TS Ed.CET 2024 Notification, Online Apply, Exam Date | టీఎస్‌ ఎడ్‌ సెట్‌ -2024 | Telangana Admissions in Telugu

TS Ed.CET 2024 Notification, Online Apply, Exam Date | టీఎస్‌ ఎడ్‌ సెట్‌ -2024

 తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) ఎడ్యూకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (టీఎస్‌ ఎడ్‌ సెట్‌) - 2024కు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. TS Ed.CET -2024 లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా రెండు సంవత్సరాల బీఈడీ కోర్సులో అడ్మిషన్‌ సాధించవచ్చు. 

TS Ed.CET  పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి 06 మే 2024 లోగా ధరఖాస్తు చేసుకోవాలి. TS Ed.CET పరీక్షను 23 మే 2024న నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంటర్‌లు కలవు. 

➺ TS Ed.CETవిద్యార్హత :

  • గుర్తింపు పొందిన కాలేజీ నుండి కనీసం 50 శాతం మార్కులతో బీఏ / బీకాం / బీఎస్సీ / బీఎస్సీ హోంసైన్స్‌ / బీఏ (ఓరియంటల్‌ లాంగ్వేజేస్‌ / లిటరేచర్‌) / బీసీఏ / బీబీఎం / బీబీఏ కోర్సులలో ఉత్తీర్ణత సాధించాలి 
  • సైన్స్‌, మేథమేటిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా బ్యాచిలర్స్‌ డిగ్రీ (ఇంజనీరింగ్‌ / టెక్నాలజీ) ఉత్తీర్ణులు) 
  • మాస్టర్స్‌ డిగ్రీ / తత్సమాన అర్హత ఉన్నవారు 
  • ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలకు హజరవుతున్న వారు ధరఖాస్తు చేసుకోవచ్చు 

➺ TS Ed.CET వయస్సు : 

  • 01 జూలై 2024 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. 
  • గరిష్ఠ వయోపరిమితి లేదు 

➺ TS Ed.CET పరీక్ష విధానం :

  • ఆన్‌లైన్‌ సీబీటి ద్వారా నిర్వహిస్తారు 

➺ TS Ed.CET పరీక్షా పద్దతి :

  • మొత్తం 2 గంటల సమయంలో 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. 


Also Read :


➺ TS Ed.CET పరీక్షా ఫీజు :

  • రూ॥750/- (జనరల్‌) 
  • రూ॥550/-(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు) 

➺ TS Ed.CET ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

➺ పరీక్షా కేంద్రాలు :

  • హైదరాబాద్‌ 
  • నల్లగొండ
  • కోదాడ 
  • ఖమ్మం 
  • భద్రాద్రి కొత్తగూడెం 
  • సత్తుపల్లి 
  • కరీంనగర్‌ 
  • మహబూబ్‌నగర్‌ 
  • సిద్దిపేట 
  • నిజామాబాద్‌ 
  • వరంగల్‌ 
  • నర్సంపేట్‌ 
  • సంగారెడ్డి 
  • ఆదిలాబాద్‌ 
  • కర్నూలు 
  • విజయవాడ

➺ TS Ed.CET ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 06 మే 2024
  • కరెక్షన్‌ విండో ఓపేన్‌ : 13 నుండి 15 మే 2024 వరకు 
  • హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ : 20 మే 2024 నుండి 
  • టిఎస్‌ ఎడ్‌ సెట్‌ పరీక్షా : 23 మే 2024

Apply Online 



Also Read :



Post a Comment

0 Comments