చోళులు జీకే ప్రశ్నలు - జవాబులు Part - 1
Chola Dynasty GK Questions with Answers in Telugu
☛ Question No.1
ప్రాచీన చోళుల గురించి ఆధారాలు దేని ద్వారా లభించాయి ?
ఎ) సంగమ సాహిత్యం
బి) అశోకుడి శాసనాలు
సి) ఎ మరియు బి
డి) గుప్తుల శాసనాలు
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.2
9వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు ?
ఎ) కులోత్తంగా చోళ
బి) విజయాల చోళ
సి) రాజేంద్ర చోళ
డి) కరికాలుడు
జవాబు : బి) విజయాల చోళ
☛ Question No.3
గంగానది లోయ నుండి ఆగ్నేయ ఆసియా దేశాల వరకు రాజ్యాన్ని విస్తరించిన చోళ రాజు ఎవరు ?
ఎ) కులోత్తంగా చోళ
బి) విజయాలయ చోళ
సి) మొదటి రాజరాజచోళ
డి) మొదటి రాజేంద్రచోళ
జవాబు : డి) మొదటి రాజేంద్రచోళ
☛ Question No.4
బృహదీశ్వర ఆలయాన్ని తంజావురు వద్ద నిర్మించిన చోళ రాజు ఎవరు ?
ఎ) పరాంతక - 1
బి) విజయాలయ చోళ
సి) రాజేంద్ర చోళ -1
డి) రాజరాజచోళ - 1
జవాబు : డి) రాజరాజచోళ - 1
☛ Question No.5
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) చోళుల కాలంనాటి మంత్రిమండలి - ఊడంకుట్టం
2) చోళుల కాలంలో ప్రభుత్వంలో పెద్ద అధికారి - ఓలైనాయగన్
3) చోళుల కాలంలో ఉన్నతాధికారులు - పెరుందారం
4) చోళుల కాలంలో దిగువస్థాయి అధికారులు - సిరుందారం
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 2, 3, 4
డి) 1, 3, 4
జవాబు : ఎ) 1, 2, 3, 4
☛ Question No.6
ఏ రాజుల కాలంలో మండలం, వలనాడు, నాడు అనేవి విభాగాలున్నాయి. ?
ఎ) పాండ్యులు
బి) చోళులు
సి) చేర
డి) కాకతీయ
జవాబు : బి) చోళులు
☛ Question No.7
చోళుల కాలంనాటి పరిపాలన గురించి తెలిపే శాసనం ఏది ?
ఎ) గంగైకొండ చోళపుర శాసనం
బి) ఉత్తర మేరూర్ శాసనం
సి) తంజావూరు శాసనం
డి) పైవన్నీ
జవాబు : బి) ఉత్తర మేరూర్ శాసనం
Also Read :
☛ Question No.8
చోళుల కాలం నాటి గ్రామ కమిటీ సభ్యులు (కుదువోలై) కి ఉండాల్సిన అర్హతలు ఏవి ?
1) 35-70 సంవత్సరాల మధ్య ఉండాలి
2) సొంత భూమి ఉండాలి
3) సొంత ఇల్లు ఉండాలి
4) వేదాలు, ధర్మశాస్త్రాలు వచ్చి ఉండాలి
ఎ) 1, 2, 3
బి) 1, 2, 3, 4
సి) 2, 3, 4
డి) 1, 3, 4
జవాబు : బి) 1, 2, 3, 4
☛ Question No.9
చోళుల కాలం నాటి భూదానాలను జత చేయండి ?
1) దేవదాన
2) శాలభోగ
3) వెల్లన్‌వాగై
4) పల్లించ్చందం
ఎ) దేవాలయ నిర్వహణ భూమి
బి) జైన మతస్థుల భూమి
సి) బ్రాహ్మణేతరుల భూమి
డి) పాఠశాల నిర్వహణ భూమి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
జవాబు : బి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
☛ Question No.10
చోళుల పరిపాలన విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి ?
1) వలనారులు
2) నాడులు
3) మండలాలు
4) కుర్రాలు
ఎ) 1, 2, 4, 3
బి) 3, 4, 2, 1
సి) 1, 2, 3, 4
డి) 4, 2, 1, 3
జవాబు : డి) 4, 2, 1, 3
☛ Question No.11
చోళుల కాలం నాటి పదాలను జత చేయండి ?
1) ఉర్
2) సభ
3) నగరం
4) ఎరిపత్తి
ఎ) ఒక పట్టణ సభ
బి) చెరువు భూమి
సి) సాధారణ గ్రామ, సాధారణ సభ
డి) బ్రాహ్మణులు సాధారణ సభ
ఇ) పచ్చిక భూమి
ఎ) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
బి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
జవాబు : సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
☛ Question No.12
చోళులు రాజకీయ వివాహ సంబంధాలను ఎవరితో కొనసాగించేవారు ?
ఎ) మధురైకి చెందిన పాండ్యులతో
బి) బాదామికి చెందిన చాళుక్యులతో
సి) వెంగికి చెందిన చాళుక్యులతో
డి) కళ్యాణి చెందిన చాళుక్యులతో
జవాబు : డి) కళ్యాణి చెందిన చాళుక్యులతో
☛ Question No.13
ఏ రెండు రాజ్యాలను కులోత్తంగుడు వీలినం చేశాడు ?
ఎ) చోళ - తూర్పు గంగుల రాజ్యాలు
బి) పల్లవ - చోళ రాజ్యాలు
సి) చోళ - తూర్పు చాళుక్య రాజ్యాలు
డి) చోళ - పాండ్య రాజ్యాలు
జవాబు : సి) చోళ ` తూర్పు చాళుక్య రాజ్యాలు
☛ Question No.14
ఈ క్రిందివాటిలో రాజేంద్ర చోళుడిని ఏ బిరుదుతో పిలిచేవారు ?
ఎ) రాజధిరాజ
బి) సింగలాంతక
సి) గంగైకొండ
డి) పైవన్నీ
జవాబు : సి) గంగైకొండ
☛ Question No.15
చోళులు నిర్మించిన ఆలయాల్లో మనకు ఏవి ప్రముఖంగా కనిపిస్తాయి ?
ఎ) విగ్రహాలు
బి) గోపురాలు
సి) విమానాలు
డి) స్తంభాలు
జవాబు : బి) గోపురాలు
- Chola Dynasty Gk Questions in Telugu Part - 2
- Chola Dynasty Gk Questions in Telugu Part - 3
- Chola Dynasty Gk Questions in Telugu Part - 4
0 Comments