TS LPCET 2024 Notification, Online Apply, Exam Date, Fee | టిఎస్‌ ఎల్‌పీసెట్‌ 2024 | Latest Admissions in Telugu

TS LPCET 2024 Notification, Online Apply, Exam Date, Fee
TS LPCET 2024 Notification, Online Apply, Exam Date, Fee | ఎల్‌పిసెట్‌ 2024 

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని స్టేట్‌బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైయినింగ్‌ (ఎల్‌బీటీఈటీ) లేటరల్‌ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఎల్‌పిసెట్‌) 2024 నోటిఫికేషన్‌ విడుదల  చేసింది. ఐటీఐ పూర్తి చేసిన  అభ్యర్థులకు ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. 

➺ ఎంట్రన్‌టెస్టు పేరు :

లేటరల్‌ ఎంట్రీ ఇన్‌టూ పాలిటెక్నిక్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఎల్‌పిసెట్‌) 2024

➺ TS  LPCET కోర్సులు :

  • డిప్లొమా (సివిల్‌ ఇంజనీరింగ్‌)
  • డిప్లొమా (మెకానికల్‌/ ఆటోమొబైల్‌/ మెటలర్జికల్‌/ ప్యాకింగ్‌ టెక్నాలజీ)
  • డిప్లొమా (ఇన్‌ స్ట్రుమెంటేషన్‌ / ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌) 
  • డిప్లొమా ( (కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ / ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌).

➺ TS  LPCET విద్యార్హత : 

  • రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ అందించే బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి 
  • ప్రథమ శ్రేణి మార్కులు సాధించాలి 
  • ఐటీఐ (డ్రాప్ట్‌మన్‌ - సివిల్‌) పూర్తి చేసినవారు డిప్లొమా (సివిల్‌ ఇంజనీరింగ్‌) చేయచ్చు 
  • ఐటీఐ (డ్రాప్ట్‌మాన్‌`మెకానిక్‌, ఫిట్టర్‌, మెషినిస్టు, కంపోజిట్‌, గ్రిండర్‌, టర్నర్‌, మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌, మెకానిక్‌ - ఆర్‌ అండ్‌ ఏసి) పూర్తి  చేసిన వారు డిప్లొమా (మెకానికల్‌/ ఆటోమొబైల్‌/ మెటలర్జికల్‌/ ప్యాకింగ్‌ టెక్నాలజీ) కోర్సు చేయచ్చు 
  • ఐటీఐ (ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషియన్‌) చదివిన వారు డిప్లొమా (ఇన్‌ స్ట్రుమెంటేషన్‌ / ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌) చేయచ్చు 
  • ఐటీఐ (ఐసీటీ అండ్‌ సిస్టమ్‌ మెయింటెనేన్స్‌) చేసిన వారు డిప్లొమా ( (కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ / ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌) చేయచ్చు 

➺ TS LPCET పరీక్షా విధానం :

  • మొత్తం 120  మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు 2 గంటల్లో పరీక్ష నిర్వహిస్తారు 

➺ TS LPCET ధరఖాస్తు విధానం :

  • ఆఫ్‌లైన్‌ 

వెబ్‌సైట్‌ నుండి ధరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని నింపి ధరఖాస్తు ఫీజు డీడీని జతచేసి మాసబ్‌ట్యాంక్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో సబ్మిట్‌ చేయాలి 

➺ TS LPCET ధరఖాస్తు ఫీజు :

  • రూ॥500/- (జనరల్‌)
  • రూ॥300/-(ఎస్సీ/ఎస్టీ)

➺ TS LPCET పరీక్షా కేంద్రం : 

  • గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, మసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ 

➺ TS LPCET ముఖ్యమైన తేదీలు : 

  • ధరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉండే తేది : 16 ఏప్రిల్‌ 2024
  • ధరఖాస్తుకు చివరి తేది : 20 ఏప్రిల్‌ 2024
  • ఎల్‌పీసెట్‌ 2024 పరీక్షా తేది : 20 మే 2024

For Online Apply




Post a Comment

0 Comments