
రాజ్యాంగ పరిషత్ ముఖ్యమైన కమిటీలు
రాజ్యాంగ ముసాయిదాను 21 ఫిబ్రవరి 1948న ప్రచురించారు. రాజ్యాంగ ప్రతిపై 7635 సవరణలు ప్రతిపాదించగా వాటిలో 2473 చర్చకు వచ్చాయి. ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ 26 నవంబర్ 1949న ఆమోదించి చట్టంగా మార్చింది. రాజ్యాంగ రూపకల్పనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగ పరిషత్ ముసాయిదాను 115 రోజుల్లో తయారుచేసింది.
భారత రాజ్యాంగ పరిషత్ చిట్టచివరి సమావేశం 24 జనవరి 1950న జరిగింది. ఈ సమావేశానికి 284 మంది సభ్యులు హజరయ్యారు. ఈ సమావేశంలో రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగం ప్రకారం భారత గణతంత్ర ప్రథమ రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకుంది. భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. ఈ రోజునే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము.
భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనతో పాటుగా, కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించింది ఆమోదం తెలిపింది. భారత రాజ్యాంగం ఏనుగును గుర్తుగా రూపొందించారు. మొదటి స్పీకర్‌గా మౌలాంకర్‌ను ఎన్నుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 64 లక్షల రూపాయలు ఖర్చు చేసారు.
రాజ్యాంగ పరిషత్ ముఖ్యమైన కమిటీలు | |
---|---|
కమిటీ | చైర్మన్ |
సలహాసంఘం | వల్లభాయ్ పటేల్ |
సారథ్య కమిటీ | రాజేంద్రప్రసాద్ |
ప్రాథమిక హక్కుల కమిటీ | వల్లభభాయ్ పటేల్ |
ప్రాథమిక హక్కుల ఉప కమిటీ | జె.బి కృపలాని |
కేంద్ర అధికారాల కమిటీ | జవహర్‌లాల్ నెహ్రూ |
కేంద్ర రాజ్యాంగ కమిటీ | జవహర్‌లాల్ నెహ్రూ |
రాష్ట్రాల కమిటీ | జవహర్‌లాల్ నెహ్రూ |
రూల్ కమిటీ | రాజేంద్రప్రసాద్ |
జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ | రాజేంద్రప్రసాద్ |
మైనార్టీ సబ్ కమిటీ | హెచ్.సి ముఖర్జీ |
సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ | వరదాచారి అయ్యర్ |
రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ | వల్లభబాయ్ పటేల్ |
ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ | గోపినాథ్ బోర్డోలాయ్ |
హౌస్ కమిటీ | పట్టాభి సీతారామయ్య |
రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ | జి.వి మౌలాంకర్ |
సభా వ్యవహరాల కమిటీ | కె.ఎం మున్షి |
రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ | కృష్ణస్వామి అయ్యర్ |
0 Comments