
చంపారన్ సత్యాగ్రహం (1917)
Champaran Satyagraha in Telugu
Modern Indian History in Telugu | History in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
మహాత్మ గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భారత్‌లో చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం మరియు మొదటి శాసనోల్లంఘన ఉద్యమం చంపారన్ సత్యాగ్రహం. ఈ చంపారన్ సత్యాగ్రహం బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లాలో జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని భారత రైతాంగ ఉద్యమాలన్నింటిలో ఉన్నతమైనదిగా, విశిష్టమైనదిగా అభివర్ణిస్తారు.
చంపారన్ ప్రాంతంలో తీన్‌కతియా పద్దతి అమలులో ఉండేది. ఈ తీన్ కతియా పద్దతి ప్రకారం ప్రతి రైతు తాను పండిస్తున్న భూమిలో 3/20 వంతు భూమి బలవంతంగా నీలిమందు సాగు కోసం కేటాయించేవారు. ఈ సాగు చేసే రైతులు స్థానిక జమీందార్లకు ‘షరాబేషి లేదా తవాన్’ పన్ను చెల్లించాల్సి వచ్చేంది. గాంధీజీ చంపారన్ కు చెందిన రాజ్‌కుమార్ శుక్లా అనే వ్యక్తి ఆహ్వనం మేరకు చంపారన్‌లో రైతులు అనుభవిస్తున్న స్థితిగతులను తెలుసుకోవడానికి వెళతాడు. ఈ క్రమంలో గాంధీజీ ఉద్యమాన్ని ప్రారంభించాడు.
ఈ ఉద్యమంలో గాంధీజితో పాటు జె.బి కృపలాని, బాబు రాజేంద్రప్రసాద్, మహాదేవ్ దేశాయ్, మజహర్-ఉల్-హక్, నరహరి పారిక్ వంటి నాయకులు కూడా గాంధీజి వెంట నడిచారు. 10 ఏప్రిల్ 1917న చంపారన్ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి తలొగ్గి 29 మే 1917న గాంధీని బీహార్ గవర్నర్ ఆహ్వానించి నీలిమందు రైతుల సమస్యల పరిష్కారాల గురించి ఫ్రాక్స్‌రాయ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అందించిన నివేదిక ఆధారంగా ‘తీన్‌కతియా విధానం’ ను రద్దు చేయబడినది. ఈ చంపారన్ సత్యాగ్రహంతో రైతు ఉద్యమాలు జాతీయోద్యమంలో ముఖ్య భూమిక అయ్యింది.
0 Comments