
గుప్త సామ్రాజ్యం (ఇండియన్ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు Part -3
Gupta Dynasty Gk Questions in Telugu | Indian History Gk Questions in Telugu
☛ Question No.1
గుప్త రాజ్యం క్షీణించడానికి ప్రధాన కారణం ?
ఎ) వారసత్వ పోరాటాలు
బి) విదేశీయుల దండయాత్రలు
సి) అసమర్థ పాలకులు
డి) వర్తక వాణిజ్యం
జవాబు : బి) విదేశీయుల దండయాత్రలు
☛ Question No.2
ఈ క్రిందవాటిలో 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో పనిచేసిన 9 మంది నవరత్నములలో లేనివారిని గుర్తించండి ?
ఎ) భేతాళభట్టు
బి) అమరసింహుడు
సి) విశాఖదత్తుడు
డి) క్షపణికుడు
జవాబు : సి) విశాఖదత్తుడు
☛ Question No.3
గుప్తుల పరిపాలనలో ఏ భాషను అధికార భాషగా ఉపయోగించేవారు ?
ఎ) మాగధి
బి) సంస్కృతం
సి) ప్రాకృతం
డి) పాళీ
జవాబు : బి) సంస్కృతం
☛ Question No.4
గుప్తుల కాలంలో భూమి శిస్తు ఎంత వసూలు చేసేవారు ?
ఎ) 1/4 వంతు
బి) 1/3 వంతు
సి) 1/6 వంతు
డి) 1/6 వంతు
జవాబు : సి) 1/6 వంతు
☛ Question No.5
గుప్తుల కాలంలో ప్రధాన న్యాయమూర్తిని ఏమని పిలిచేవారు ?
ఎ) మహాదండనాయక
బి) ఆయుక్త
సి) విషయాధిపతి
డి) దేశ
జవాబు : ఎ) మహాదండనాయక
☛ Question No.6
గుప్తుల కాలంలో వినియోగంలో లేని భూమిని ఏమని పిలిచేవారు ?
ఎ) అప్రహాత
బి) ఖిలం
సి) వస్తి
డి) క్షేత్రం
జవాబు :బి) ఖిలం
Also Read :
☛ Question No.7
గుప్తుల కాలంలో అటవీ సంపదకు ఉపయోగించే భూమిని ఏమని పిలిచేవారు ?
ఎ) అప్రహాత
బి) ఖిలం
సి) వస్తి
డి) క్షేత్రం
జవాబు : ఎ) అప్రహాత
☛ Question No.8
గుప్తుల కాలంలో నివాసానికి ఉపయోగించే భూమిని ఏమని పిలిచేవారు ?
ఎ) అప్రహాత
బి) ఖిలం
సి) వస్తి
డి) క్షేత్రం
జవాబు : సి) వస్తి
☛ Question No.9
గుప్తుల కాలంలో పరిపాలన కోసం విభజించిన ప్రాంతాలను సరైన క్రమంలో అమర్చండి ?
ఎ) భుక్తి - విషయ - భోగ - గ్రామ
బి) విషయ - భోగó - భుక్తి - గ్రామ
సి) గ్రామ - భోగ- భుక్తి - విషయ
డి) భోగ - విషయ - గ్రామ - భుక్తి
జవాబు : ఎ) భుక్తి - విషయ - భోగó - గ్రామ
☛ Question No.10
భుక్తిని పరిపాలించే అధికారిని ఏమని పిలిచేవారు ?
ఎ) గోప్త్రి
బి) విషయాధిపతి
సి) ఉపరిక
డి) ఆయుక్త
జవాబు : సి) ఉపరిక
☛ Question No.11
గుప్తుల కాలంలో ప్రధాన ఆదాయం దేని ద్వారా లభించేంది ?
ఎ) వర్తక వాణిజ్యం
బి) పశువుల పెంపకం
సి) భూమి శిస్తు
డి) జరిమానాలు
జవాబు : సి) భూమి శిస్తు
☛ Question No.12
గుప్తులు భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ?
ఎ) సుమారు క్రీ.శ 350 - 600
బి) సుమారు క్రీ.శ 450 - 700
సి) సుమారు క్రీ.శ 280 - 550
డి) సుమారు క్రీ.శ 150 - 300
జవాబు : సి) సుమారు క్రీ.శ 280 - 550
0 Comments