
గిడుగు రామమూర్తి బయోగ్రఫీGidugu Ramamurthy Biography in Telugu | Gk in telugu | General Knowledge in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
గిడుగు వెంకట రామమూర్తి గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకువచ్చి తెలుగు భాష ఉన్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి. తెలుగు భాషను నిత్య వ్యవహరంలో వాడే విధంగా వచనాన్ని మార్పుచేశాడు. గిడుగు రామమూర్తి బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా కీర్తి సాధించాడు. గిడుగు వెంకట రామమూర్తి చేసిన కృషి ఫలితంగా కొద్ది మందికే పరిమితమైన చదువు వ్యవహరిక భాషలో సాగి అందరికి అందుబాటులోకి తెచ్చిన మహనీయుడు. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి గిడుగు తెలుగు భాషపై చేసిన కృషి వల్ల తెలుగు భాష అనేది ప్రతి ఒక్కరికి చదివేందుకు వీలు కల్పించింది. తెలుగు భాషపై ఇతను చేసిన కృషికి గాను గిడుగు పుట్టిన రోజు అయిన అగస్టు 29న ‘‘ తెలుగు భాషా దినోత్సవం’’ జరుపుకుంటారు.
➺ బాల్యం :
గిడుగు వెంకట రామమూర్తి 29 అగస్టు 1863న శ్రీకాకుళానికి ఉత్తరాన ఉన్న పర్వతాల పేట గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. గిడుగు రామమూర్తి ప్రాథమిక విద్య మొత్తం స్థానికంగా జరిగింది. గిడుగు 1896లో బీ.ఏలో ఉత్తీర్ణత సాధించాడు.
Also Read :
➺ తెలుగు భాషపై చేసిన కృషి :
1906 నుండి 1940 వరకు గిడుగు రామమూర్తి తెలుగు భాష సేవకే అంకితమయ్యాడు. వీరేశలింగం పంతులు ఊతం కూడా ఇతనికి లభించింది. 1919-20ల మధ్య వ్యవహరిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘‘తెలుగు’’ అనే మాసపత్రికను నడిపాడు. వ్యవహరిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో నాలుగు గంటల పాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మాణింపజేశాడు గిడుగు. తన స్థాపించిన పత్రిక ద్వారా శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షుడిగా, గిడుగు కార్యదర్శిగా ‘‘వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం’’ స్థాపించాడు.
➺ ప్రశంసలు, పురస్కారాలు :
గిడుగు రామమూర్తికి 1934లో ప్రభుత్వం కైజర్ ఎ హింద్ బిరుదు ఇచ్చి సత్కరించింది. 1913 ప్రభుత్వం రావు సాహెబ్ అనే బిరుదునిచ్చింది. 1938లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది. గిడుగు రామమూర్తి 22 జనవరి 1940న మరణించాడు.
0 Comments