
యూరోపియన్‌ల రాక (ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు
Advent of Europeans In India MCQ Gk Questions in Telugu with Answers | Indian History Gk Questions in Telugu
☛ Question No.1
పోర్చుగీసు దేశానికి చెందిన వాస్కోడిగామా భారతదేశంలో మొదటిసారిగా 1498లో ఏ ప్రదేశానికి చేరుకున్నాడు ?
ఎ) పాండిచ్చేరి
బి) కాలికట్
సి) సూరత్
డి) గోవా
జవాబు : బి) కాలికట్
☛ Question No.2
భారతదేశంలో ఏ యూరోపియన్లు బలమైన శక్తిగా ఎదిగారు ?
ఎ) ఫ్రెంచ్‌వారు
బి) బ్రిటిష్‌వారు
సి) డచ్‌వారు
డి) పోర్చుగీసువారు
జవాబు : బి) బ్రిటిష్‌వారు
☛ Question No.3
భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి ?
ఎ) పోర్చుగీసు - డచ్
బి) డచ్ - బ్రిటిష్
సి) బ్రిటిష్ - ఫ్రెంచ్
డి) బ్రిటిష్ - పోర్చుగీసు
జవాబు : సి) బ్రిటిష్ - ఫ్రెంచ్
☛ Question No.4
పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రధాన వర్తక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ) మద్రాస్
బి) సూరత్
సి) కొచ్చి
డి) గోవా
జవాబు : డి) గోవా
☛ Question No.5
అల్బూకర్క్ ఏ రాజు సహాయంతో బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించాడు ?
ఎ) షాజహాన్
బి) జహంగీర్
సి) శ్రీ కృష్ణదేవరాయలు
డి) రెండో దేవరాయలు
జవాబు : సి) శ్రీ కృష్ణదేవరాయలు
☛ Question No.6
భారతదేశంలో యూరోపియన్ల ప్రధాన వర్తక స్థావరాల్లో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి ?
ఎ) డచ్ - పులికాట్
బి) పోర్చుగీసు - గోవా
సి) ఫ్రెంచ్ - సేరంపుర్
డి) బ్రిటిష్ - మద్రాస్
జవాబు : సి) ఫ్రెంచ్ - సేరంపుర్
☛ Question No.7
ఏ పోర్చుగీసు గవర్నర్ నీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టినాడు ?
ఎ) ప్రాంకోయిస్ మార్టిన్
బి) నీనా - డ - కున్హా
సి) అల్ఫన్సో - డి - అల్భూకర్క్
డి) ఫ్రాన్సిస్ - డి - అల్మిడా
జవాబు : డి) ఫ్రాన్సిస్ - డి - అల్మిడా
☛ Question No.8
భారతదేశంలో బ్రిటిష్, ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన రెండో కర్ణాటక యుద్దానికి ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) సప్తవర్ష సంగ్రామం
బి) అంబోయానా సంఘటన
సి) ఆస్ట్రియా వారసత్వ యుద్దం
డి) దక్షిణ భారత్‌లో వారసత్వ పోరు
జవాబు : డి) దక్షిణ భారత్‌లో వారసత్వ పోరు
☛ Question No.9
నాంథోమ్ యుద్ధం ఏ పోరులో భాగంగా జరిగింది ?
ఎ) నాలుగో కర్ణాటక యుద్ధం
బి) మూడవ కర్ణాటక యుద్ధం
సి) రెండో కర్ణాటక యుద్ధం
డి) మొదటి కర్ణాటక యుద్ధం
జవాబు : డి) మొదటి కర్ణాటక యుద్ధం
☛ Question No.10
భారతదేశంలో పోర్చుగీసు వారి పతనానికి కారణం ఏమిటీ ?
ఎ) మత మార్పిడిలను ప్రోత్సహించడం
బి) పోర్చుగీసు స్పెయిన్ దేశంలో విలీనం కావడం
సి) ఫ్రెంచ్, డచ్, ఇంగ్లిష్ వర్తక సంఘాల విజృంభన
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.11
1757లో జరిగిన ‘ప్లాసీ’ యుద్ధ సమయంలో బెంగాల్ నవాబుగా ఎవరు ఉన్నారు ?
ఎ) సిరాజ్-ఉద్-దౌలా
బి) ఘజాఉద్దీన్
సి) సర్ప్‌రాజ్ ఖాన్
డి) అలీవర్ధిఖాన్
జవాబు : ఎ) సిరాజ్-ఉద్-దౌలా
☛ Question No.12
యుద్ధం, వ్యాపారం ఒకేచోట సహజీవనం చేయలేవు అని చెప్పిన బ్రిటీష్ రాయబారి ఎవరు ?
ఎ) కారన్‌వాలీస్
బి) రాబర్ట్‌క్లైవ్
సి) సర్ థామస్ రో
డి) విలియం హాకిన్స్
జవాబు : సి) సర్ థామస్ రో
Also Read :
☛ Question No.13
ప్లాసీ యుద్దంలో సిరాజ్-ఉద్-దౌలా ఓటమికి కారణం ఏమిటీ ?
ఎ) మీర్జాపూర్ నమ్మకద్రోహం చేయడం
బి) రాబర్ట్ క్లైవ్ అత్యంత బలవంతుడు కావడం
సి) ప్రజలు బ్రిటిష్ వారికి మద్దతివ్వడం
డి) సిరాజ్ అత్యంత బలహీనుడు కావడం
జవాబు : ఎ) మీర్జాపూర్ నమ్మకద్రోహం చేయడం
☛ Question No.14
కలకత్తా చీకటి గది సంఘటనకు ప్రధాన కారకుడు ఎవరు ?
ఎ) అలీవర్దిఖాన్
బి) మహ్మద్‌షా
సి) సిరాజ్ - ఉద్ - దౌలా
డి) రాబర్ట్‌క్లైవ్
జవాబు : సి) సిరాజ్ - ఉద్ - దౌలా
☛ Question No.15
డచ్‌వారు మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ స్థాపించారు ?
ఎ) సూరత్
బి) కాలికట్
సి) నర్సాపురం
డి) మచిలీపట్నం
జవాబు : డి) మచిలీపట్నం
☛ Question No.16
ఈ క్రిందివాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) మొదటి కర్ణాట యుద్ద సమయంలో డూప్లే ఫ్రెంచ్ గవర్నరు
బి) రెండో కర్ణాటక యుద్దం ఆంగ్లేయులకు అనుకూలించింది
సి) మూడో కర్ణాటక యుద్దం ఫ్రెంచ్ వారికి అనుకూలం
డి) కర్ణాటక యుద్ధాల్లో దక్షిణ భారతం కీలకపాత్ర పోషించింది
జవాబు : సి) మూడో కర్ణాటక యుద్దం ఫ్రెంచ్ వారికి అనుకూలం
☛ Question No.17
భారతదేశానికి మొదటగా వచ్చి చివరగా వెళ్లిన యూరోపియన్లు ఎవరు ?
ఎ) డెనిష్‌వారు
బి) డచ్‌వారు
సి) ఆంగ్లేయులు
డి) పోర్చుగీసువారు
జవాబు : డి) పోర్చుగీసువారు
☛ Question No.18
చిన్పూరా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) బ్రిటీష్ - డచ్
బి) బ్రిటీష్ - డేనిష్
సి) బ్రిటీష్ - పోర్చుగీసు
డి) బ్రిటీష్ - ఫ్రెంచ్
జవాబు : ఎ) బ్రిటీష్ - డచ్
☛ Question No.19
ఈ క్రిందివాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) బ్రిటిష్ ఈస్టిండియా కంపెనిని 1600లో స్థాపించారు
బి) ఈ కంపెనీ స్థాపించిన సమయంలో మొగల్ చక్రవర్తి అక్భర్
సి) ఈ కంపెనీ హెక్టార్, గ్లోబ్ నౌకల ద్వారా భారత్ చేరుకుంది
డి) ఈ కంపెనీ మొదట కేరళ తీరాన్ని చేరింది
జవాబు : డి) ఈ కంపెనీ మొదట కేరళ తీరాన్ని చేరింది
☛ Question No.20
యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన కాలాన్ని అనుసరించి వరుస క్రమంలో గుర్తించండి ?
ఎ) పోర్చుగీసు - బ్రిటిష్ - డచ్ - ఫ్రెంచ్ - డేనిష్
బి) పోర్చుగీసు - డచ్ - బ్రిటిష్ - డేనిష్ - ఫ్రెంచ్
సి) పోర్చుగీసు - డచ్ - డేనిష్ - బ్రిటిష్ - ఫ్రెంచ్
డి) పోర్చుగీసు - ఫ్రెంచ్ - డేనిష్ - బ్రిటిష్ - డచ్
జవాబు : బి) పోర్చుగీసు - డచ్ - బ్రిటిష్ - డేనిష్ - ఫ్రెంచ్
☛ Question No.21
గోవా, డామన్, డయ్యూలను భారత్‌లో విలీనం చేయడం కోసం జరిపిన సైనిక చర్య పేరు ?
ఎ) ఆపరేషన్ విజయ్
బి) ఆపరేషన్ భారత్
సి) ఆపరేషన్ బ్లూస్టార్
డి) ఆపరేషన్ పోలో
జవాబు : బి) ఆపరేషన్ భారత్
☛ Question No.22
మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం ?
ఎ) ప్లాసీ యుద్ద విజయం
బి) దక్షిణ భారతదేశంలో వారసత్వ పోరు
సి) సప్తవర్ష సంగ్రామం
డి) ఆస్ట్రియా వారసత్వ పోరు
జవాబు : డి) ఆస్ట్రియా వారసత్వ పోరు
☛ Question No.23
బ్రిటిష్‌వారు బంగారు ఫర్మానాను ఏ మొగల్ చక్రవర్తి నుండి పొందారు ?
ఎ) బహదూర్ షా
బి) షా ఆలం
సి) ఫరూక్ సియర్
డి) జహంగీర్
జవాబు : సి) ఫరూక్ సియర్
☛ Question No.24
భారత్‌లో ఫ్రెంచ్ వారి పలుకుబడిని తుదముట్టించిన యుద్ధం ఏది ?
ఎ) వందవాసి యుద్ధం
బి) అడయార్ యుద్ధం
సి) బక్సార్ యుద్ధం
డి) ప్లాసీ యుద్ధం
జవాబు : ఎ) వందవాసి యుద్ధం
0 Comments