
మింటో మార్లే సంస్కరణలు (ఇండియన్ హిస్టరీ) Morley-Minto reforms | Indian History in Telugu | Gk in Telugu
బ్రిటిష్ ప్రభుత్వం మింటో మార్లే సంస్కరణలను 1909లో ఏర్పాటు చేసింది. బ్రిటిష్ వైస్రాయిగా పనిచేస్తున్న ‘మింటో’ మరియు భారత కార్యదర్శిగా పనిచేస్తున్న ‘మార్లే’ ఇద్దరు కలిసి ఈ సంస్కరణలను ప్రవేశపెట్టారు. వందేమాతర ఉద్యమం ముగిసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మితవాదులను తృప్తి పరచడానికి 1909లో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని రాజ్యాంగ సంస్కరణల పేరుతో ప్రవేశపెట్టింది.
ఈ చట్టం కేంద్ర, ప్రాంతీయ శాసనసభలను విసృతం చేసింది. గతంలో కేంద్ర శాసనసభలో ఉన్న 16 సభ్యులను 60కి పెంచారు. ఇందులో 37 మంది అధికారికంగా, 23 మంది అనధికారికంగా ఉన్నారు. పెద్ద ప్రాంతీయ శాసనసభ సభ్యుల సంఖ్యను 50కి, చిన్న రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్య 30కి పెంచారు. కేంద్ర శాసనసభలలో ప్రశ్నించే హక్కు కల్పించబడినది. కేంద్ర బడ్జెట్‌పై సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించింది. మింటోమార్లే సంస్కరణలను భారతీయులు వ్యతిరేకించారు. స్త్రీలకు ఓటు హక్కు కల్పించలేకపోవడం, ముస్లీంలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు, గవర్నర్‌లకు పూర్తి అధికారాలు కల్పించడం, భారతీయులకు అధికారాన్ని కల్పించలేకపోవడం వంటి అంశాలపై భారతీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
0 Comments