Gupta Dynasty Gk Questions in Telugu | Indian History Gk Questions in Telugu Part - 2

Gupta Dynasty Gk Questions in Telugu

గుప్త సామ్రాజ్యం (ఇండియన్‌ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు Part -2

Gupta Dynasty Gk Questions in Telugu | Indian History Gk Questions in Telugu 

☛ Question No.1
ఈ క్రింది వాటిలో సముద్రగుప్తుని యొక్క బిరుదు కానిది ఏది ?
ఎ) స్వర్గ విజేత
బి) కవిరాజు
సి) శతరాజులకు రాజు
డి) దేవగుప్తుడు

జవాబు : డి) దేవగుప్తుడు

☛ Question No.2
దేవీ చంద్రగుప్తం అనే నాటకాన్ని ఎవరు రచించారు ?
ఎ) కాళిదాసు
బి) క్షపణికుడు
సి) విశాఖదత్తుడు
డి) ధన్వంతరి

జవాబు : సి) విశాఖదత్తుడు

☛ Question No.3
ఈ క్రింది వాటిలో రామగుప్తునికి సంబందించి సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
1) సముద్రగుప్తుని మరణాంతరం ఇతని పెద్దకుమారుడైన రామగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించాడు
2) రామగుప్తుని కాలంలో శకరాజు అయిన 3వ రుద్రసింహుడు మగధపై దాడి చేసి రామగుప్తుడిని ఓడించి తన భార్య ధృవాదేవీని బంధించాడు
3) రామగుప్తున్ని చంపి ధృవాదేవీని వివాహం చేసుకున్న వృత్తాంతాన్ని రాజశేఖరుడు తను రచించిన కావ్యమీమాంసలో వివరించాడు
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 3 మాత్రమే
డి) 1, 2, 3

జవాబు : డి) 1, 2, 3

☛ Question No.4
2వ చంద్రగుప్తుని యుద్ధ విజయాల గురించి ఏ శాసనంలో లిఖించబడ్డాయి ?
ఎ) అలహబాద్‌ శాసనం
బి) మెహ్రోలీ స్థంభ శాసనం
సి) చంద్రగుప్తు శాసనం
డి) విజయానుసారం శాసనం

జవాబు : బి) మెహ్రోలీ స్థంభ శాసనం

☛ Question No.5
ఏ గుప్త రాజు ఆస్థానంలో ప్రముఖ కవి అయిన ‘కాళిదాసు’ పనిచేశాడు ?
ఎ) శ్రీగుప్తుడు
బి) రామగుప్తుడు
సి) 2వ చంద్రగుప్తుడు
డి) కుమార గుప్తుడు

జవాబు : సి) 2వ చంద్రగుప్తుడు

☛ Question No.6
ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు ?
ఎ) శ్రీగుప్తుడు
బి) రామగుప్తుడు
సి) కుమార గుప్తుడు
డి) 2వ చంద్రగుప్తుడు

జవాబు : డి) 2వ చంద్రగుప్తుడు



☛ Question No.7
ఎవరి కాలంలో కళలు, సాహిత్యం అభివృద్ది చెందాయి ?
ఎ) ఘటోత్కచుడు
బి) శ్రీగుప్తుడు
సి) మొదటి చంద్రగుప్తుడు
డి) రెండవ చంద్రగుప్తుడు

జవాబు : డి) రెండవ చంద్రగుప్తుడు


Also Read :


☛ Question No.8
ఎవరి కాలంలో ఇతిహాసాలు రామాయణం, మహాభారతం రచించబడ్డాయి ?
1) ఘటోత్కచుడు
2) శ్రీగుప్తుడు
3) రెండవ చంద్రగుప్తుడు
4) మొదటి చంద్రగుప్తుడు

జవాబు : 3) రెండవ చంద్రగుప్తుడు

☛ Question No.9
ఎవరి కాలంలో ఖగోళ శాస్త్రపరిశోధనలో ‘‘ఉజ్జయిని’’ అనే ప్రాంతం గొప్ప విద్యాకేంద్రంగా ప్రసిద్ది చెందింది ?
ఎ) ఢిల్లీ సుల్తానులు
బి) మౌర్యులు
సి) చోళులు
డి) గుప్తులు

జవాబు : డి) గుప్తులు

☛ Question No.10
ఈ క్రిందివాటిలో 2వ చంద్రగుప్తునికి సంబంధించి సరైన వ్యాక్యాలను గుర్తించండి ?
1) ఇతను సింహాం, లక్ష్మీదేవి, గుర్రం బొమ్మలతో నాణెలను ముద్రించాడు
2) ఇతని ఆస్థానంలో 9 మంది (భేతాళభట్టు, అమరసింహుడు , శంఖు, ధన్వంతరి, వరరుచి, వరాహమిహిరుడు , క్షపణికుడు , కాళిదాసు, ఘటకర్పర) సంస్కృత కవులు పనిచేశారు
3) ఇతని కాలంలో చైనా యాత్రికుడు ‘ఫాహియాన్‌’ భారతదేశాన్ని సందర్శించాడు
4) ఇతను శకరాజు అయిన 3వ రుద్రసింహున్ని చంపి ఉజ్జయినిని జయించి తన రెండవ రాజధానిగా చేసుకున్నాడు.
ఎ) 1, 2, 3, 4
బి) 2, 3 మరియు 4
సి) 1, 2 మరియు 4
డి) 1, 2 మరియు 3

జవాబు : ఎ) 1, 2, 3, 4

☛ Question No.11
గుప్తుల కాలం ఏ శాస్త్ర రంగంలో గణణీయమైన అభివృద్ది సాధించింది ?
ఎ) ఖగోళశాస్త్రం
బి) రసాయన శాస్త్రం
సి) వృక్ష శాస్త్రం
డి) పాలియోంటాలజీ

జవాబు : ఎ) ఖగోళశాస్త్రం

☛ Question No.12
ఎవరి కాలంలో ‘‘పుష్యమిత్ర’’ అనే తెగ ఉద్భవించి గుప్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ?
ఎ) స్కంధగుప్తుడు
బి) కుమార గుప్తుడు
సి) భాను గుప్తుడు
డి) విష్ణుగుప్తుడు

జవాబు : ఎ) స్కంధగుప్తుడు ‌

☛ Question No.13
నలంద విద్యాలయాన్ని ఎవరు నిర్మించారు ?
ఎ) స్కంధ గుప్తుడు
బి) భాను గుప్తుడు
సి) నరసింహ గుప్తుడు
డి) కుమార గుప్తుడు

జవాబు : డి) కుమార గుప్తుడు ‌

☛ Question No.14
ఈ క్రిందివాటిలో కుమార గుప్తునికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఇతను కార్తికేయుని బొమ్మ, నెమళ్ల బొమ్మలతో నాణెలను ముద్రించాడు
2) ఇతను మాండసోర్‌లో సూర్యదేవాలయాన్ని, మంకువార్‌లో రాతిబుద్ద విగ్రహాన్ని, కురరుదందలో శివాలయాన్ని నిర్మించాడు
3) ఇతని కాలంలో హూణులు భారతదేశంపై మొదటిసారిగా దండెత్తి వచ్చారు.
4) ఇతని తర్వా తన కుమారుడు స్కంధగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించాడు.
ఎ) 1, 2, 3, 4
బి) 2 మరియు 4 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే

జవాబు : ఎ) 1, 2, 3, 4 ‌

☛ Question No.15
గుప్తు రాజ్యాన్ని చివరగా ఎవరు పరిపాలించాడు ?
ఎ) స్కంధ గుప్తుడు
బి) భాను గుప్తుడు
సి) నరసింహ గుప్తుడు
డి) విష్ణుగుప్తుడు

జవాబు : డి) విష్ణుగుప్తుడు ‌



 

Also Read :



Post a Comment

0 Comments