TS DSC Notification 2024 : 11602 Vacancy, Eligibility, Online Apply, Exam Date | తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

TS DSC Notification 2024 : 11602 Vacancy, Eligibility, Online Apply, Exam Date

 TS DSC Notification 2024 Released with 11062 Posts
తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల 
11062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ జారీ 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ - 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మెగా డిఎస్సీ ` 2024 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ (2629), భాషా పండితులు (727), పీఈటీ (182), ఎస్జీటీ (6.508), ప్రత్యేక కేటగిరీ స్కూల్‌ అసిస్టెంట్స్‌ (220), ఎస్టీజీ (796) ఉన్నాయి. 04 మార్చి 02 నుండి ఏప్రిల్‌ 2024 వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులను స్వీకరించనున్నారు.  ఒక పోస్టుకు 1000 రూపాయలు ఫీజు నిర్ణయించారు. 01 జూలై 2023 నాటికి 18 నుండి 46 సంవత్సరాలుండాలి(రిజర్వేషన్‌ వర్తిస్తాయి).  కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు(సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.

06 సెప్టెంబర్‌ 2023న 5,089 పోస్టులతో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి తాజాగా అదనంగా మరో 5973 పోస్టులను జతచేసి 11062 పోస్టులకు గాను మెగా DSC - 2024ను విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా హైదరాబాద్‌లో అత్యధికంగా 878 డిఎస్సీ పోస్టులున్నాయి. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 మాత్రమే ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు గరిష్టంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా .. కనిష్టంగా మేడ్చల్‌లో 26 పోస్టులున్నాయి. ఇక ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 537, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఖాళీలను భర్తి చేయనున్నారు.

డిఎస్సీలో భాగంగా ఓ అభ్యర్థి ఒకటికి మించి పరీక్షలు రాయలనుకుంటే అన్నింటికీ వేర్వేరుగా ధరఖాస్తు చేసుకోవాలి. ప్రతి ధరఖాస్తుకు ఫీజు రూ॥1000గా నిర్ణయించారు. టీచర్‌ పోస్టుల భర్తీలో 95 శాతం స్థానికతను అమలు పరచనున్నారు. ఆయా జిల్లాల్లోని పోస్టులకు రోస్టర్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. 20 మార్కులతో టెట్‌ వేయిటేజీ ఉంటుంది. రాత పరీక్షను 80 మార్కులకు పెడతారు. ప్రశ్నకు అరమార్కు చొప్పున మొత్తం 160 ప్రశ్నలుంటాయి. మొత్తంగా 100 మార్కులకు అభ్యర్థులు మెరిట్‌ జాబితాను రూపొందించి దాని ఆధారంగా నియామకాలు చేపడతారు. సూప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకే అర్హులు, ఎస్టీటీ పోస్టులకు అర్హులు కారు. డీఎడ్‌ చేసిన అభ్యర్థులే ఎస్జీటీ పోస్టులకు పోటీపడతారు.  

➺ పరీక్ష పేరు :

  • మెగా డిఎస్సీ - 2024

➺ DSC మొత్తం పోస్టులు :

  • 11,062

➺  DSC విభాగాలు :

  • ఎస్టీటీ : 6508
  • స్కూల్‌ అసిస్టెంట్‌ : 2629
  • భాషా పండితులు : 727
  • ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ (పిఈటీ) : 182
  • ఎస్‌ఏ (స్పెషల్‌ ఎడ్యూకేటర్స్‌) : 220
  • ఎస్టీటీ (స్పెషల్‌ ఎడ్యూకేటర్స్‌) : 796

Also Read :


➺ జిల్లాల వారీగా పోస్టుల వివరాలు :

  • ఆదిలాబాద్‌ : 324
  • భద్రాద్రి కొత్తగూడెం : 447
  • హనుమకొండ : 187
  • హైదరాబాద్‌ : 878
  • జగిత్యాల : 334
  • జనగాం : 221
  • భూపాలపల్లి : 237
  • గద్వాల : 172
  • కామారెడ్డి : 506
  • కరీంనగర్‌ : 245
  • ఖమ్మం : 575
  • ఆసిఫాబాద్‌ : 341
  • మహబూబాబాద్‌ : 381
  • మహబూబ్‌నగర్‌ : 243
  • మంచిర్యాల : 288
  • మెదక్‌ : 310
  • మేడ్చల్‌ : 109
  • ములుగు : 192
  • నాగర్‌కర్నూల్‌ : 285
  • నల్లగొండ : 605
  • నారాయణపేట్‌ : 279
  • నిర్మల్‌ : 342
  • నిజామాబాద్‌ : 601
  • పెద్దపల్లి : 93
  • సిరిసిల్ల : 151
  • రంగారెడ్డి : 379
  • సంగారెడ్డి : 551
  • సిద్దిపేట : 311
  • సూర్యాపేట : 386
  • వికారాబాద్‌ : 359
  • వనపర్తి : 152
  • వరంగల్‌ : 301
  • యాదాద్రి : 277

➺ వయస్సు : 

  • 01 జూలై 2023 నాటికి 18 నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.

(రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికోద్యోగులకు 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ / బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి నుండి మినహాయింపు ఉంటుంది) 

➺ DSC పరీక్షా విధానం : 

  • కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు(సీబీటీ)

➺ DSC పరీక్షా కేంద్రాలు :

  • మహబూబ్‌నగర్‌ 
  • రంగారెడ్డి 
  • హైదరాబాద్‌ 
  • మెదక్‌ 
  • నిజామాబాద్‌ 
  • ఆదిలాబాద్‌ 
  • కరీంనగర్‌ 
  • వరంగల్‌ 
  • ఖమ్మం 
  • నల్లగొండ 
  • సంగారెడ్డి 

➺ DSC ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 

➺ ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులు ప్రారంభం : 04 మార్చి 2024
  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులు ముగింపు : 02 ఏప్రిల్‌ 2024



Also Read :



Post a Comment

0 Comments