Indian History in Telugu | భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రాముఖ్యత ఏమిటీ ?

Indian History in Telugu | భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రాముఖ్యత ఏమిటీ ?

 భారత ప్రభుత్వ చట్టం 1935

సమాఖ్య రాజ్యాంగానికి మొదటిసారిగా రూపకల్పన చేసింది 1935 చట్టం. భారతదేశంలో కొత్త సంస్కరణలు రూపొందించడానికి లండన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీని ప్రాతిపాదికగా తయారైన భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం 1935లో ఆమోదం తెలిపింది. 

➺ భారత ప్రభుత్వ చట్టం - 1935 :

  • ఈ చట్టంలోని ముఖ్యాంశాలు 
  • రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం 
  • కేంద్రంలో భారతీయులకు పరిమిత అధికారాలను కల్పించడం 
  • కేంద్ర అఖిల భారత సమాఖ్య ఏర్పాటు 
  • ఫెడరల్‌ కోర్టు ఏర్పాటు 

➺ కేంద్ర శాసనసభ : 

ఇందులో ఎన్నుకోబడిన సభ్యులు ఉండేవారు. ఓటర్ల సంఖ్య 10 శాతం పెంచబడిరది. శాసనసభలో రాష్ట్రం శాసనసభల నుండి 260 మంది సభ్యులు, సమాఖ్య శాసనసభలో 375 మంది ఉండేవారు. అయితే స్థానిక పాలకులు ఇందులో చేరేందుకు ఆసక్తి చూపకపోవడంతో సమాఖ్య శాసనసభ అమలులోకి రాలేదు. ఈ చట్టం భారతదేశం నుండి బర్మాను వేరేచేసింది. 

➺ ప్రాంతీయ ప్రభుత్వం : 

ఈ చట్టం ప్రాంతీయ ప్రభుత్వాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని నిషేధించి ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్గించింది. శాసనసభలోని అత్యధిక మెజార్టీ సాధించిన పార్టీ నుండి గవర్నర్‌ మంత్రులను నియమిస్తాడు. ఈ మంత్రులు బదిలీ చేయబడిన అంశాలకు బాద్యత వహిస్తారు. వీరు శాసనసభకు మాత్రమే బాద్యత వహిస్తారు. గవర్నర్‌లు మాంత్రుల సలహామేరకు బద్దులై ఉంటారు. కానీ ఆచరణలో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తిరస్కరించేవాడు. స్థానిక ప్రభుత్వంలో 1935 చట్టం అమలు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 


Also Read :



Post a Comment

0 Comments