
ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు
World Gk in Telugu | General Knowledge in Telugu
1) ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్) (United Nations International Children's Emergency Fund) :
- దీనిని 1946 సంవత్సరంలో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది.
- దీనిలో 191 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
- ఇది 2వ ప్రపంచ యుధ్దానంతరం చిన్నపిల్లల అవసరాల కోసం ఏర్పాటు చేయబడినది. యునిసెఫ తన సేవలకు గాను 1965 లో నోబెల్‌శాంతి బహుమతి పొందింది.
- తన కార్యక్రమాలు మరియు కార్యక్రమాలకు మద్దతుగా ప్రభుత్వాలు, వ్యక్తులు, ఫౌండేషన్‌లు, కార్పొరేషన్లు మరియు ఇతర సంస్థల నుండి నిధులను సేకరించి పిల్లల అవసరాలకు వినియోగిస్తుంది.
2) ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) (United Nations Educational, Scientific and Cultural Organization) :
- దీనిని 1946 నవంబర్ 4వ తేదిన స్థాపించారు.
- దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్రాన్స్ రాజధాని పారిస్‌లో కలదు.
- దీనిలో 195 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. 11 దేశాలు అసోసియేట్ సభులుగా ఉన్నాయి.
- ఇది విద్య, విజ్ఞానం మరియు సంస్కృతి ద్వారా దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచంలో శాంతి మరియు భద్రత చేకూర్చేందుకు పనిచేస్తుంది.
- యునెస్కో యొక్క లక్ష్యం శాంతిని నిర్మించడం, పేదరికాన్ని నిర్మూలించడం మరియు విద్య, శాస్త్రాలు, సంస్కృతి, కమ్యూనికేషన్ మరియు సమాచారం ద్వారా స్థిరమైన అభివృద్ధిని నడపడం. సంస్థ విద్య, సహజ శాస్త్రాలు, సామాజిక మరియు మానవ శాస్త్రాలు, సంస్కృతి మరియు కమ్యూనికేషన్ మరియు సమాచారంతో సహా అనేక కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది.
3) ఐక్యరాజ్యసమితి (యుఎన్) అభివృద్ది కార్యాక్రమం - United Nations Development Programme (UNDP)
- దీనిని 1965 సంవత్సరంలో స్థాపించారు.
- దీనిలో 177 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
- దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో కలదు.
- ఇది వైజ్ఞానిక, పూర్వ పెట్టుబడుల సహకరానికి సంబందించిన అతిపెద్ద బహుళ సంస్థ. ఐక్యరాజ్యసమితి వైజ్ఞానిక సహయ కార్యక్రమాలకు కావాల్సిన నిధులను సమకూరుస్తుంది.
4) ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమీషన్ - United Nations High Commissioner for Refugees (UNHCR) :
- దీనిని 1950 సంవత్సరంలో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్) లో కలదు.
- ఇది శరణార్థులకు రక్షణ కల్పించడం, అత్యవసర సహాయాన్ని అందించడం, శరణార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనుట వంటి లక్ష్యాలు గల ఈ సంస్థ 1955, 1981 లలో నోబెల్ శాంతిబహుమతి పొందింది.
5) ఐక్యరాజ్యసమితి జనాభా కార్యాకలాపాల నిధి - United Nations Fund for Population Activities(UNFPA) :
- దీనిని 1969 సంవత్సరంలో ప్రారంభించారు.
- దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో కలదు.
- ఇది జనాభా కార్యకలాపాల రక్షణ నిధిగా వ్యవహరిస్తుంది.
6) యునైటేడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ - United Nations Conference on Trade and Development (UNCTAD):
- దీనిని 1964 సంవత్సరంలో ప్రారంభించారు.
- దీని ప్రధాన కార్యాలయం జేనివా (స్విట్జర్లాండ్) లో కలదు.
- ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, అభివృద్ది చెందని దేశాలలో త్వరితగతిన ఆర్థికాభివృద్దికి కృషి చేయడం వంటివి ఈ సంస్థ యొక్క లక్ష్యం
7) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యాక్రమం -United Nations Environment Programme (UNEP) :
- దీనిని 1972 సంవత్సరంలో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం నైరోబి (కెన్యా) లో కలదు.
- ఇది మానవ పర్యావరణానికి సంబందించిన అన్ని విషయాలలో అంతర్జాతీయ సహకారం, పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు ఆలోచించేలా చేస్తుంది.
8) ప్రపంచ ఆరోగ్య సంస్థ - World Health Organization (WHO) :
- దీనిని 1948 సంవత్సరంలో ప్రారంభించారు.
- దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్) లో కలదు.
- ఇది ప్రపంచంలోని ప్రజలందరికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కోసం పనిచేస్తుంది.
Also Read :
9) ప్రపంచ వాణిజ్య సంస్థ -World Trade Organization (WTO) :
- దీనిని 1995 సంవత్సరంలో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్) లో కలదు.
- ఇందులో 164 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. (164వ దేశం ఆప్ఘానిస్తాన్)
- ఇది ప్రపంచ దేశాల మద్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించుటకు 1948 లో గాట్ (జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్) ఏర్పడినది. 1994 ఏప్రిల్‌లో మొరాకోలో జరిగిన మారకేష్ ఒప్పందం ప్రకారం గాట్ స్థానంలో 1995 జనవరి 1న ప్రపంచ వాణిజ్య సంస్థ అమల్లోకి వచ్చింది.
10) ప్రపంచ వాతావరణ సంస్థ - World Meteorological Organization (WMO) :
- దీనిని 1950 లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్) లో కలదు.
- ఇది వాతావరణ కార్యాకాలాపాలను సమన్వయ పరిచి వాటి స్థాయిన పెంచడానికి అవసరమైన సహాయం చేస్తుంది.
11) ఆహార, వ్యవసాయ సంస్థ - Food and Agriculture Organization of the United Nations (FAO) :
- దీనిని 1945 అక్టోబర్ 16 ప్రారంభించారు.
- దీని ప్రధాన కార్యాలయం రోమ్ లో కలదు.
- ఇందులో 194 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి.
- ఇది పౌష్టికాహార జీవన ప్రమాణాలు స్థాయిలను పెంచడం, అన్ని ఆహార వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచడం, గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చడం కోసం పనిచేస్తుంది.
12) ప్రపంచ ఆహార పథకం (World Food Programme) :
- దీనిని 1963 సంవత్సరంలో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం రోమ్ లో కలదు.
- ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార అవసరాలను తీర్చడానికి తోడ్పడుతుంది.
13) అంతర్జాతీయ కార్మిక సంస్థ - International Labour Organization (ILO) :
- దీనిని 1919 లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం జేనీవా (స్విట్జర్లాండ్) లో కలదు.
- నానాజతి సమితికి అనుబంధంగా ఒక స్వంతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా 1919లో స్థాపించారు.తర్వాత 1946 లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రాతినిద్య సంస్థగా ఏర్పడినది.
14) అంతర్జాతీయ అణుశక్తి సంస్థ - IAEA :
- దీనిని 1957 లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం వియన్నా (ఆస్ట్రియా) లో కలదు.
- ఇది అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించేటట్లు చేయడం దీని లక్ష్యం. అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించడంలో చేసిన కృషికి అప్పటి అధ్యక్షుడు మహ్మద్ అల్‌బరాదికి 2005 లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
15) అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ది నిధి - International Fund for Agricultural Development (IFAD)
- దీని ప్రధాన కార్యాలయం రోమ్(ఇటలీ) లో కలదు.
- ఇది అభివృద్ది చెందుతున్న దేశాలలో ఆహార ఉత్పత్తి, నిల్వలు, పంపిణిని పెంపొందించేందుకు ఉద్దేశించిన ప్రాజేక్టులకు పెట్టుబడులను అందిస్తుంది.
- 1977 లో దీని కార్యాకలాపాలు ప్రారంభమయ్యాయి.
16) ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం :
- దీనిని 1972 లో స్థాపించారు.
- దీని ప్రధాన కార్యాలయం టోక్యో (జపాన్) లో ఉంది.
- ఇది అభివృద్ది సంక్షేమం, మానవ మనుగడం విషయాలలో పరిశోధనతో పాటు శిక్షణ ఇస్తుంది.
17) ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్య నిరోధక కార్యాక్రమం -United Nations Office on Drugs and Crime (UNODC) :
- దీని ప్రధాన కార్యాలయం వియన్నాలో కలదు.
- ఇది మాదక ద్రవ్య వినియోగించడాన్ని నిరోధించేందుకు తగు చర్యలు తీసుకుంటుంది.
18) బ్రెట్టాన్ ఉడ్స్ కవలలు (Bretton Woods) :
1944 జూలై 22న అమెరికాలోని బ్రెట్టాన్ ఉడ్స్ నగరంలో UN Monnnetary and Financial Conference సమావేశం జరిగింది. ఈ సమావేశంలో IMF and IBRD లు ఏర్పర్చే ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ 2 సంస్థలను బ్రెట్టాన్ ఉడ్స్ కవలలు అంటారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్)
- దీనిని 1944 జూలై 22న స్థాపించగా 1945 డిసెంబర్ 27 నుండి అమల్లోకి వచ్చింది. దీని అధికారిక కార్యాకలాపాలు 1947 మార్చి 1 నుండి ప్రారంభమయ్యాయి.
- దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసిలో కలదు
- అంతర్జాతీయ ద్రవ్య మరియు ఆర్థిక స్థిరత్వం మరియు అంతర్జాతీయ వాణిజ్యం విస్తరణకు ఆర్థిక సహాయం చేయం దీని ప్రధాన ధ్యేయం
ప్రపంచ బ్యాంక్
- దీని పురతాన పేరు ఐబిఆర్‌డి (ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్)
- దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డిసిలో కలదు.
- దీనిని 1944 లో స్థాపించారు.
- 1945 నుండి అమల్లోకి వచ్చింది.
- 1947 నుండి కార్యాకలాపాలు ప్రారంభమయ్యాయి.
0 Comments