
రౌంట్‌టేబుల్ సమావేశాలుIndian History in Telugu | Round Table Conferences in Telugu | History in Telugu
రాజ్యాంగ సంస్కరణలు లేదా భారత భవిష్యత్తు రాజ్యాంగం వంటి ముఖ్య అంశాలతో 1930 నుండి 1932 వరకు ఇంగ్లాండ్‌లోని లండన్‌లో నిర్వహించిన మూడు అఖిలపక్ష సమావేశాలను రౌంట్‌టేబుల్ సమావేశాలు అని పిలుస్తారు. మొత్తం 3 రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగాయి.
➺ మొదటి రౌండ్‌టేబుల్ సమావేశాలు :
ఈ సమావేశాలు 12 నవంబర్ 1930 నుండి 19 జనవరి 1931 వరకు జరిగాయి. దీనిని కింగ్ జార్జ్ - 5 అధికారికంగా ప్రారంభించాడు. బ్రిటిష్ ప్రధాన మంత్రి రామ్సేమాక్డోనాల్డ్, భారత ప్రతినిధులు లండన్‌కు ఆహ్వానించాడు. దీనికి స్థానిక పరిపాలకులు, రాజకీయ పార్టీలు హజరయ్యాయి. కానీ కాంగ్రెస్ హజరుకాలేదు. కాంగ్రెస్ హజరుకానందున సమావేశం విఫలమైంది. ఈ సమావేశాలు జరిగే సమయంలో బ్రిటిష్ వైస్రాయిగా లార్డ్ ఇర్విన్ పనిచేశాడు.
గాంధీ ఇర్విన్ ఒప్పందం
మొదటి రౌండ్‌టేబుల్ సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్‌ను రెండవ సమావేశానికి హజరయ్యేలా చేసే ప్రయత్నంలో జరిగింది గాంధీ - ఇర్విన్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం శాసనోల్లంఘనోద్యమాన్ని గాంధీజీ నిలిపివేయాలని, రెండవ రౌండ్‌టేబుల్ సమావేశాలకు గాంధీజీ హజరవ్వాలని సంతకాలు చేశారు.
Also Read :
➺ రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు :
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 1931లో మొదలయ్యి డిసెంబర్ చివరి వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరపున గాంధీ హజరయ్యాడు. మహిళా ప్రతినిధిగా సరోజినినాయుడు హజరయ్యారు. ఈ సమావేశంలో ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీజీ దీన్ని విభజించు పాలించు విధానంగా భావించి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ సమావేశంలో గాంధీ కేంద్ర, రాష్ట్రాల్లో ఇంగ్లాండు సమానమైన బాద్యతాయుతమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ బాద్యతాయుత ప్రభుత్వమనే అంశంపై నిర్ణయం తీసుకోవడం విఫలమైంది.
➺ మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు :
1932లో జరిగిన మూడవ రౌంట్‌టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ సమావేశంలో మహిళలకు ఓటింగ్ హక్కు కల్పించడం, రాష్ట్రాల శాసనసభ్యులు సమాఖ్య, ఎగువ సభ ప్రతినిధులను ఎన్నుకోవడం వంటి విషయాలు చర్చించడం జరిగింది. తర్వాత 1933లో బ్రిటీష్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణల ప్రతిపాదనలతో శ్వేత పత్రం విడుదల చేసింది.
0 Comments