
భారతరత్న (Bharatha Rathna) అత్యున్నత పురస్కారం
Gk in Telugu | General Knowledge in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భారతదేశంలో అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారం. ఇట్టి భారతరత్న అవార్డు 1954 సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు. భారత ప్రభుత్వం చేత భారత గణతంత్ర దినోత్సమైన జనవరి 26 తేదిన కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక, ప్రజాసేవ, క్రీడా వంటి రంగాలలో అశేష కృషి చేసిన వారికి భారతరత్న పురస్కారాన్ని అందిస్తుంది. అయితే ఇట్టి భారతరత్న అవార్డు పొందిన వారు వారియొక్క పేరుకు ముందుగాని, తర్వాత గాని భారతరత్న అనే పేరును ప్రస్తావించరాదు. భారత ప్రభుత్వం అందించే భారతరత్న పురస్కారంలో రాష్ట్రపతి సంతకంతో కూడిన రాగి ఆకు పై ఒకవైపు భారతదేశ చిహ్నం, మరోవైపు దేవనాగరి లిపిలో రాయబడిన సత్యమేవజయతే అనే వ్యాక్యాల మద్యలో వెలుగు విరజిమ్మే సూర్యుడు ఉంటాడు. భారతదేశంలో మొట్టమొదటి అత్యున్నత పురస్కారం భారతరత్న. అలాగే రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్, 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషన్, 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ
భారతరత్న అవార్డు పొందినవారు | |
---|---|
పేరు | సంవత్సరం |
సి. రాజగోపాలచారి | 1954 |
సర్వేపల్లి రాధకృష్ణన్ | 1954 |
సి.విరామన్ | 1954 |
జవహర్‌లాల్ నెహ్రూ | 1955 |
భగవాన్ దాస్ | 1955 |
మోక్షగుండం విశ్వేశ్వరయ్య | 1955 |
గోవింద్ వల్లభ్‌పంత్ | 1957 |
డి.కెేశవ్ కార్వే | 1958 |
బిదాన్ చంద్ర రాయ్ | 1961 |
పురుషోత్తమదాస్ టాండన్ | 1961 |
బాబు రాజేంద్రప్రసాద్ | 1962 |
జాకీర్ హుస్సెన్ | 1963 |
పాండురంగన్ వమన్ కానే | 1963 |
లాల్ బహదూర్ శాస్త్రీ | 1966 |
ఇందిరాగాంధీ | 1971 |
వి.వి గిరి | 1975 |
కె.కామరాజ్ నాడార్ | 1976 |
మదర్‌థెరిసా | 1980 |
ఆచార్య వినోభాభావే | 1983 |
ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ | 1987 |
యం.జి రామచంద్రన్ | 1988 |
బి.ఆర్.అంబేద్కర్ | 1990 |
నెల్సన్ మండేలా | 1990 |
రాజీవ్‌గాంధీ | 1991 |
సర్ధార్ వల్లభాయి పటేల్ | 1991 |
Also Read :
మొరార్జీ దేశాయి | 1991 |
జే.ఆర్.డి టాటా | 1992 |
మౌలానా అబుల్ కలాం అజాద్ | 1992 |
సత్యజిత్ రే | 1992 |
గుల్జారీలాల్ నందా | 1997 |
అరుణా అసఫ్ అలీ | 1997 |
ఎ.పి.జె అబ్దుల్ కలాం | 1997 |
ఎం.ఎస్ సుబ్బలక్ష్మి | 1998 |
చిదంబరం సుబ్రమణ్యం | 1998 |
జయప్రకాశ్ నారాయణ్ | 1999 |
అమర్త్యసేన్ | 1999 |
పండిట్ రవిశంకర్ | 1999 |
గోపీనాథ్ బార్దోలియా | 1999 |
బిస్మిల్లాఖాన్ | 2001 |
లతామంగేష్కర్ | 2001 |
పండిత్ భీమ్‌సేన్ జోషి | 2008 |
చింతామణి నాగేశ రామచంద్రరావు | 2014 |
సచిన్ టెండుల్కర్ | 2014 |
మదన్‌మోహన్ మాలవీయ | 2015 |
అటల్ బీహారి వాజ్‌పేయి | 2015 |
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ | 2019 |
భూపేన్ హజారికా | 2019 |
అమృతరావు దేశ్‌ముఖ్ | 2019 |
కర్పూరి ఠాకూర్ | 2024 |
ఎల్.కె అద్వానీ | 2024 |
పి.వి నరసింహరావు | 2024 |
చరణ్‌సింగ్ | 2024 |
ఎం.ఎస్ స్వామినాథన్ | 2024 |
భారతరత్న అవార్డు గురించి మరిన్ని విషయాలు
- భారతరత్న పొందిన మొదటి వ్యక్తి సి. రాజగోపాలాచారి
- భారతరత్న పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ
- భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ
- భారతరత్న పొందిన తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్
- భారతరత్న తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్
- అతిపెద్ద వయస్సులో భారతరత్న పొందిన వ్యక్తి డి.కె కార్వే (100 సం॥లు)
- భారతరత్న పొందిన మొదటి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్
- మరణాంతరం అవార్డు పొందిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రీ
- భారతరత్నతో పాటు నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు సి.వి రామన్, మదర్‌థెరిస్సా, అమర్త్యసేన్
0 Comments