నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ‘‘జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (జిప్‌మ్యాట్) 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఐఐఎం బోధ్ గయ, ఐఐఎం జమ్మూ కాశ్మీర్ ఉమ్మడిగా అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఐపీఎం) లో ప్రవేశాలు కల్పిస్తారు. దీని వ్యవధి 5 సంవత్సరాలు.
➺ విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ఆర్ట్స్/కామర్స్/సైన్ గ్రూపులతో ఇంటర్మిడియట్ పాసై ఉండాలి
- ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి
- ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు ధరఖాస్తు చేసుకోవచ్చు
- 10వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులుండాలి
➺ పరీక్షా విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్టు
➺ పరీక్షా పద్దతి :
- మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను రెండున్నర గంటలలోపు సమాధానం ఇవ్వాలి
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥2000/- (జనరల్ / ఓబీసీ)
- రూ॥1000/-(ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ)
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- కర్నూల్
- విజయవాడ
- విశాఖపట్నం
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది : 21 ఏప్రిల్ 2024
- కరెక్షన్ విండో ఓపెన్ : 23 నుండి 25 ఏప్రిల్ 2024
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : 02 జూన్ 2024 నుండి
- జిప్‌మ్యాట్ పరీక్షా తేది : 06 జూన్ 2024
For Online Apply
0 Comments