
తెలంగాణ ఉద్యమ చరిత్ర (1969) జీకే ప్రశ్నలు - జవాబులు Part -3
Telangana History (1969) Questions in Telugu Part - 3
☛ Question No.1
1969 ఉద్యమంలో రవీంద్రనాథ్ దీక్షకు సంబంధించి ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 08 జనవరి 1969న తెలంగాణ రక్షణల అమలు కోసం ఖమ్మం పట్టణంలోని గాంధీచౌక్ వద్ద ఇతను దీక్షను ప్రారంభించాడు.
2) దీక్షలో భాగంగా రవీంద్రనాథ్‌తో పాటు తొలిరోజు నిరాహారదీక్షలో కూర్చున్న వ్యక్తి కవిరాజామూర్తి
3) దీనికి మద్దతు తెలిపిన అప్పటి వర్దన్నపేట శాసనసభ్యులు టి.పురుషోత్తం రావు
ఎ) 1, 2, 3
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : ఎ) 1, 2, 3
☛ Question No.2
రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా తెలంగాణ రక్షణ ఉద్యమ సమితి పురుషోత్తమరావు అధ్యక్షతన ఎక్కడ బహిరంగ సభను నిర్వహించారు ?
ఎ) ఖమ్మం
బి) వరంగల్
సి) హైదరాబాద్
డి) నల్గొండ
జవాబు : బి) వరంగల్
☛ Question No.3
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లో ముల్కీలను తొలగించాలని డిమాండ్‌లతో పోటు కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు
2) పోటు కృష్ణమూర్తి దీక్షకు సానుభూతిగా పాల్వంచ శాసనసభ్యుడు పానుగంటి పిచ్చయ్య 24 గంటల పాటు నిరాహార దీక్షను చేపట్టారు.
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కావు
జవాబు : ఎ) 1 మరియు 2
☛ Question No.4
ఈ క్రింది ఎవరి అధ్యక్షతన తెలంగాణ విద్యార్థి హక్కుల రక్షణ కార్యచరణ సంఘం ఏర్పడినది ?
ఎ) సురేందర్ రెడ్డి
బి) టి.సిద్దులు
సి) వెంకట్రామిరెడ్డి
డి) మురళిధర్‌రెడ్డి
జవాబు : డి) మురళిధర్‌రెడ్డి
☛ Question No.5
రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా మూడు రోజుల నిరసన దీక్షను చేసింది ఎవరు ?
ఎ) సత్యనారాయణ
బి) వెంకట్రామిరెడ్డి
సి) సురేందర్ రెడ్డి
డి) జైపాల్ రెడ్డి
జవాబు : ఎ) సత్యనారాయణ
☛ Question No.6
ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి - మల్లిఖార్జున్
బి) తెలంగాణ పరిరక్షణ సమితి - వెంకట్రామిరెడ్డి
సి) తెలంగాణ పరిరక్షణల కమిటీ - కెఆర్ ఆమోస్
డి) తెలంగాణ హక్కుల రక్షణ సమితి - డి.రామస్వామి
జవాబు : సి) తెలంగాణ పరిరక్షణల కమిటీ - కెఆర్ ఆమోస్
☛ Question No.7
1969 అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు కోసం జారీ చేసిన జీవో ఏది ?
ఎ) జీవో నెం.38
బి) జీవో నెం.36
సి) జీవో నెం.30
డి) జీవో నెం. 32
జవాబు : బి) జీవో నెం.36
Also Read :
☛ Question No.8
జీవో నెం.36 ప్రకారం ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) దీని ప్రకారం నాన్ ముల్కీలను అందరిని వెనక్కు పంపాలి
బి) దీని ఆదేశాలను అమలు పరిచే బాద్యతను ఎంటి రాజుకు అప్పగించారు
సి) ఈ జీవో తెలంగాణ రక్షణల అమలు కోసం ప్రకటించబడినది
డి) ఈ జీవోపై సంతకం చేసి జారీ చేసిన అప్పటి ప్రభుత్వ కార్యదర్శి ఎంటి రాజు
జవాబు : బి) దీని ఆదేశాలను అమలు పరిచే బాద్యతను ఎంటి రాజుకు అప్పగించారు
☛ Question No.9
ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) రవీంద్రనాథ్ దీక్ష విరమణ - 22 జనవరి 1969
బి) పోటు కృష్ణమూర్తి దీక్ష విరమణ - 23 జనవరి 1969
సి) 1969 ఉద్యమంలో తొలి మరణం - కృష్ణ
డి) 1969 జనవరి 30న గజ్వేల్ కాల్పులలో మరణించినది - నరసింహులు
జవాబు : సి) 1969 ఉద్యమంలో తొలి మరణం - కృష్ణ
☛ Question No.10
తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు జనవరి 28న ఎవరి అధ్యక్షతన జరిగింది ?
ఎ) కె.ఆర్ అమోస్
బి) కాళోజి నారాయణరావు
సి) కొండా లక్ష్మణ్ బాపూజీ
డి) మల్లిఖార్జున్
జవాబు : బి) కాళోజి నారాయణరావు
☛ Question No.11
19 జనవరి 1969న తీసుకున్న అఖిలపక్ష నిర్ణయాల మేరకు తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి వేసిన ఈ క్రింది కమిటీ ఏది ?
ఎ) వశిష్ట భార్గవ కమిటీ
బి) వాంఛూ కమిటీ
సి) కుమార్ లలిత్ కమిటీ
డి) జగన్మోహన్ రెడ్డి కమిటీ
జవాబు : సి) కుమార్ లలిత్ కమిటీ
☛ Question No.12
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 01 ఫిబ్రవరి 1969న తెలంగాణ ఉద్యోగులు నివసించే ఈగలపెంటపై ఆంధ్రప్రాంతం వారు దాడి చేశారు
2) ఈ దాడి గురించి స్వయంగా తెలుసుకొనుటకు ఈగలపెంట వద్దకు వెళ్లిన మంత్రి పి.వి నరసింహరావు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు
జవాబు : ఎ) 1 మాత్రమే
☛ Question No.13
పీపుల్స్ కన్వేన్షన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడినది ?
ఎ) సత్యనారయణ
బి) కె.ఆర్ అమోస్
సి) మల్లిఖార్జున్
డి) మదన్‌మోహన్
జవాబు : డి) మదన్‌మోహన్
☛ Question No.14
1969 రెడ్డిహస్టల్ సదస్సుకు సంబంధించి సరైనవి గుర్తించండి ?
1) దీనికి అధ్యక్షత వహించింది సదాలక్ష్మి
2) ఈ సదస్సులో క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చింది - మల్లిఖార్జున్
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు
జవాబు : ఎ) 1 మాత్రమే
☛ Question No.15
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసెంబ్లీ ముందు నిరాహార దీక్ష చేపట్టిన ఆంధ్ర వ్యక్తి ఎవరు ?
ఎ) ఎన్.జి రంగా
బి) గౌతు లచ్చన్న
సి) కొర్రపాటి పట్టాభిరామయ్య
డి) నరసింహారెడ్డి
జవాబు : సి) కొర్రపాటి పట్టాభిరామయ్య
0 Comments