
వరల్డ్ హిస్టరీ (ఫ్రెంచి విప్లవం) జీకే ప్రశ్నలు - జవాబులు Part -2
World History (French Revolution) MCQ Gk Questions in Telugu with Answers | History in Telugu
☛ Question No.1
ఈ క్రిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ?
1) 05 మే 1789న లూయి ఎస్టేట్ జనరల్‌ను సమావేశపరిచారు.
2) సమావేశం కోసం వర్సయిల్స్ మందిరం సిద్దం చేశారు
3) ఒకటి, రెండు ఎస్టేట్స్‌లలో 3 వందల చొప్పున ప్రతినిధులు హజరయ్యారు
4) మూడో ఎస్టేట్ నుండి 600 మంది ప్రతినిధులు హజరయ్యారు
ఎ) 1, 2 మరియు 3
బి) 1, 2, 3, 4
సి) 2, 3 మరియు 4
డి) 2 మరియు 3
జవాబు : బి) 1, 2, 3, 4
☛ Question No.2
ఎస్టేట్ జనరల్‌లోని సభ్యులందరికి ఒక్కొక్కరికి ఒక ఓటు ఉండాలని ఏ గ్రంథంలో ఉంది ?
ఎ) స్పిరిట్ ఆప్ ది లాస్
బి) ది సోషల్ కాంట్రాక్ట్
సి) ఎ మరియు బి
డి) దాస్ క్యాపిటల్
జవాబు : బి) ది సోషల్ కాంట్రాక్ట్
☛ Question No.3
20 జూన్ 1789న టెన్నిస్ కోర్టు మైదానంలో ప్రతిజ్ఞ చేశారు. దీనికి నాయకత్వం వహించిన వారు ఎవరు ?
ఎ) మీరాబ్యూ
బి) అబ్సేసియస్
సి) ఎ మరియు బి
డి) 16వ లూయి
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.4
మూడో ఎస్టేట్ అంటే ఏమిటో వివరిస్తూ కరపత్రం ప్రచురించిన వారు ఎవరు ?
ఎ) అబ్బేసియస్
బి) మీరాబ్యు
సి) డాంటన్
డి) పైవారందరూ
జవాబు : ఎ) అబ్బేసియస్
☛ Question No.5
ఈ క్రిందివాటి జతపరచండి ?
1) 1789
2) 1791
3) 1792
4) 1804
ఎ) 3వ ఏస్టేట్ జాతీయ అసెంబ్లీగా ఏర్పాటు
బి) ప్రాన్స్ రాజ్యాంగం రూపొందించడం
సి) ప్రాన్స్ జాకోబిన్ ప్రభుత్వం ఏర్పాటు
డి) నెపోలియన్ చక్రవర్తిగా ప్రకటన
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
జవాబు : ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
☛ Question No.6
ఫ్రాన్స్ అందోళనకారులు ‘బాస్టిల్’ కారాగారంపై ఎప్పుడు దాడి చేశారు ?
ఎ) 14 జూలై 1789
బి) 15 జూలై 1787
సి) 16 జూన్ 1879
డి) 14 జూలై 1793
జవాబు : ఎ) 14 జూలై 1789
☛ Question No.7
టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ చిత్రించింది ఎవరు ?
ఎ) జాక్వెస్ లూయిడెవిడ్
బి) డానియల్ ఓర్మ్
సి) జేమ్స్ ప్రిన్సివ్
డి) ఆర్‌జీ పొల్లార్డ్
జవాబు : ఎ) జాక్వెస్ లూయిడెవిడ్
Also Read :
☛ Question No.8
04 అగస్టు 1789 ప్రాన్స్‌లో జరిగిన సంస్కరణల్లో సరైనవి గుర్తించండి ?
1) వెట్టిచాకిరి, ఫ్యూడల్ వ్యవస్థ రద్దు చేశారు
2) మతాధికారులు ప్రత్యేక హోదాను వదులుకున్నారు
3) దశమ భాగం రద్దు చేశారు
4) చర్చి ఆదీనంలోని భూములను జప్తు చేశారు.
ఎ) 2, 3 మరియు 4
బి) 1, 2, 3, 4
సి) 1, 2 మరియు 4
డి) 2 మరియు 3
జవాబు :బి) 1, 2, 3, 4
☛ Question No.9
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) ఛాటో ` కులీన వర్గానికి చెందిన కోట లేదా రాజప్రసాదం
2) మానర్ ` ప్రభువులు, భూములు, అంత:పురం ఉన్న ప్రాంతం
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు
జవాబు : ఎ) 1 మరియు 2
☛ Question No.10
ప్రాన్స్ రాజ్యాంగ బద్ద రాచరికంగా ఎప్పుడు మారింది ?
ఎ) 1791
బి) 1792
సి) 1793
డి) 1794
జవాబు : ఎ) 1791
☛ Question No.11
1791లో ఫ్రాన్స్ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను గుర్తించండి ?
1) ఎన్నికైన జాతీయ శాసనసభకు చట్టాలు చేసే అధికారం ఉంది
2) 25 ఏళ్లు పైబడినవారికి మూడు రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్ను చెల్లించేవారికి ఓటు హక్కు ఇచ్చింది
3) శాసనసభ సభ్యులను పౌరులు ఎన్నుకుంటారు
4) పన్ను చెల్లించని పురుషులు, స్త్రీలను నిష్క్రియా పౌరులుగా చేసింది.
ఎ) 2, 3 మరియు 4
బి) 1, 3 మరియు 4
సి) 1, 2, 3 మరియు 4
డి) 1, 2 మరియు 3
జవాబు : సి) 1, 2, 3 మరియు 4
☛ Question No.12
ప్రాన్స్ రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు ?
ఎ) జీవించే హక్కు
బి) వాక్ స్వాతంత్రపు హక్కు
సి) భావ ప్రకటన, అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.13
1790లో మానవ హక్కుల ప్రకటన అనే చిత్రం గీసిన కళాకారుడు ఎవరు ?
ఎ) బల్తాజర్ సోల్విన్
బి) లే బార్పియర్
సి) కోల్మోఫర్టిగ్రాంట్
డి) న్యూహుడోల్‌స్కి
జవాబు : బి) లే బార్పియర్
☛ Question No.14
ప్రాన్స్ మానవ హక్కుల ప్రకటనలోని అంశాలను గుర్తించండి ?
1) మానవులు స్వేచ్ఛ జీవులుగా జీవించారు
2) స్వేచ్ఛ అంటే ఇతరులకు హని కల్గించరాదు
3) సమాజానికి హాని కల్గించే చర్యలు నిషేదం
4) పరిపాలన కోసం అందరికీ పన్ను విధించడం
ఎ) 2, 3 మరియు 4
బి) 1, 2, 3, 4
సి) 1, 2 మరియు 4
డి) 2 మరియు 3
జవాబు : బి) 1, 2, 3, 4
☛ Question No.15
ఈ క్రిందవాటిని జతచేయండి ?
1) పాము తన తోకను కొరికే ఉంగరం
2) కడ్డీల కట్ట
3) విచ్చిన్న గొలుసు
4) రాజదండం
ఎ) ఐకమత్యంకి చిహ్నం
బి) స్వేచ్ఛకు చిహ్నం
సి) శాశ్వతత్వంకు చిహ్నం
డి) రాజు శక్తికి చిహ్నం
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
జవాబు : డి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
0 Comments