
Delhi Sultanate Rulers list | Delhi Sultanate Timeline | Indian History in Telugu
ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని 1206 నుండి 1526 సంవత్సరాల వరకు పరిపాలించారు. మహ్మద్‌ఘోరి మరణానంతరం 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సుమారు మూడు శతాబ్దాల కాలం పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లీం రాజవంశం.
క్రీ.శ.1206 నుండి 1526 వరకు ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి.
1) బానిస వంశం (1206-1290)
2) ఖిల్జీ వంశం (1290-1320)
3) తుగ్లక్ వంశం (1320-1414)
4) సయ్యద్ వంశం (1414-1451)
5) లోడీ వంశం (1451-1526)
ఢిల్లీ సుల్తానులు | |
---|---|
పరిపాలన కాలం | క్రీ.శ. 1206-1526 |
రాజ్యస్థాపకుడు | కుతుబుద్దీన్ ఐబక్ |
ఎక్కువకాలం పాలించిన రాజవంశం | తుగ్లక్ వంశం |
తక్కువ కాలం పరిపాలించిన వంశం | ఖిల్జీ వంశం |
తురుష్కవంశాలు | బానిస, ఖిల్జీలు, తుగ్లక్‌లు |
అరబ్బు వంశం | సయ్యద్ వంశం |
అప్ఘన్ వంశం | లోడీలు |
రాజధానులు | లాహోర్, ఢిల్లీ |
పరిపాలించిన ఏకైక మహిళ | రజియా సుల్తానా |
గొప్ప రాజులు | అల్లాఉద్దీన్ ఖిల్జీ, మహ్మద్ బిన్ తుగ్లక్ |
వ్యవసాయ ఋణాలు | మహ్మద్ బిన్ తుగ్లక్ |
వ్యవసాయ ఋణాల రద్దు | ఫిరోజ్‌షా తుగ్లక్ |
అధికార భాష | పారశీకం |
డబుల్ డోమ్ విధానం | లోడివంశం |
శిల్పశైలి | ఇండో`ఇస్లామిక్ శైలి |
బానిస వంశ స్థాపకుడు | కుతుబుద్దీన్ ఐబక్ |
ఖిల్లీ వంశ స్థాపకుడు | జలాలుద్దీన్ ఖిల్జీ |
తుగ్లక్ వంశ స్థాపకుడు | ఘియాజుద్దీన్ తుగ్లక్ |
సయ్యద్ వంశ స్థాపకుడు | ఖిజిర్‌ఖాన్ సయ్యద్ |
లోడీ వంశ స్థాపకుడు | బహలూల్ లోడీ |
పరిపాలన విధానం | రాజ్యం - రాష్ట్రాలు - షిక్‌లు - పరగణాలు - గ్రామాలు |
ప్రధాన వృత్తి | వ్యవసాయం |
ముఖ్య పరిశ్రమ | చేనేత |
ముఖ్య ఎగుమతులు | అద్దకం, నూలు వస్త్రాలు, నీలిమందు |
ముఖ్య దిగుమతులు | గుర్రాలు, విలాస వస్తువులు |
కుటుంబ వ్యవస్థ | ఉమ్మడి |
0 Comments