Telangana Movement History Questions in Telugu With Answers | తెలంగాణ ఉద్యమ చరిత్ర జీకే ప్రశ్నలు - జవాబులు Part -4

Telangana Movement History Gk Questions in Telugu With Answers | తెలంగాణ ఉద్యమ చరిత్ర జీకే ప్రశ్నలు - జవాబులు

తెలంగాణ ఉద్యమ చరిత్ర (1969) జీకే ప్రశ్నలు - జవాబులు Part -4

Telangana Movement History (1969) Gk Questions in Telugu with Answers | Gk MCQ Questions in Telugu 

    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛ Question No.1
1969 ఉద్యమానికి సంబందించి ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) ఈ ఉద్యమంలో భాగంగా మే1వ తేదీన కోరికల దినం పాటించాలని తెలంగాణ ప్రజా సమితి నిర్ణయించింది.
2) మే 1న చార్మినార్‌ వద్ద మర్రి చెన్నారెడ్డి ప్రసంగం నిర్వహించారు
3) మే1న జరిగిన ఊరేగింపులో చార్మినార్‌ నుండి బయలుదేరిన ఊరేగింపుకు మల్లిఖార్జున్‌, మదన్మోహన్‌ నాయకత్వం వహించారు
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : డి) 1 మరియు 3

☛ Question No.2
01 మే 1969న జరిగిన ఊరేగింపులో భాగంగా రాజ్‌ భవన్‌ వద్ద మరణించిన విద్యార్థి ఎవరు ?
ఎ) నరేందర్‌ కుమార్‌
బి) పి.జే సూరి
సి) ఫరూక్‌ ఆలీ
డి) ఉమేంద్రరావు

జవాబు : డి) ఉమేంద్రరావు

☛ Question No.3
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1969 ఉద్యమ సమయంలో భారత రాష్ట్రపతి అయిన జాకీర్‌ హుస్సెన్‌ మరణించారు
2) 04 మే 1969 న నకిరేకల్‌లో జరిగిన విశాలాంధ్ర సమైక్యత సభకు అధ్యక్షత వహించినది నర్రా రాఘవరెడ్డి
3) 1969 ఉద్యమానికి ఉపాధ్యాయ యూనియన్‌ తెలంగాణకు మద్దతు ఇచ్చింది.
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : ఎ) 1, 2 మరియు 3

☛ Question No.4
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1969 ఉద్యమంలో భాగంగా 17 మేన తెలంగాణ మృతవీరుల దినోత్సవాన్ని పాటించారు
2) ఈ రోజున ఉద్యమాకారులు ‘లాఠీ, గోలి ఖాయింగే తెలంగాణ లాయేంగే’ అని నినాదాలు ఇచ్చారు
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు

జవాబు : ఎ) 1 మరియు 2

☛ Question No.5
పోటీ తెలంగాణ ప్రజా సమితిని ఎవరు స్థాపించారు ?
ఎ) మర్రి చెన్నారెడ్డి
బి) ఈ.వి పద్మనాభం
సి) వై. శ్రీనివాసరావు
డి) శ్రీధర్‌రెడ్డి

జవాబు : డి) శ్రీధర్‌రెడ్డి

☛ Question No.6
1969 ఉద్యమానికి సంబంధించి ఈ క్రిందివాటిలో సరికానిది ఏది ?
ఎ) ఈ ఉద్యమంలో భాగంగా ఏర్పడిన యూనివర్సిటీ కాలేజ్‌ టీచర్స్‌ కన్వేన్షన్‌కు ప్రొఫెసర్‌ షా మంజూరు ఆలం అధ్యక్షత వహించారు
బి) ఈ ఉద్యమ సమయంలో ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ రావాడ సత్యనారాయణ
సి) కె.ఎల్‌ రావు-నాగార్జున సాగర్‌ అనే వ్యాసాన్ని రాసింది విద్యాసాగర్‌ రావు
డి) కె.ఆర్‌ అమోస్‌ను 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆధ్యుడు అని పేర్కొంటారు

జవాబు : సి) కె.ఎల్‌ రావు`నాగార్జున సాగర్‌ అనే వ్యాసాన్ని రాసింది విద్యాసాగర్‌ రావు
ఈ వ్యాసాన్ని జయశంకర్‌ సార్‌ లిఖించడం జరిగింది.

☛ Question No.7
ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) 1969 ఉద్యమంలో భాగంగా పిడి యాక్ట్‌ కింద కె.ఆర్‌ అమోస్‌ అరెస్టయ్యారు
2) 1969 ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రజా సమితి సత్యాగ్రహా కార్యక్రమాన్ని మే 26న చేపట్టింది
3) ఉద్యమంలో భాగంగా అసెంబ్లీ చీఫ్‌ విప్‌ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ వ్యక్తి రామచంద్రారెడ్డి
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : ఎ) 1, 2 మరియు 3




Also Read :


☛ Question No.8
1969 ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని వారం రోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు ?
ఎ) మల్లిఖార్జున్‌
బి) కాళోజీ నారాయణరావు
సి) రాజ్‌ బహదూర్‌ గౌర్‌
డి) జి.వెంకటస్వామి

జవాబు : సి) రాజ్‌ బహదూర్‌ గౌర్‌

☛ Question No.9
1969 ఉద్యమంలో తెలంగాణకు మద్దతు ఇవ్వని రాజకీయ పార్టీ ఏది ?
ఎ) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా
బి) స్వతంత్ర పార్టీ
సి) సంయుక్త సోషలిస్టు పార్టీ
డి) భారతీయ క్రాంతిదల్‌ పార్టీ

జవాబు : ఎ) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా

☛ Question No.10
ఈ క్రిందివాటిలో సరైనవి గుర్తించండి ?
1) 01 జూన్‌ 1969న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటు చేశారు
2) దీనికి అధ్యక్షునిగా కె.వి రంగారెడ్డి వ్యవహరించారు
3) ఇదే రోజున తెలంగాణ పత్రిక రచయితల సంఘం ఏర్పాటు చేశారు
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : డి) 1 మరియు 3

☛ Question No.11
ఈ క్రింది ఏ సమావేశంలో ఆదిరాజు వెంకటేశ్వరావు రచించిన ‘‘ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం - ప్రజల ఉద్యమం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు ?
ఎ) జర్నలిస్టుల సదస్సు
బి) ఉపాధ్యాయుల సదస్సు
సి) లాయర్స్‌ అసోసియేషన్‌ సదస్సు
డి) కార్మికుల సదస్సు

జవాబు : సి) లాయర్స్‌ అసోసియేషన్‌

☛ Question No.12
1969 ఉద్యమంలో భాగంగా ఈ క్రింది ఏ రోజున నిరసన దినాన్ని పాటించారు ?
ఎ) జూన్‌ 01
బి) జూన్‌ 02
సి) జూలై 01
డి) జూలై 02

జవాబు : బి) జూన్‌ 02

☛ Question No.13
ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1969 ఉద్యమంలో ఇందిరాగాంధీ హైదరాబాద్‌కు వచ్చారు
2) ఇందిరాగాంధీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేది తెలంగాణ ప్రాంత ప్రజలను సంతృప్తి చేయదు అని అన్నది మర్రి చెన్నారెడ్డి
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు

జవాబు : ఎ) 1 మరియు 2

☛ Question No.14
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 17 జూన్‌ 1969న తెలంగాణ మహిళా దినోత్సవాన్ని జరిపారు
2) మహిళా దినంలో భాగంగా అరెస్టు కాబడిన అప్పటి హైదరాబాద్‌ మేయర్‌ కుముద్‌ నాయక్‌
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు

జవాబు : ఎ) 1 మరియు 2

☛ Question No.15
ఈ క్రిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి ?
ఎ) 1969 ఉద్యమం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షులు నిజలింగప్ప
బి) 1969 ఉద్యమం జరుగుతున్నప్పుడు దేశ ఉపప్రధాని మొరార్జీ దేశాయి
సి) 1969 ఉద్యమంలో భాగంగా ముషీరాబాద్‌ జైల్లో తెలంగాణ సత్యాగ్రహుల పైన ఆంధ్ర వ్యక్తులు దాడి చేశారు.
డి) మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీలను ప్రభుత్వ అరెస్టు చేసి ఖమ్మం జైలుకు పంపారు

జవాబు : డి) మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీలను ప్రభుత్వ అరెస్టు చేసి ఖమ్మం జైలుకు పంపారు




Post a Comment

0 Comments