
మొదటి సామ్రాజ్యాలు (ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు Part -2
Ancient Dynasties of India Gk Questions in Telugu with Answers | Indian History Questions in Telugu
☛ Question No.1
మహాబలిపురం అనే రేవు పట్టణాన్ని ఎవరు నిర్మించారు ?
ఎ) రెండో మహేంద్రవర్మ
బి) ఒకటో మహేంద్రవర్మ
సి) రెండో నరసింహవర్మ
డి) ఒకటో నరసింహవర్మ
జవాబు : డి) ఒకటో నరసింహవర్మ
☛ Question No.2
మెత్తని మట్టి, రాయితో దేవాలయాలను నిర్మించినవారు ఎవరు ?
ఎ) రెండో మహేంద్రవర్మ
బి) ఒకటో మహేంద్రవర్మ
సి) రాజసింహుడు
డి) ఒకటో నరసింహవర్మ
జవాబు : సి) రాజసింహుడు
☛ Question No.3
ఐహోలు శాసనాన్ని ఎవరు వేయించారు ?
ఎ) విక్రమాదిత్యుడు
బి) రవికీర్తి
సి) ఒకటో పులకేశి
డి) రెండో పులకేశి
జవాబు : బి) రవికీర్తి
☛ Question No.4
దక్షిణ భారతదేశంలో ‘ద్రవిడ’, ఉత్తర భారతదేశంలో ‘నగారా’ వాస్తు శిల్పకళ సమ్మేళనం ఏది ?
ఎ) కళింగ
బి) గాంధార
సి) వెశారా
డి) మధుర
జవాబు : సి) వెశారా
☛ Question No.5
మగధలో మౌర్య వంశ స్థాపకుడు ఎవరు ?
ఎ) అజాత శత్రువు
బి) బింబిసారుడు
సి) అశోకుడు
డి) చంద్రగుప్త మౌర్యుడు
జవాబు : డి) చంద్రగుప్త మౌర్యుడు
☛ Question No.6
ఈ క్రిందివాటిని సరైన క్రమంలో అమర్చండి ?
1) హర్యంక
2) నంద
3) శిశునాగ
4) మౌర్య
ఎ) 1, 2, 3, 4
బి) 1, 3, 2, 4
సి) 1, 2, 4, 3
డి) 2, 4, 3, 1
జవాబు : బి) 1, 3, 2, 4
☛ Question No.7
ఈ క్రిందివాటిని సరైన క్రమంలో అమర్చండి ?
1) బిందుసార
2) బింబిసార
3) మహాపద్మనంద
4) అశోకుడు
ఎ) 1, 2, 3, 4
బి) 4, 3, 2, 1
సి) 2, 1, 4, 3
డి) 2, 3, 1, 4
జవాబు : డి) 2, 3, 1, 4
Also Read :
☛ Question No.8
పెద్ద రాజ్యాలను పాలించిన రాజులను ఏమని పిలుస్తారు ?
ఎ) రాజాధిరాజా
బి) చక్రవర్తులు
సి) గొప్ప రాజులు
డి) పెద్ద రాజులు
జవాబు : బి) చక్రవర్తులు
☛ Question No.9
ఈ క్రిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ?
1) మగధ సామ్రాజ్యంలో హిందూకుష్ పర్వతాలున్నాయి
2) భారతదేశపు పెద్ద ఎడారి మగధ సమ్రాజ్యంలో ఉంది
3) మగధ సామ్రాజ్యంలో మాల్వా పీఠభూమి ఉంది
4) కృష్ణ, తుంగభద్ర, గోదావరి లోయలు మగధలో ఉన్నాయి
ఎ) 1, 2, 3
బి) 2, 3, 4
సి) 1, 2, 3, 4
డి) 1 మరియు 4
జవాబు : డి) 1 మరియు 4
☛ Question No.10
మగధ సామ్రాజ్యంలో సారవంతమైన మైదానాలు ఏవి ?
ఎ) మాల్వా
బి) కృష్ణానది
సి) పంజాబ్
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.11
మగధలో చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసేవారిని ఏమని పిలుస్తారు ?
ఎ) దూతలు
బి) వేగులు
సి) ఎ మరియు బి
డి) సేవకులు
జవాబు : ఎ) దూతలు
☛ Question No.12
ఈ క్రిందివాటిలో మగధ సామ్రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) చక్రవర్తి ప్రాదేశిక రాజధానులు పాలించడానికి రాజకుమారులను పంపేవారు
2) రాజకుమారులు సొంత సైన్యం నియమించుకునే వారు
3) గవర్నర్‌లు దూతలు చెప్పిన నియమాలు అమలు చేయాల్సిన అవసరం లేదు
4) రాజకుమారులను గవర్నర్ అని పిలిచేవారు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 4
సి) 3, 4
డి) 2, 3, 4
జవాబు : బి) 1, 2, 4
☛ Question No.13
రాజనీతి అర్థశాస్త్రం గ్రంథంలో పేర్కొన్న అంశాలు ఏవి ?
ఎ) రాజు రాజ్యాలను ఎలా జయించాలి ?
బి) రాజు రాజ్యాలను ఎలా పరిపాలించాలి ?
సి) వృత్తి పనివారి నుండి పన్నులు ఎలా వసూలు చేయాలి ?
డి) భారత ఉపఖండంలో లభించే వనరులు ఏమిటీ ?
ఎ) 1, 2, 3, 4
బి) 2, 3, 4
సి) 3, 4
డి) 1, 2, 3
జవాబు : ఎ) 1, 2, 3, 4
☛ Question No.14
రాజనీతి అర్థశాస్త్రం గ్రంథం రచించింది ఎవరు ?
ఎ) మెగస్తనీస్
బి) చాణక్యుడు (కౌటిల్యుడు)
సి) గుణాడ్యుడు
డి) విశాఖదత్తుడు
జవాబు : బి) చాణక్యుడు (కౌటిల్యుడు)
☛ Question No.15
‘‘అశోక ధర్మ’’ అంటే ఏమిటీ ?
ఎ) అశోక ధర్మలో జంతుబలులు లేవు
బి) తండ్రి పిల్లలకు బోధించినట్లు తమ ప్రజలకు బోధించాడు
సి) ఎ మరియు బి
డి) ఏదీకాదు
జవాబు : సి) ఎ మరియు బి
0 Comments