నిమ్‌సెట్ 2024NIMCET 2024 Notification, Exam Date, Online Apply
కంప్యూటర్ కోర్సులకు ఐఐటీల తర్వాత ప్రాధాన్యమున్న సంస్థలు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లే. వీటిలో పలు పాతతరం సంస్థలు ఎంసీఏ కోర్సు అందిస్తున్నాయి. ఇవన్నీ ఉమ్మడిగా ఎన్‌ఐటీ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్ష స్కోరుతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, పలు ఇతర పేరున్న సంస్థల్లోనూ ఎంసీఏ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.
సాప్ట్‌వేర్, ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు ఆశించే సాధారణ గ్రాడ్యుయేట్లకు నిమ్‌సెట్ మంచి అవకాశం. ఈ పరీక్ష స్కోరుతో వరంగల్ సహా, పది ఎన్‌ఐటీల్లో ఎంసీఏ కోర్సు చదువుకోవచ్చు. దేశీయ బహుళ జాతీ ఐటీ సంస్థల అవసరాల ప్రకారం ఇక్కడి ఎంసీఏ సిలబస్‌ను రూపొందిస్తారు. అన్ని సంస్థలూ ఉమ్మడి కరిక్యులమ్ అనుసరిస్తాయి. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే వరంగల్, జంషెడ్‌పూర్ నిట్‌లు రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాలన్ని కల్పిస్తున్నాయి. రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రధానం చేస్తున్నాయి.
➺ విద్యార్హత :
మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా కనీసం 3 సంవత్సరాలు యూజీ కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచీలోనైన బీటెక్ / బీఈ పూర్తి చేసుకున్నవారు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికి కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55శాతం) తప్పనిసరి. చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.
➺ పరీక్ష విధానం :
- మొత్తం 120 ప్రశ్నలకు 2 గంటల వ్యవధిలో సమాధానం ఇవ్వాలి.
➺ పరీక్షా పద్దతి :
- ఆన్‌లైన్
➺ పరీక్షా ఫీజు :
- రూ॥1250/-(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు)
- రూ॥2500/-(ఇతరులు)
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- వరంగల్
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 20 ఏప్రిల్ 2024
- ఆన్‌లైన్ పరీక్షా తేది : 08 జూన్ 2024
0 Comments