
తెలంగాణ గురుకుల డిగ్రీ అడ్మిషన్స్ TSRDCET - 2024
హైదరాబాద్‌లోని మహాత్మజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) - డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ల కొరకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీఎస్ ఆర్‌డీసీ సెట్) 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాలు, తెలంగాణ సామాజిక సంక్షేమ గురుకులాలు, తెలంగాణ గురుకుల గిరిజన సంక్షేమ గురుకులాలలో అడ్మిషన్స్ ఇస్తారు. బీఎస్సీ, బికాం, బీఎస్సీ ఆనర్స్ వంటి కోర్సులున్నాయి. ఇంగ్లీమీడియంలో బోధన ఉంటుంది.
➺ స్కూల్ పేరు :
మహాత్మజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS)
➺ విద్యార్హత :
- ప్రస్తుతం ఇంటర్మిడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసినవారు ధరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తమ్మీద కనీసం 50 శాతం మార్కులు, ఇంగ్లీష్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి.
- కుటుంబ వార్షియాదాయం నగరాల్లో 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1 లక్ష 50 వేలు మించరాదు
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥ 200/-
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ పరీక్షా విధానం :
ఈ పరీక్షను మల్టిపుల్ ఛాయిస్ పద్దతితో 150 ప్రశ్నలకు గాను 2 గంటల్లో నిర్వహిస్తారు.
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 ఏప్రిల్ 2024
- హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ : 21 ఏప్రిల్ 2024 నుండి
- టిఎస్‌ఆర్‌డీసీ సెట్ పరీక్షా తేది : 28 ఏప్రిల్ 2024
For Online Apply
0 Comments