Telangana Movement Important Questions in Telugu With Answers | తెలంగాణ ఉద్యమ చరిత్ర ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు Part - 1

Telangana Movement Important Questions in Telugu With Answers

తెలంగాణ ఉద్యమ చరిత్ర ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు Part - 1

Telangana Movement Important MCQ Questions in Telugu With Answers

    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛ Question No.1
ముల్కీ ఉద్యమం 1952కు సంబంధించిన ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) ఈ ఉద్యమం వరంగల్‌లో ప్రారంభమైంది
2) 26 జూలై 1952న హనుమకొండ నుండి సుబేదారి వరకు నాలుగు వేల మందితో తీసిన ర్యాలీ, 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చరిత్రలో నిలిచిపోయింది
3) మొత్తం విద్యార్థులంతా యాక్షన్‌ కమిటీ ఏర్పరచుకొని కన్వీనర్‌గా బుచ్చయ్యను ఎన్నుకున్నారు
ఎ) 1, 2 సరైనవి 3 కాదు
బి) 1, 3 సరైనవి 2 కాదు
సి) 1, 2, 3 సరైనవి
డి) 1 సరైనది 2, 3 కాదు

జవాబు : సి) 1, 2, 3 సరైనవి

☛ Question No.2
హైదరాబాద్‌ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ?
ఎ) 1952లో జరిగిన ఎన్నికలు మొత్తం 175 స్థానాలకు జరిగాయి
బి) ఎన్నికల్లో 93 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ మెజార్టీని సాధించింది
సి) ఎన్నికల్లో పిడిఎఫ్‌ 43 శాసనసభ స్థానాలు లభించాయి
డి) బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో చెన్నారెడ్డి ఆహారం మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు

జవాబు : సి) ఎన్నికల్లో పిడిఎఫ్‌ 43 శాసనసభ స్థానాలు లభించాయి

☛ Question No.3
మొట్టమొదటి సారిగా ముల్కీ అనే పదాన్ని ఏ గెజిట్‌లో ఉపయోగించారు ?
ఎ) 1888 జరిధా
బి) 1910 ప్రకటన
సి) 1933 ఫర్మానా
డి) 1919 ఫర్మానా

జవాబు : డి) 1919 ఫర్మానా

☛ Question No.4
వెల్లోడి మంత్రివర్గంలో బూర్గుల రామకృష్ణారావు ఏ మంత్రిత్వ శాఖకు పనిచేశారు. ?
ఎ) ఆర్థిక శాఖ మంత్రి
బి) పౌరశాఖ మంత్రి
సి) విద్యా శాఖ మంత్రి
డి) హోంశాఖ మంత్రి

జవాబు : సి) విద్యా శాఖ మంత్రి

☛ Question No.5
ఈ క్రిందివాటిని జతపరచండి ?
1) నిజాం ఉల్‌ముల్క్‌
2) జాసికిందర్‌ జా
4) మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌
5) మహబూబ్‌ ఆలీఖాన్‌

ఎ) ఏడవ ఆసఫ్‌ జా
బి) మొదటి ఆసఫ్‌ జా
సి) ఆరవ ఆసఫ్‌ జా
డి) మూడవ ఆసఫ్‌

ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ

జవాబు : బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి

☛ Question No.6
ది జూడిషరీ ఐ సర్వ్‌డ్‌ అనే ఆత్మకథ ఈ క్రిందివారిలో ఎవరికి సంబంధించింది ?
ఎ) మేల్కొటి
బి) కొండా వెంకట రంగారెడ్డి
సి) బూర్గుల రామకృష్ణారావు
డి) పింగళి జగన్మోహన్‌ రెడ్డి

జవాబు : డి) పింగళి జగన్మోహన్‌ రెడ్డి

☛ Question No.7
1950 హైదరాబాద్‌ రాష్ట్రానికి సంబంధించి ఈ క్రిందివాటిలో సరైనది గుర్తించండి ?
ఎ) హైదరాబాద్‌ రాష్ట్రంలో మొత్తం 15 జిల్లాలు కలవు
బి) తెలంగాణ లో 8 జిల్లాలు కలవు
సి) మరట్వాడలో 5 జిల్లాలు కలవు
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ


Also Read :


☛ Question No.8
మొదటి ఎస్సార్సీ కి సంబంధించి ఈ క్రిందివాటిలో సరికానిది గుర్తించండి ?
ఎ) ఇది 1953 డిసెంబర్‌ 29న ఏర్పాటు అయ్యింది
బి) దీనికి అధ్యక్షుడు జస్ట్‌ సయ్యద్‌ ఆలీ
సి) దీనికి 22 డిసెంబర్‌ 1953న హైదరాబాద్‌ అసెంబ్లీలో బూర్గుల రామకృష్ణారావు తీర్మాణం ప్రకటించారు.
డి) దీనిలో మొత్తం సభ్యులు ముగ్గురు ఉన్నారు

జవాబు : సి) దీనికి 22 డిసెంబర్‌ 1953న హైదరాబాద్‌ అసెంబ్లీలో బూర్గుల రామకృష్ణారావు తీర్మాణం ప్రకటించారు.

☛ Question No.9
హైదరాబాద్‌ హిత రక్షణ సమితిని ఎవరు స్థాపించారు ?
ఎ) లాయక్‌ ఆలీ
బి) దేశ్‌పాండే
సి) కె.వి నరసింహరావు
డి) రామాచారి

జవాబు : డి) రామాచారి

☛ Question No.10
హైదరాబాద్‌ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఈ క్రింది ఈ కమిటీని 1952లో వేశారు ?
ఎ) ఏ.డి గోర్వలా కమిటీ
బి) జస్టిస్‌ జగన్మోహన్‌ రెడ్డి కమిటీ
సి) రాధాకృష్ణ కమీషన్‌
డి) మోథ్లయార్‌ కమీషన్‌

జవాబు : ఎ) ఏ.డి గోర్వలా కమిటీ

☛ Question No.11
హైదరాబాద్‌ సిటీ కాలేజ్‌ సంఘటనకు సంబంధించి ఈ క్రిందివాటిలో సరికానిది గుర్తించండి ?
ఎ) ఇది 3, 4 సెప్టెంబర్‌ 1952లో జరిగింది
బి) ఈ సంఘటనపై ప్రభుత్వం మోహన్‌రెడ్డి కమిటీని వేసింది
సి) సిటీ కాలేజ్‌ పోలీసుల కాల్పులు ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 మంది మరణించారు
డి) ఈ సంఘటన జరిగినప్పుడు హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు

జవాబు : సి) సిటీ కాలేజ్‌ పోలీసుల కాల్పులు ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 మంది మరణించారు

☛ Question No.12
ఈ క్రింది వాటిలో బూర్గుల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం చేసింది ఎవరు ?
ఎ) రాజారామ్‌
బి) దేశ్‌పాండే
సి) మగ్ధం మహిజోద్దీన్‌
డి) గోవిందరావు

జవాబు : ఎ) రాజారామ్‌ ‌

☛ Question No.13
జేఎన్‌ చౌదరి దురాగతాల పై వేయబడిన కమిటీ పేరు ఏమిటీ ?
ఎ) వాంఛూ కమిటీ
బి) జగన్మోహన్‌ రెడ్డి కమిటీ
సి) సుందర్‌లాల్‌ కమిటీ
డి) భార్గవ కమిటీ

జవాబు : సి) సుందర్‌లాల్‌ కమిటీ ‌

☛ Question No.14
ఈ క్రింది వాటిలో బూర్గుల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ఏ రోజున ప్రవేశపెట్టారు ?
ఎ) 17 డిసెంబర్‌ 1952
బి) 27 అగస్టు 1952
సి) 17 జూన్‌ 1952
డి) 17 నవంబర్‌ 1952

జవాబు : ఎ) 17 డిసెంబర్‌ 1952




Post a Comment

0 Comments