవెన్యూ లోటు
డి) ప్రభావిత లోటు
జవాబు : సి) రెవెన్యూ లోటు
☛ Question No.14
స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సారిగా బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు ?
ఎ) మొరార్జీ దేశాయి
బి) జవహర్‌లాల్ నెహ్రూ
సి) సర్ధార్ వల్లభాయి పటేల్
డి) లాల్ బహదూర్ శాస్త్రీ
జవాబు : ఎ) మొరార్జీ దేశాయి
☛ Question No.15
బడ్జెట్ ప్రక్రియలో ‘ఓట్ ఆన్ అకౌంట్ ’ అంటే ఏమిటీ ?
ఎ) వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడం
బి) బడ్జెట్ పనితీరుపై సమీక్ష నిర్వహించడం
సి) నిర్ధిష్ట ప్రాజేక్టులకు నిధులు మంజూరు చేయడం
డి) బడ్జెట్ ఆమోదానికి ముందు అత్యవసర ఖర్చుల కోసం పార్లమెంటు ఆమోదం పొందడం
జవాబు : డి) బడ్జెట్ ఆమోదానికి ముందు అత్యవసర ఖర్చుల కోసం పార్లమెంటు ఆమోదం పొందడం
0 Comments