
ఆర్య సమాజం
Arya Samaj in Telugu | Indian History in Telugu | Gk in Telugu | General Knowledge in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
స్వామి దయానంద సరస్వతి 10 ఏప్రిల్ 1875న ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఇతడు ేవేదాలను అధ్యయనం చేసి, వాటిని ప్రచారం చేయడానికి కృషి చేశాడు. ఆర్య సమాజం కులవ్యవస్థ, అంటరానితనం, విగ్రహారాధన, జంతుబలి, బహుభార్యత్వం, బాల్య వివాహాలను రూపుమాపడానికి నెలకొల్పారు. దయా నందుని అనుచరులు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దయానంద - ఆంగ్లో వేదిక్ పాఠశాలలను స్థాపించారు. ఆర్య సమాజం దురాచారాలు, మూఢవిశ్వాసాలు నుండి హిందూ మతాన్ని విముక్తి చేసింది. వారి మత విలువను వారే గుర్తించేటట్లు చేసింది. భారతదేశాన్ని మతపరంగా, సాంఘికంగా, జాతిపరంగా ఏకం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. స్వదేశీ అనే పదాన్ని ఉపయోగించిన మొదటి భారతీయుడు దయానందు సరస్వతి. దీని ప్రధాన కేంద్రమును లాహోర్‌లో స్థాపించారు. మొదటి శాఖను పంజాబ్‌లో ఏర్పాటు చేశారు. ఆర్య సమాజాన్ని విసృతం చేయడంలో స్వామి శ్రద్దానంద, లాలా లజపతిరాయ్, పండిట్ గురుదత్‌లు క్రీయాశీల పాత్ర పోషించారు. స్వామి దయానంద సరస్వతి రచించిన ‘‘సత్యార్థ ప్రకాశిక’’ అనే గ్రంథం ఈ సంస్థ యొక్క ప్రామాణిక గ్రంథంగా ఉన్నది.
Related Posts :
0 Comments