Civil Disobedience Movement Gk Questions in Telugu with Answers | శాసనోల్లంఘన ఉద్యమం(ఇండియన్‌ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు

Civil Disobedience Movement Gk Questions in Telugu with Answers  |  శాసనోల్లంఘన ఉద్యమం(ఇండియన్‌ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు

శాసనోల్లంఘన ఉద్యమం(ఇండియన్‌ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు

Telangana History MCQ Gk Questions in Telugu with Answers | History Gk Questions in Telugu 

   Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛ Question No.1
శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ?
ఎ) మహాత్మగాంధీ
బి) జవహర్‌లాల్‌ నెహ్రూ
సి) సుభాష్‌చంద్రబోస్‌
డి) లాలా లజపతిరాయ్‌ ‌

జవాబు : ఎ) మహాత్మగాంధీ

☛ Question No.2
శాసనోల్లంఘన ఉద్యమం అధికారికంగా ఎప్పుడు ప్రారంభమైంది ?
ఎ) 1919
బి) 1920
సి) 1921
డి) 1930

జవాబు : డి) 1930

☛ Question No.3
శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించడానికి కారణమైన సంఘటన ఏది ?
ఎ) జలియన్‌వాలాబాగ్‌ దురంతం
బి) సైమన్‌కమీషన్‌
సి) క్విట్‌ ఇండియా ఉద్యమం
డి) బెంగాల్‌ విభజన

జవాబు : బి) సైమన్‌కమీషన్‌

☛ Question No.4
శాసనోల్లంఘన ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటీ ?
ఎ) ఇది బ్రిటిష్‌ వస్త్రాలను బహిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది
బి) ఇది బ్రిటిష్‌ ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా ధిక్కారాన్ని సూచిస్తుంది
సి) ఇది భూ సంస్కరణల డిమాండ్‌పై పనిచేసింది
డి) ఇది అంటరానివారి హక్కుల కోసం వాదించింది

జవాబు : బి) ఇది బ్రిటిష్‌ ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా ధిక్కారాన్ని సూచిస్తుంది

☛ Question No.5
బ్రిటిష్‌ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా అరెస్టు కాబడిన వ్యక్తి ఎవరు ?
ఎ) మోతీలాల్‌ నెహ్రూ
బి) చిత్తరంజన్‌ దాస్‌
సి) మహాత్మగాంధీ
డి) జవహర్‌లాల్‌ నెహ్రూ

జవాబు : సి) మహాత్మగాంధీ

☛ Question No.6
శాసనోల్లంఘన ఉద్యమం జరిగే సమయంలో బ్రిటిష్‌ వైస్రాయ్‌గా ఎవరు పనిచేశారు ?
ఎ) లార్డ్‌ మౌంట్‌ బాటన్‌
బి) లార్డ్‌ కర్జన్‌
సి) లార్డ్‌ వెవేల్‌
డి) లార్డ్‌ ఇర్విన్‌

జవాబు : డి) లార్డ్‌ ఇర్విన్‌




Also Read :


☛ Question No.7
శాసనోల్లంఘన ఉద్యమం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడినది ?
ఎ) పంజాబ్‌
బి) మహారాష్ట్ర
సి) గుజరాత్‌
డి) మధ్యప్రదేశ్‌

జవాబు : సి) గుజరాత్‌

☛ Question No.8
ఈ క్రిందివాటిలో శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
1) గాంధీజీ బ్రిటిష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌కు 11 ప్రతిపాదనలను తెలియజేశాడు.
2) గాంధీజి ఇచ్చిన 11 ప్రతిపాదనలతో కూడిన లేఖను లార్డ్‌ ఇర్విన్‌ తిరస్కరించాడు
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మాత్రమే
డి) ఏవీకావు

జవాబు : బి) 1 మరియు 2

☛ Question No.9
ఈ క్రిందివాటిలో ఉప్పు సత్యాగ్రహం / దండి మార్చ్‌ సంబంధించి సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
1) ఇది 12 మార్చి 1930న ప్రారంభమైంది
2) ఇది అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం నుండి గుజరాత్‌లోని దండి గ్రామం వరకు కొనసాగింది
3) ఈ యాత్ర 50 రోజుల పాటు 240 మైళ్ల దూరం జరిగింది
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 1, 2, 3

జవాబు : సి) 1 మరియు 2 మాత్రమే
24 రోజుల పాటు కొనసాగింది

☛ Question No.10
గాంధీజీ ఏ రోజున బ్రిటిష్‌ ఉప్పు చట్టాలను ఉల్లంఘించాడు ?
ఎ) 06 ఏప్రిల్‌ 1930
బి) 06 జూన్‌ 1930
సి) 06 నవంబర్‌ 1930
డి) 06 జనవరి 1930

జవాబు : ఎ) 06 ఏప్రిల్‌ 1930

☛ Question No.11
ఈ క్రిందివాటిలో గాంధీజీ యొక్క 11 ప్రతిపాదనలలో లేనిది ఏది ?
ఎ) 50 శాతం భూమి శిస్తు తగ్గించాలి
బి) ఉప్పుపై పన్ను రద్దు చేయాలి
సి) మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలి
డి) రూపాయి మారకపు నిష్పత్తిని తగ్గించాలి ‌

జవాబు : సి) మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలి

☛ Question No.12
1929లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో ‘‘పూర్ణ స్వరాజ్‌’’ లక్ష్యమని పిలుపునిచ్చింది ఎవరు ?
ఎ) మహాత్మగాంధీ
బి) జవహర్‌లాల్‌ నెహ్రూ
సి) సుభాష్‌చంద్రబోస్‌
డి) లాలా లజపతిరాయ్‌

జవాబు : బి) జవహర్‌లాల్‌ నెహ్రూ ‌


Also Read :



Post a Comment

0 Comments