-gk-questions-in-telugu.jpg)
జీయోగ్రఫీ (వాతావరణం) జీకే ప్రశ్నలు - జవాబులు Part -1
Geography (Weather) MCQ Gk Questions in Telugu with Answers
☛ Question No.1
సంఘటనలు, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుదల, ఇతర భౌతిక లక్షణాలను బట్టి వాతావరణాన్ని ఎన్ని పొరలుగా విభజించారు ?
ఎ) 03
బి) 05
సి) 08
డి) 04
జవాబు : బి) 05
☛ Question No.2
వాతావరణాన్ని పొరలుగా విభజించడం జరిగింది. ఈ క్రిందివాటిలో లేనిది ఏది ?
1) ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం
2) మీసో ఆవరణం, థర్మో ఆవరణం
3) ఎక్సోఆవరణం
ఎ) 1 మరియు 3
బి) 1 మరియు 2
సి) 1, 2 మరియు 3
డి) ఏవీ కావు
జవాబు : సి) 1, 2 మరియు 3
☛ Question No.3
సముద్రమట్టంలో నీటిఆవిరి 1% గా ఉండగా వాతావరణంలో నీటి ఆవిరి ఎంత శాతం ఉంటుంది ?
ఎ) 05 %
బి) 0.3 %
సి) 0.4 %
డి) 1%
జవాబు : సి) 0.4 %
☛ Question No.4
తేమ శాతంకు సంబంధించి క్రింది వాటిని గుర్తించండి ?
1) సముద్ర తీరప్రాంతాల్లో తక్కువగా, ఫీఠభూమి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది.
2) సముద్ర తీరప్రాంతాల్లో ఎక్కువగా, ఫీఠభూమి ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు
జవాబు : బి) 2 మాత్రమే
☛ Question No.5
సముద్రమట్టంలో గాలి యొక్క సాంద్రత ఎంత ఉంటుంది ?
ఎ) 1.5 గ్రా./లీ.
బి) 1.3 గ్రా./లీ
సి) 1.1 గ్రా./లీ
డి) 1.2 గ్రా./లీ
జవాబు : డి) 1.2 గ్రా./లీ
☛ Question No.6
భూమి ఉపరితలం నుండి ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలియొక్క సాంద్రత ఎలా ఉంటుంది ?
ఎ) తగ్గుతుంది
బి) పెరుగుతుంది
సి) ఏ మార్పు ఉండదు
డి) మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది
జవాబు : ఎ) తగ్గుతుంది
☛ Question No.7
భూమి ఉపరితలం, సముద్ర అడుగు భాగంలో వ్యాపించి ఉన్న మట్టి, ఖనిజాలు, రాతిపొరను ఏమని పిలుస్తారు ?
ఎ) మీసో ఆవరణం
బి) శిలావరణం
సి) థర్మో ఆవరణం
డి) స్ట్రాటో ఆవరణం
జవాబు : బి) శిలావరణం
Also Read :
☛ Question No.8
మాగ్మా / లావా పదార్థాల ఘనీభవనం ద్వారా ఏమి ఏర్పడుతాయి ?
ఎ) సెడిమెంటరీ (అవక్షేపణ) శిలలు
బి) మెటామార్ఫిక్ (రూపాంతర) శిలలు
సి) ఇగ్నియస్ (అగ్ని) శిలలు
డి) ఇసుకరాయి శిలలు
జవాబు : సి) ఇగ్నియస్ (అగ్ని) శిలలు
☛ Question No.9
అవక్షేపణ శిలలు భూమి ఉపరితలంపై ఖనిజ, సేంద్రియ కణాలు పోగవ్వడం ద్వారా ఏమి ఏర్పడుతాయి ?
ఎ) సెడిమెంటరీ (అవక్షేపణ) శిలలు
బి) మెటామార్ఫిక్ (రూపాంతర) శిలలు
సి) ఇగ్నియస్ (అగ్ని) శిలలు
డి) ఇసుకరాయి శిలలు
జవాబు : ఎ) సెడిమెంటరీ (అవక్షేపణ) శిలలు
☛ Question No.10
భూమి ఉపరితలం కింద వేడి, పీడనం, రసాయన ప్రక్రియల కారణంగా అప్పటికే ఉన్న శిలలు మార్పునకు లోనవ్వడం ద్వారా ఏమి ఏర్పడుతాయి ?
ఎ) సెడిమెంటరీ (అవక్షేపణ) శిలలు
బి) మెటామార్ఫిక్ (రూపాంతర) శిలలు
సి) ఇగ్నియస్ (అగ్ని) శిలలు
డి) ఇసుకరాయి శిలలు
జవాబు : బి) మెటామార్ఫిక్ (రూపాంతర) శిలలు
☛ Question No.11
భూమిపై లభించే 75% శిలలు ఏ రకానికి చెందినవి ?
ఎ) సెడిమెంటరీ (అవక్షేపణ) శిలలు
బి) మెటామార్ఫిక్ (రూపాంతర) శిలలు
సి) ఇగ్నియస్ (అగ్ని) శిలలు
డి) ఇసుకరాయి శిలలు
జవాబు : ఎ) సెడిమెంటరీ (అవక్షేపణ) శిలలు
☛ Question No.12
ఈ క్రిందివాటిలో వాతావరణంలోని వాయువులను వాటి యొక్క ఘనపరిమాణ శాతంతో జతచేయండి ?
1) నైట్రోజన్
2) ఆక్సిజన్
3) కార్భన్ డై ఆక్సైడ్
4) నియాన్
ఎ) 20.946 %
బి) 0.0407 %
సి) 78.084 %
డి) 0.0018 %
ఎ) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
జవాబు : డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
☛ Question No.13
వాతావరణం, శిలావరణం, జలావరణం మధ్య నీటి కదలికను ఏమంటారు ?
ఎ) నీటి చక్రం
బి) కార్భన్ చక్రం
సి) నైట్రోజన్ చక్రం
డి) ఏదీ కాదు
జవాబు : ఎ) నీటి చక్రం
☛ Question No.14
వాతావరణంలో అత్యధిక శాతం ఉన్న వాయువు ఏది ?
ఎ) ఆర్గాన్
బి) కార్భన్ డై ఆక్సైడ్
సి) నైట్రోజన్
డి) ఆక్సిజన్
జవాబు : సి) నైట్రోజన్
☛ Question No.15
భూమి మొత్తం వైశాల్యంలో శిలావరణం ఎంత శాతం వ్యాపించి ఉంది ?
ఎ) సుమారు 49 %
బి) సుమారు 20 %
సి) సుమారు 29 %
డి) సుమారు 39 %
జవాబు : సి) సుమారు 29 %
0 Comments