Jnanpith Award in Telugu | జ్ఞానపీఠ్‌ అవార్డు ఎవరికిస్తారు ? | Gk in Telugu | General Knowledge in Telugu

Jnanpith Award in Telugu |  జ్ఞానపీఠ్‌ అవార్డు ఎవరికిస్తారు ?

 భారతీయ జ్ఞానపీఠ్‌ అవార్డు 
2024 సంవత్సరంలో జ్ఞానపీఠ్‌ అవార్డు ఎవరికి లభించింది ?
Gk in Telugu | General Knowledge in Telugu 

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 


జ్ఞానపీఠ్‌ అవార్డు భారతదేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారం. ఈ అవార్డును 1964 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. జ్ఞానపీఠ్‌ అవార్డును 1965 సంవత్సరం నుండి అందించడం జరుగుతుంది. దీనిని సాహు శాంతిప్రసాద్‌ జైన్‌, అతని భార్య శ్రీమతి రొమాజైన్‌లు ఏర్పాటు చేశారు. జ్ఞానపీఠ్‌ అవార్డును ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో సాహిత్య రంగంలో సేవలు అందించిన వారికి బహుకరిస్తారు. 1981 సంవత్సరం వరకు రచనకు, 1982 నుండి సాహిత్య రంగంలో చేసిన కృషికి ఈ అవార్డు అందిస్తున్నారు. ఈ అవార్డును మొట్టమొదటిసారిగా శంకర్‌ కురూప్‌ (1965) ఒడుక్కుజుల్‌ (మళయాళం) రచనకు అందుకున్నారు. 

ఈ అవార్డు కింద 11 లక్షల నగదుతో పాటు కంచు వాగ్దేవి విగ్రహాన్ని బహుకరిస్తారు. ఇప్పటివరకు ముగ్గురు తెలుగువారు జ్ఞానపీఠ్‌ అవార్డును అందుకున్నారు. 


Also Read :


2024 సంవత్సరంలో ప్రకటించిన జ్ఞానపీఠ్‌ అవార్డులకు ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్‌ మరియు సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచర్యలు ఎంపికయ్యారు. 

➺ జ్ఞానపీఠ్‌ అవార్డు అందుకున్న తెలుగు వారి వివరాలు : 

  • విశ్వనాథ సత్యనారాయణ - శ్రీరామాయణ కల్పవృక్షం - 1970
  • సి.నారాయణరెడ్డి - విశ్వంబర - 1988
  • రావూరి భరద్వాజ - పాకుడురాళ్లు - 2012

➺ 58వ జ్ఞానపీఠ్‌ అవార్డులు (2024) - ఎంపికైనవారు :

గుల్జార్‌

ప్రముఖ ఉర్దూ కవి అయిన గుల్జార్‌ 2023 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. గుల్జార్‌గా సుప్రసిద్దుడైన సంపూరన్‌ సింగ్‌ కల్రా హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఉర్దూ సంగీతంలో బహుముఖ ప్రావీణ్యం కలవారు. గుల్జార్‌కు 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్‌ పాల్కే అవార్డుతో పాటు 2004లో పద్మభూషణ్‌ అవార్డు వరించింది. 

రామభద్రాచార్యలు 

రామభద్రాచార్యలు చిత్రకూట్‌లోని తులసీపీఠ్‌ వ్యవస్థాపకుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. హిందూ ఆధ్యాత్మిక గురువగానూ గుర్తింపు పొందారు. ఈయన సుమారు 240 వరకూ పుస్తకాలు, ఇతిహాసాలను రచించాడు. ఈయన 22 భాషల్లో పండితుడు. 2015లో ఈయను పద్మవిభూషణ్‌ పురస్కారం దక్కింది.  



Also Read :

Post a Comment

0 Comments