.jpg)
ఇండియన్ హిస్టరీ (యూరోపియన్ల రాక) | Indian History in Telugu | History in Telugu
డచ్‌వారు
డచ్‌వారు 16వ శతాబ్దంలో ఇండియాకు వచ్చారు. డచ్‌వారు ఇండియాకు వ్యాపారం కోసం వచ్చిన వారిలో రెండవవారు. డచ్‌వారు హాలండ్ దేశానికి చెందినవారు. డచ్‌వారు క్రీ.శ 1572-1580 వరకు నెదర్లాండ్స్ దేశానికి పౌరులుగా నివసించేవారు. తర్వాత స్పెయిన్ దేశం వారి ఆధీనం స్వాతంత్రం సాధించుకొని క్రమంగా బలమైన శక్తిగా ఎదిగారు. వీరు 1595-98లో భారతదేశాన్ని సందర్శించారు. క్రీ.శ 1602లో డచ్ ఈస్టిండియా కంపనీ అనే వర్తక సంఘాన్ని భారతదేశంలో ఏర్పాటు చేశారు. భారతదేశంలో నెలకొల్పిన ఈస్టిండియా కంపనీకి పీటర్ బోథ్, జాన్ పీటర్స్‌జూన్ కోయన్ గవర్నర్‌లుగా వ్యవహరించారు. తర్వాత 1605-63 ల మధ్య భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్తకవాణిజ్య కేంద్రాలు ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాన్ని విస్తరించారు. వీరు భారతదేశంలో మచిలీపట్నం, పులికాట్, సూరత్, భీమిలిపట్నం, కరైకల్, చిన్సురా, కాశింబజార్, బరనగోర్, పట్నా, బాలాసోర్, నాగపట్నం, కొచ్చి వంటి ప్రాంతాలను స్థావరాలుగా చేసుకొని వర్తకం కొనసాగించారు. క్రీ.శ 1690 వరకు డచ్‌వారికి తమిళనాడు రాష్ట్రంలోని పులికాట్ ప్రధానమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఐరోపాలో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లతో డచ్‌వారు యుద్ధాలు చేయడంతో వారి ఆర్థికంగా వెనుకబడిపోయారు. డచ్ వర్తక సంఘాలలో పనిచేసే ఉద్యోగుల అవినీతి కారణంగా వీరి యొక్క పతనం జరిగింది. 17వ శతాబ్దంలో వీరు పోర్చుగీసు వారిపై విజయం సాధించి వారి ఆధీనంలో ఉన్న అనేక భూభాగాలను ఆక్రమించారు. క్రీ.శ 1657లో పులికాట్‌లో నాణేలు ముద్రించుకునేందుకు వీలుగా అనుమతి తీసుకొని వస్త్ర వ్యాపారాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. వీరు నీలిమందు, సాల్ట్‌పీటర్, ముడి పట్టు ఎగుమతి చేసేవారు. 1759 సంవత్సరంలో బ్రిటీష్ వారికి మరియు డచ్‌వారికి మధ్య బెదర / చిన్సురా యుద్ధం జరిగింది. ఇందులో డచ్‌వారు బ్రిటిస్‌వారిలో చేతిలో ఓటమి పాలయ్యారు.
0 Comments