IB Notification 226 ACIO Vacancies,
కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ -2 (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా కేంద్రంలోని కీలకశాఖలో పనిచేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2, టెక్నికల్ రెండు విభాగాలలో పోస్టులు ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 79 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 147 పోస్టులున్నాయి. 2021, 2022, 2023 గేట్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్) పేపర్లలో ఉత్తీర్ణతను ధరఖాస్తుకు అర్హత పేర్కొన్నారు. వీరి నుండి వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి గేట్ స్కోర్ ఆధారంగా తదుపరి దశకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 12 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి.ఇందులో ఉద్యోగం సాధించిన వారికి 1లక్ష జీతం ఉంటుంది.
➺ మొత్తం పోస్టులు 226
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 79
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ - 147
➺ అర్హతలు
ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / కంప్యూటర్స్ సైన్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో బీఈ/బీటెక్స్ ఉత్తీర్ణత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో ఫిజిక్స్ సబ్జెక్టుతో పీజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో పీజీ ఉత్తీర్ణత సాధించాలి.
➺ వయస్సు
- 12 జనవరి 2024 నాటికి 18-27 సంవత్సరాలు నిండి ఉండాలి. (రిజర్వేషన్ బట్టి వయస్సులో సడలింపు ఉంటుంది)
➺ ముఖ్యమైన తేదీలు
- ధరఖాస్తు విధానం ఆన్‌లైన్
- చివరి తేది.12 జనవరి 2024
- ఇంటర్యూ - మార్చి / ఏప్రిల్ 2024
0 Comments