
స్వామి వివేకానందుడు
Swami Vivekananda Biography in Telugu | Indian History in Telugu | Gk in Telugu
భారతదేశం యొక్క సంస్కృతి సాంద్రాయాలను భారతదేశ ఎల్లలు దాటించిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానందుడు. ఇతను 12 జనవరి 1863న పశ్చిమబెంగాల్‌లోని కలకత్తాలో జన్మించాడు. వివేకానందుని అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. తన తండ్రి మరణాంతరం ఇతను కడు పేదరికాన్ని అనుభవించాడు. అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహంలో ఊగిసాలిడిన సమయంలో రామకృష్ణ పరమహంసతో పరిచయం వివేకానందుని జీవితాన్ని ప్రభావితం చేసింది. రామకృష్ణుడిని వివేకానందుడు తన ఆధ్యాత్మిక గురువుగా భావించాడు. నరేంద్రుడు వివేకానందుడిగా కీర్తి సాధించాడు. తన జీవితమంతా రామకృష్ణ పరమహంస తత్వ్తాన్ని ప్రపంచమంతా వ్యాపింప చేయడానికి వినియోగించాడు. గురువు గారి కోరిన మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. వివేకానందుడు 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమావేశానికి భారతదేశ ఆధ్యాత్మిక ప్రతినిధిగా హజరయ్యారు. ఈ సమావేశంలో హిందూమత తాత్విక దృక్పథాన్ని, అన్ని మతాలను సమానంగా చూసే ఔన్నత్యాన్ని గురించి ప్రసంగించాడు. ఇతనికి ‘కర్మయోగి’, ‘హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి’ అనే బిరుదులున్నాయి. వివేకానందుడు రామకృష్ణమిషన్, రామకృష్ణ మఠ్ అనే సంస్థలు స్థాపించాడు. స్వామి వివేకానందుడు 04 జూలై 1902న మరణించాడు. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతియేటా జనవరి 12న భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతుంది.
Related Post
0 Comments