
ఇండియన్ జీయోగ్రఫీ (నీటిపారుదల) జీకే ప్రశ్నలు - జవాబులు
Irrigation MCQ Gk Questions with Answers in Telugu
☛ Question No.1
భారతదేశంలో నీటి పారుదల ప్రధానంగా ఎన్ని మార్గాలపై ఆధారపడి ఉంది ?
ఎ) కాలువలు
బి) చెరువులు
సి) బావులు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.2
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) భారతదేశంలో కాలువల ద్వారా 24 శాతం నీటి పారుదల కల్పిస్తున్నారు
2) భారతదేశంలో చెరువుల ద్వారా 3 శాతం నీటి పారుదల కల్పిస్తున్నారు
3) భారతదేశంలో బావుల ద్వారా 64 శాతం నీటి పారుదల కల్పిస్తున్నారు.
ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.3
భారతదేశంలో బావుల ద్వారా అత్యధిక నీటిపారుదల జరుగుతున్న రాష్ట్రాలు ఏవి ?
ఎ) విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, శాతం పరంగా గుజరాత్
బి) విస్తీర్ణం పరంగా మహరాష్ట్ర, గుజరాత్, శాతం పరంగా తెలంగాణ
సి) విస్తీర్ణం పరంగా కర్ణాటక, తమిళనాడు, శాతం పరంగా ఉత్తరప్రదేశ్
డి) విస్తీర్ణం పరంగా గుజరాత్, హర్యానా, శాతం పరంగా తమిళనాడు
జవాబు : ఎ) విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, శాతం పరంగా గుజరాత్
☛ Question No.4
ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ?
1) చిన్న చిన్న నీటి ప్రవాహనాలకు అడ్డంగా నిర్మించేవాటిని చెక్‌డ్యామ్‌లు అంటారు
2) వర్షాభావ ప్రాంతాల్లో నేలల సంరక్షణ కోసం ప్రవాహ దిశను మళ్లిస్తూ నిర్మించే వాటిని డ్రైడ్యామ్స్ అంటారు
3) నీటిలో మునిగి ఉన్న ప్రాంతంలో నిర్మాణాలు చేయడానికి ఆ నీటిని తొలగించడం కోసం నిర్మించే వాటిని కాపర్ డ్యామ్స్ అంటారు.
4) నది నుండి లేదా ఆనకట్ట నుండి ప్రవహిస్తున్న నీటిని శాస్త్రీయంగా లెక్కించే వాటిని ఓవర్‌ప్లో డ్యామ్స్ అంటారు.
ఎ) 1, 2 మరియు 4 మాత్రమే
బి) 2, 3 మరియు 4 మాత్రమే
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 3 మరియు 4 మాత్రమే
జవాబు : సి) 1, 2, 3 మరియు 4
☛ Question No.5
ఈ క్రిందివాటిలో ప్రాజేక్టుల గురించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) 10,000 హెక్టార్ల కన్నా ఎక్కువ సాగు భూమికి నీటిని అందించేవి భారీ తరహా ప్రాజేక్టులు
2) 2000 నుండి 10,000 హెక్లార్ల సాగు నీటిని అందించేవి మధ్యతరహా ప్రాజేక్టులు
3) 5000 కన్నా తక్కువ హెక్లార్ల సాగుభూమికి నీటిని అందించేవి చిన్న తరహా ప్రాజేక్టులు
ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 1, 2 మరియు 3
జవాబు : సి) 1 మరియు 2 మాత్రమే
2000 కన్నా తక్కువ సాగుభూమికి నీటిని అందించేవి చిన్న తరహా ప్రాజేక్టులు
Also Read :
☛ Question No.6
ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ‘ద గ్రాండ్ కెనాల్ ’ ఏ దేశంలో ఉంది ?
ఎ) రష్యా
బి) చైనా
సి) అమెరికా
డి) ఇండియా
జవాబు : బి) చైనా
☛ Question No.7
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) భారీ కాంక్రీటు డ్యామ్‌లను గ్రావిటీ డ్యామ్‌లంటారు
2) ‘వి’ ఆకారంలో ఉంటే నదీలోయలకు అడ్డంగా నిర్మించేవాటిని ఆర్చ్ డ్యామ్స్ అంటారు.
3) రాళ్ల మధ్య ఖాళీలను మట్టి లేదా కాంక్రీటుతో పూడ్చేవాటిని ఎమ్‌బ్యాంక్‌మెంట్ డ్యామ్స్ అంటారు.
ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.8
నాగార్జున సాగర్ ప్రాజేక్టుకు సంబందించి ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) నాగార్జున సాగర్ డ్యామ్‌ను కృష్ణా నదిపై నందికొండ గ్రామం వద్ద 1967లో నిర్మించారు.
బి) ఈ డ్యామ్‌కు వెంకటేశ్వర్‌రావు ఇంజనీర్‌గా వ్యవహరించారు.
సి) ఇది ప్రపంచంలోని అతి ఎత్తయిన రాతితో కట్టిన ఆనకట్ట ప్రాజేక్టు
డి) ఈ ప్రాజేక్టు జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రీ అనే రెండు కాలువలున్నాయి.
జవాబు : బి) ఈ డ్యామ్‌కు వెంకటేశ్వర్‌రావు ఇంజనీర్‌గా వ్యవహరించారు.
ఈ డ్యామ్‌కు కానూరి లక్ష్మణరావు ఇంజనీర్‌గా వ్యవహరించారు
☛ Question No.9
ఈ క్రిందివాటిలో ఇందిరాగాంధీ కాలువ గురించి సరికాని దానిని గుర్తించండి ?
1) ఈ కాలువ గుండా సట్లేజ్, రావి, బియాస్ మూడు నదుల నీరు ప్రవహిస్తుంది
2) దీని యొక్క ప్రధాన కాలువ పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి మూడు రాష్ట్రాలకు సాగు నీటిని అందిస్తుంది.
3) ఇది దేశంలోనే అతి పొడవైన వ్యవసాయ కాలువ (650 కి.మీ) గుర్తింపు సాధించింది.
ఎ) 1, 2 మరియు 3
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : ఎ) 1, 2 మరియు 3
☛ Question No.10
దామోదర్ వ్యాలీ సంబందించి ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) దామోదర్, దాని ఉపనదులపై నిర్మించిన ఆరు ప్రాజేక్టులను కలిపి దామోదర్ వ్యాలీ ప్రాజేక్టు అని పిలుస్తారు
బి) 1948లో దేశంలో మొట్టమొదటి వరద నియంత్రణ కార్యక్రమంగా దామోదర్ వ్యాలీ ప్రాజేక్టును నిర్మించారు
సి) ఇప్పటివరకు కోనార్, పాంచెట్, తిలయ, మైదాన్ నాలుగు డ్యామ్‌లను నిర్మించారు
డి) ఇది అమెరాకాలోని టెన్నిస్ వ్యాలీ నమూనాను పోలీ ఉంటుంది
జవాబు : ఎ) దామోదర్, దాని ఉపనదులపై నిర్మించిన ఆరు ప్రాజేక్టులను కలిపి దామోదర్ వ్యాలీ ప్రాజేక్టు అని పిలుస్తారు
ఎ) దామోదర్, దాని ఉపనదులపై నిర్మించిన నాలుగు ప్రాజేక్టులను కలిపి దామోదర్ వ్యాలీ ప్రాజేక్టు అని పిలుస్తారు
0 Comments