
బౌద్ధమతం
Buddhism - Founder, Beliefs & Origin | Indian History in Telugu
క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలలో బౌద్ధమతం ఒకటి. బౌద్ధమతం అత్యధిక ప్రజాదరణ పొంది ఆసియాఖండం మతంగా ఎదిగింది. బౌద్ధ మత వ్యవస్థాపకుడు గౌతమబుద్ధుడు. ఇతని అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన శాక్యవంశ రాజు శుద్ధోదనుడు, రాణి మాయాదేవి దంపతులకు హిమాలయ ప్రాంతంలోని లుంబిని వనంలో జన్మించాడు. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో పినతల్లి గౌతమి దగ్గర బాల్యం గడిపాడు. యుక్తవయస్సులో యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరికి రాహులుడు అనే కుమారుడున్నాడు.
ఒక రోజు కపిలవస్తు నగరంలో పర్యటిస్తుండగా వృద్దుడు, వ్యాధిగ్రస్తుడు, శవం, సర్వసంగ పరిత్యాగి చూశాడు. ఇవి అతని మనస్సును కదలించాయి. సత్యాన్వేషణ కోసం కుటుంబ బంధాలను విడిచిపెట్టి తన 29వ సంవత్సరంలో అడవులకు ప్రయాణమయ్యాడు. ఈ సంఘటనను బౌద్ధమతంలో ‘‘మహాభినిష్క్రమణం’’ గా పిలుస్తారు. తొలిదశలో సిద్దార్ధుడు ఇద్దరు వేదపండితులైన అలారా కలామ, ఉద్దక రామపుట్టలను ఆశ్రయించి ధ్యాస విధానం అభ్యసించాడు. ఆ తర్వాత ఉరువేళ చేరి, శరీరాన్ని శుష్కింపజేసుకొని ధాన్యంలో గడిపాడు. అనంతరం గయ చేరుకొని రావిచెట్టు కింద 49 రోజులు కఠిన నియమాలతో ధాన్యంలో ముగినిపోయాడు. వైశాఖ పౌర్ణమి రోజున ఆయనకు జ్ఞానం సిద్దించింది. దీనిని ‘‘సంబోధి’’ అంటారు.
➺ బోధనలు :
గౌతమబుద్ధుడు ప్రపథమంగా వారణాసి చేరుకొని అక్కడ సారనాథ్‌లోని మృగదావనంలో, పూర్వసహచరులైన 5గురు బ్రాహ్మణులకు ప్రబోధ చేశాడు. దీన్ని ‘‘ధర్మచక్ర ప్రవర్తనం’’ అంటారు. అప్పటినుండి 45 సంవత్సరాల పాటు నిర్విరామంగా దేశ సంచారం చేస్తూ, బౌద్ధమతాన్ని ప్రభోదించాడు. తన 80వ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ రోజున క్రీ.పూ.483లో కుశినగరంలో నిర్యాణం చెందాడు.
➺ బౌద్ధమత పవిత్ర గ్రంథాలు :
- త్రిపీటకాలు - సుత్తపీటకం
- వినయపీటకం
- అభిదమ్మ పీటకం
➺ బుద్ధుని జీవితంలో 5 ముఖ్య సంఘటనలు :
- జననం - తారమపువ్వు
- మహాభినిష్క్రమణం - గుర్రం
- సంబోధి - బోధి (రావి) వృక్షం
- ధర్మచక్ర పరివర్తన - చక్రం
- మహాపరి నిర్వాణం - స్థూపం
➺ బుద్ధుడు ప్రబోధించిన నాలుగు ఆర్య సత్యాలు :
- ప్రపంచం దు:ఖమయం
- దు:ఖానికి తృష్ణ (కోరిక) కారణం
- కోరికను నిరోధిస్తే దు:ఖం నశిస్తుంది
- దానికి మార్గం ఉంది.
➺ అష్టాంగమార్గములు :
- సరైన దృష్టి
- సరైన క్రియ
- సరైన మాటలు
- సరైన సంకల్పం
- సరైన జీవనం
- సరైన వ్యాయామం
- సరైన ఏకాగ్రత
- సరైన చైతన్యం
Also Read :
➺ బౌద్ధమత ప్రధాన శాఖలు :
- హీనయాన మతం
- మహాయాన మతం
- వజ్రయాన మతం
➺ బౌద్ధ సంగీతులు :
- అజాత శత్రువు ఆధ్వర్యంలో మహాకశ్యపుడు అధ్యక్షతన క్రీ.పూ. 483లో రాజఘహ వద్ద జరిగింది.
- కాలాశోకుని ఆధ్వర్యంలో సబాకామి అధ్యక్షతన క్రీ.పూ.383లో వైశాలి ప్రాంతంలో జరిగింది.
- అశోకుని రాజు ఆధ్వర్యంలో మొగలిపుత్ర తిస్స అధ్యక్షతన క్రీ.పూ.250లో పాటలీపుత్రము వద్ద జరిగింది
- కనిష్కుని ఆధ్వర్యంలో వసుమిత్రుడు అధ్యక్షతన క్రీ.శ 1వ శతాబ్దంలో కుందలవనం వద్ద జరిగింది.
➺ భారతీయ సంస్కృతికి బౌద్ధమత సేవ :
అనంతమైన భారతీయ సంస్కృతీ పరిణామ దశలో బౌద్ధమతం అమోఘమైన పాత్ర నిర్వహించింది. వైదిక మతం సిద్ధాంతాలను ప్రభావితం చేసింది. మానవ సమానత్వాన్ని ప్రభోధించింది. సంక్లిష్ట మత వ్యవస్థను సరళీకృతం చేసింది. వ్యక్తి గుణగణాలకు, సచ్ఛీలతకు ప్రాధాన్యం ఇచ్చి మతంలో నైతికతను జొప్పించింది. ఆచరణీయ అహింసా సిద్దాంతాన్ని అందించింది. ఆహారపు అలవాట్లలో శాఖాహారులు, మాంసాహారులు అనే మార్పులు తీసుకువచ్చింది. బౌద్ధ పండితులైన ఆచార్య నాగుర్జునుడు, అశ్వఘోషుడు, అసంగుడు, దిగ్‌నాగుడు, ధర్మకీర్తి వంటి వారు మత సాహిత్యాన్ని, సిద్ధాంతాలను పరిపుష్టం చేశారు. బౌద్ధ సంఘాలు, విశ్వవిద్యాలయాలు వ్యాప్తికి తోడ్పడ్డాయి. మతంలో విగ్రహారాధనను ప్రవేశపెట్టి గాంధార, మధుర, అమరావతి శైలుల రూపంలో అపురూప శిల్పకళను అందించింది. ప్రాంతీయ భాషల అభివృద్దికి తోడ్పడిరది. విదేశాలతో సత్సంబంధాలను నెలకొల్పి భారతీయ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచ శాంతి ఆవశ్యకతను చాటిచెప్పింది.
➺ భారతదేవంలో ప్రముఖమైన బౌద్ధ నిర్మాణాలు :
- సాంచి, బార్హుత్, గయలోని బుద్ధుని విశేషాలతో చేపట్టిన స్తూపాలు, రాతి స్తంభాలు
- గయ వద్ద ఉన్న బార్బరా గుహల్లోనూ మరియు పశ్చిమ భారతదేశంలోని నిర్మాణాలు
- మధ్యభారతదేశంలోని నాసిక్, కార్లే, కన్హేరి
- ఆంధ్రప్రదేశ్‌లోని భట్టిప్రోలు
- ధాన్యకటం (అమరావతి) లోని స్తూపాలు, తెలంగాణలోని కోటిలింగాల, ధూళికట్ట, స్తంభంపల్లి, కొండాపర్, గీసుకొండ, ఫణిగిరి, నాగారం, వర్ధమానుకోట, నాగార్జునకొండ, నేలకొండపల్లి
➺ బౌద్ధమత క్షీణతకు కారణాలు :
వైదిక మతానికి తిరిగి ప్రోత్సాహం లభించడం, మహాయాన మతానికి, వైదిక మత విధానాలకు పెద్దగా తేడా లేకపోవడం, బిక్షువుల్లో పెరిగిన అనైతికత, బౌద్ధ మఠాలు అసాంఘిక కార్యకలాపాలకు స్థావరాలు కావడం, సంస్కృతానికి మతంలో ప్రాముఖ్యం ఇవ్వడం, ముస్లీం దండయాత్రలు వంటి అనేక కారణాలతో బౌద్ధమతం 13వ శతాబ్దం నాటికి భారతదేశంలో ప్రజాధరణ కోల్పొయిందని చెప్పవచ్చు.
0 Comments