Raja Ram Mohan Roy Biography in Telugu | రాజా రామ్‌మోహన్‌రాయ్‌ | Indian History in Telugu | Gk in Telugu

Raja Ram Mohan Roy Biography in Telugu |  రాజా రామ్‌మోహన్‌రాయ్‌  | Indian History in Telugu | Gk in Telugu

 రాజా రామ్‌మోహన్‌రాయ్‌ 
Raja Ram Mohan Roy Biography in Telugu | Indian History in Telugu | Gk in Telugu | General Knowledge in Telugu 

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.


19వ శతాబ్దంలో చేపట్టిన సంస్కరణ ఉద్యమాలలో రాజా రామ్‌మోహన్‌రాయ్‌ ముందు వరుసలో ఉంటాడు. రాజా రామ్‌మోహన్‌రాయ్‌ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో రాధానగర్‌ గ్రామంలో 22 మే 1772 సంవత్సరంలో జన్మించాడు. రాజా రామ్‌మోహన్‌రాయ్‌ బహుభాషా కోవిదుడు. ఇతను వారణాసిలో సంస్కృత సాహిత్యం, హిందూ తత్వశాస్త్రాన్ని మరియు పాట్నాలో ఖురాన్‌, పర్షియన్‌, అరబిక్‌ సాహిత్యాన్ని చదివారు. బైబిల్‌ చదవడం కోసం గ్రీక్‌ మరియు హెబ్రూ భాషలను నేర్చుకున్నాడు. 1809లో పర్షియన్‌ భాషలో ‘‘ఏకదేవతారాధకులకు ఒక కానుక’ అనే గ్రంథం ప్రచురించాడు. రాజా రామ్‌మోహన్‌రాయ్‌ గొప్ప సంఘసంస్కర్త. ఇతను మహిళలపై జరుగుతున్న నిర్భందాలను వ్యతిరేకించాడు. సతీసహగమన దురాచారాన్ని నిర్మూలించడానికి రాయ్‌గొప్ప పోరాటాన్ని నిర్వహించాడు. చివరకు గవర్నర్‌ - జనరల్‌ విలియం బెంటింగ్‌ సహాయంతో సతీసహగమనాన్ని నిర్మూలించడంలో విజయం సాధించాడు. దేశంలో అజ్ఞానం, మూఢవిశ్వాసాలు, సాంఘిక, సాంస్కృతిక పతనానికి వ్యతిరేకంగా పోరాడాడు.  రాజా రామ్‌మోహన్‌రాయ్‌ మరణాంతరం ఇతని ఆశయాలను దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌, కేశవ చంద్రసేన్‌లు అమలు చేశారు. 


Also Read :


➺ పత్రికలు :

రాజా రామ్‌మోహన్‌రాయ్‌ జర్నలిజ వైతాళికుడిగా కీర్తిస్తారు. ఇతను 1821 లో సంవాద కౌముది(బెంగాల్‌ వీక్లీ). సంవాద కౌముది అనే పత్రిక భారతదేశంలో స్థాపించి మొట్టమొదటి పత్రిక. భారత్‌లో మొదటి పర్షియన్‌ వార పత్రిక‘మిరాత్‌-ఉల్‌-అక్బర్‌’ ను 1822లో స్థాపించాడు. వార పత్రిక ‘‘బంగదూత’’, క్రైస్తవ మతానికి సంబంధించిన ‘‘బ్రాహ్మణ్‌ సేవధి’’ వంటి పత్రికలు నడిపాడు.

➺ సంస్థలు  :

రాజా రామ్‌మోహన్‌రాయ్‌ 1815 లో ఆత్మీయసభ, 1828లో బ్రహ్మసమాజ్‌, కలకత్తా యూనిటేరియన్‌ కమిటీ అనే సంస్థలు స్థాపించాడు. 

➺ రాజా రామ్‌మోహన్‌రాయ్‌ చేపట్టిన ఇతర సంస్కరణలు :

  • శాశ్వత శిస్తు విధానం రద్దు చేయడం 
  • మహిళా హక్కుల, రక్షణ, పరదా పద్దతిని తొలగించడం 
  • ఉన్నత పదవులలో భారతీయులకు అవకాశం కల్పించడం 
  • చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించడం 
  • భారతీయ పరిశ్రమల నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఆధునిక పద్దతులను అవలంభించడం 
  • బ్రిటన్‌ యొక్క సంస్కరణ బిల్లును వ్యతిరేకించడం 

Related Post : 


Also Read :



Post a Comment

0 Comments