
తెలంగాణ చరిత్ర (కవులు - సాహిత్యం) జీకే ప్రశ్నలు - జవాబులు
Telangana History (Literature - Writers) Gk Questions in Telugu with Answers
☛ Question No.1
డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో స్వీకరించారు ?
ఎ) 1998
బి) 1992
సి) 1993
డి) 1991
జవాబు : బి) 1992
☛ Question No.2
ఈ క్రిందివాటిలో డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి ?
1) సి.నారాయణరెడ్డి విశ్వంబర, కర్పూర వసంతరాయలు, ముఖాముఖి, కలం సాక్షిగా, భూగోళమంత మనిషి వంటి రచనలు చేశారు.
2) విశ్వంభర కావ్యానికి 1988 సంవత్సరంలో జ్ఞానఫీఠ్ అవార్డు లభించింది
3) మంటలూ - మానవుడూ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది
4) ఈయన 29 జూలై 1931 తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హన్మాజీపేటలో జన్మించారు.
ఎ) 1, 2 మరియు3 మాత్రమే
బి) 2, 3 మరియు 4 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : డి) 1, 2, 3 మరియు 4
☛ Question No.3
ఈ క్రిందివాటిలో సామల సదాశివ కవికి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఈయన తెలుగువారికి హిందూస్థానీ సంగీతాన్ని పరిచయం చేశారు.
2) ఈయన మే 11, 1928న ఆదిలాబాద్ జిల్లా దహేగావ్‌లో జన్మించాడు
3) యాది, మలయ మారుతాలు, సంగీత శిఖరాలు వంటి వ్యాస సంకనాలు చేశారు
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.4
విప్లవకవిగా గుర్తింపు పొందిన అల్లం రాజయ్య రచించిన గ్రంథం ఏవి ?
ఎ) కొమురం భీం (నవల)
బి) గాయపడ్డ ఉదయం
సి) ఎ మరియు బి
డి) రెండూ కావు
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.5
ఈ క్రిందివారిలో తాత్విక కవులుగా గుర్తింపు సాధించిన వారు ఎవరు ?
1) మందాడి కృష్ణారెడ్డి - బానిస
2) బోయ జంగయ్య - జాతర, సుంకిరెడ్డి
3) నారాయణరెడ్డి - తోవ ఎక్కడ
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1, 2 మరియు 3
డి) ఏవీకావు
జవాబు : సి) 1, 2 మరియు 3
☛ Question No.6
ఈ క్రిందివారిలో అభ్యుదయ కవులుగా గుర్తింపు సాధించిన వారు ఎవరు ?
1) ఆవుల పిచ్చయ్య - వెట్టిచాకిరి
2) కాంచనపల్లి చిన వెంకటరమణారావు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2 రెండూ కావు
డి) 1 మరియు 2
జవాబు : డి) 1 మరియు 2
☛ Question No.7
సి.నారాయణరెడ్డి ఏ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు ?
ఎ) అంబేడ్కర్ విశ్వవిద్యాలయం
బి) ఉస్మానియా విశ్వవిద్యాలయం
సి) కాకతీయ విశ్వవిద్యాలయం
డి) నాగార్జున విశ్వవిద్యాలయం
జవాబు : ఎ) అంబేడ్కర్ విశ్వవిద్యాలయం
☛ Question No.8
ఈ క్రిందివాటిలో సామల సదాశివ రచించిన నవలల్లో లేనిది ఏది ?
ఎ) మీర్జాగాలిబ్
బి) ఉర్దూ సాహిత్య చరిత్ర
సి) ఉర్దూ కవుల కవితా సామాగ్రి
డి) పైవేవీ కావు
జవాబు : డి) పైవేవీ కావు
☛ Question No.9
ఈ క్రిందివాటిలో దళిత బహుజన కవులు వారు రచించిన నవలలతో జతచేయండి ?
1) పులిపాటి గురుస్వామి
2) గోపగాని రవీందర్
3) దొడ్డి రామ్మూర్తి
4) కందుకూరి దుర్గ
ఎ) ఇసుక గొంతులు
బి) అంకురం
సి) బొక్కెన లొల్లి
డి) జీవిగంజి
ఎ) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
జవాబు : ఎ) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
☛ Question No.10
ఈ క్రిందివారిలో దిగంబర కవులు కానివారు ఎవరు ?
ఎ) చెరబండ రాజు
బి) నిఖిలేశ్వర్
సి) పులిపాటి గురుస్వామి
డి) పేర్వారం జగన్నాథం
జవాబు : సి) పులిపాటి గురుస్వామి
Also Read :
☛ Question No.11
ఈ క్రిందివాటిలో దళిత బహుజన కవులు ఎవరు ?
ఎ) పులిపాటి గురుస్వామి, గోపగాని రవీందర్
బి) దొడ్డి రామ్మూర్తి, కందుకూరి దుర్గ
సి) హరగోపాల్, ఎం.వెంకట్, వేముల మల్లయ్య
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.12
ఈ క్రింది రచనల్లో సి.నారాయణరెడ్డి రచన కానిది ఏది ?
ఎ) విశ్వంభర
బి) మంటలూ - మానవుడూ
సి) వృషభ పురాణం
డి) ముఖాముఖి
జవాబు : సి) వృషభ పురాణం
☛ Question No.13
ఈ క్రింది వాటిలో ఏ రచనకు సి.నారాయణ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ?
ఎ) కలం సాక్షిగా
బి) భూగోళమంత మనిషి
సి) మంటలూ - మానవుడూ
డి) మధ్యతరగతి మందహాసం
జవాబు : సి) మంటలూ - మానవుడూ
☛ Question No.14
ఈ క్రింది వారిలో జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి తెలంగాణ కవిగా గుర్తింపు సాధించిన వారు ఎవరు ?
ఎ) చెరబండ రాజు
బి) పేర్వారం జగన్నాథమ్
సి) సి.నారాయణ రెడ్డి
డి) నిఖిలేశ్వర్
జవాబు : ఎ) సి నారాయణ రెడ్డి
☛ Question No.15
సామల సదాశివ అనే కవి తెలుగువారికి పరిచయం చేసిన సంగీతం ఏది ?
ఎ) కర్ణాటక సంగీతం
బి) హిందూస్థానీ సంగీతం
సి) బెంగాలీ సంగీతం
డి) పైవేవీ కావు
జవాబు : బి) హిందూస్థానీ సంగీతం
☛ Question No.16
గజల్‌ను తెలుగులోకి మొదటిసారిగా ప్రవేశపెట్టినవారు ఎవరు ?
ఎ) చందాల కేశవదాసు
బి) సి.నారాయణరెడ్డి
సి) సామల సదాశివ
డి) గోవిందాచార్యులు
జవాబు : బి) సి.నారాయణరెడ్డి
☛ Question No.17
సి.నారాయణరెడ్డి ఏ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు ?
ఎ) తెలుగు అధికార భాషా సంఘం
బి) విశాలాంధ్ర సమైఖ్య సంఘం
సి) సంస్కృత అధికార భాషా సంఘం
డి) పైవేవీ కావు
జవాబు : ఎ) తెలుగు అధికార భాషా సంఘం
☛ Question No.18
ఈ క్రింది గ్రంథాల్లో వేముల మల్లయ్య రచించిన గ్రంథం ఏది ?
ఎ) కర్పూర వసంతరాయలు
బి) తెలుగు వైభవం
సి) కక్క
డి) ధర్మజ్ఞానం
జవాబు : సి) కక్క
☛ Question No.19
‘‘యాది’’ గ్రంథ రచయిత ఎవరు ?
ఎ) హరగోపాల్
బి) శేషాచార్యులు
సి) పులిపాటి గురుస్వామి
డి) సామల సదాశివ
జవాబు : డి) సామల సదాశివ
☛ Question No.20
ఈ క్రిందివారిలో ‘మరో భారతం’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ?
ఎ) మందాడి కృష్ణారెడ్డి
బి) చెరబండ రాజు
సి) ఆవుల పిచ్చయ్య
డి) ఎం.వెంకట్
జవాబు : బి) చెరబండ రాజు
0 Comments