Sardar Vallabhbhai Patel Biography in Telugu | సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ను ఉక్కుమనిషి అని ఎందుకు అంటారు ? | Indian History in Telugu |

Sardar Vallabhbhai Patel Biography

 సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ 
Vallabhbhai Patel Biography in Telugu | Indian History in Telugu

ఇతను బాంబే ప్రెసిడెన్సీలోని గుజరాత్‌లో గల నడియాడ్‌లో 31 అక్టోబర్‌ 1875న జన్మించాడు. ఇతను అడ్వకేట్‌ వృత్తిలో పనిచేశాడు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు సర్ధార్‌, భారతదేశ ఉక్కు మనిషి, భారత బిస్మార్క్‌ అనే బిరుదులున్నాయి. ఇతను ఐడియాస్‌ ఆఫ్‌ ఏ నేషన్‌, భారత్‌ విభజన్‌ అనే గ్రంథాలను రచించాడు. సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా పనిచేశాడు. భారత ఉపప్రధానిగా పనిచేశాడు. ఇతను జన్మదినమైన 31 అక్టోబర్‌ను ప్రతియేటా ‘‘రాష్ట్రీయా ఏక్తా దివస్‌’’ గా జరుపుకుంటారు. ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా కెవడియా వద్ద నర్మద నదిపై సర్ధార్‌ సరోవర్‌ డ్యాం దగ్గర (గుజరాత్‌) విగ్రహమును ‘‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’’ అనే పేరుతో నిర్మించారు. ఇది ప్రస్తుతం 182 మీటర్లు (597 అడుగులు) లతో ప్రపంచంలో ఎత్తైన విగ్రహంగా నిలిచింది. 

సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ స్వాతంత్ర సమరయోధుడే కాకుండా భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత కశ్మీర్‌, జూనాగఢ్‌, హైదరాబాద్‌ వంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి ఎంతో కృషి చేశాడు. ఇలా భారత్‌లోని రాజులను, వారి సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడంలో ఉక్కుపాదం మోపినందుకు గాను ఉక్కుమనిషి సర్ధార్‌ అని ప్రశంసలందుకున్నారు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1928లో బార్డోలీలో బ్రిటీష్‌ ఇండియా ప్రభుత్వ విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్‌ ఉద్యమం చేపట్టి సఫలికృతుడయ్యాడు. అప్పుడే ఇతనికి సర్ధార్‌ అనే బిరుదు వచ్చింది. సర్ధార్‌ 15 డిసెంబర్‌ 1950న మరణించాడు. 


Also Read :


Post a Comment

0 Comments