
గుప్తుల కాలం నాటి శాసనాలు
Indian History in Telugu
➺ అలహాబాద్ ప్రశస్తి శాసనం :
ఈ శాసనాన్ని హరిసేనుడు వేయించాడు. ఇందులో సముద్రగుప్తుని సైనిక విజయాల గురించి తెలియజేస్తుంది.
➺ దాన శాసనం :
ఇందులో గుప్తుల కాలంలో దానం చేసిన భూముల గురించి రాగి పలకపై వివరిస్తు శాసనాలుగా వేయించారు. ఇందులో బ్రహ్మణులకు అగ్రహారాలు దానంగా ఇవ్వడం, శ్రీలంక రాజు మహామేఘవర్మన్ గయలో ఒక బౌద్ద వివాహారాన్ని నిర్మించగా, ఆ విహారంనకు సముద్రగుప్తుడు గ్రామాన్ని దానంగా ఇచ్చాడని శాసనం వేయించారు.
➺ మెహరౌలి ఇనుపస్తంభ శాసనం :
ఈ శాసనం చంద్రగుప్తుడు శకులపై యుద్ధం చేసి ఉజ్జయిని ఆక్రమించుకొని ‘విక్రమాదిత్య’ ‘శకారి’ అనే బిరుదులు పొందిన విషయాలను తెలియజేస్తుంది. దీనిని సంస్కృత భాష, బ్రహ్మలిపిలో వేయించారు.
➺ భితారి శాసనం :
దీనిని స్కందగుప్తుడు లిఖించాడు. ఇందులో హూణులు గుప్త రాజ్యంపై చేసిన దండయాత్రలు గురించి వివరిస్తుంది.
➺ పహాడ్‌పూర్ శాసనం :
బుద్ధగుప్తుడు వేయించిన ఈ శాసనంలో గుప్త రాజ్యంలోని వ్యవసాయ భూములపై పూర్తి అధికారం రాజుకు ఉంటుందని తెలుపుతుంది
➺ పునా తామ్ర శాసనం :
రెండవ చంద్రగుప్తుని కుమార్తె అయిన ప్రభావతి గుప్త వేయించి ఈ శాసనంలో గుప్త రాజ్యంలో భూమి సర్వే గురించి వివరిస్తుంది.
➺ జునాగఢ్ శాసనం :
స్కందగుప్తుడు వేయించిన ఈ శాసనంలో సుదర్శన తటాకంకు స్కందగుప్తుని యొక్క సౌరాష్ట్ర ప్రాంత పాలకుడు చక్రపాలితుడు మరమ్మత్తులు చేయించాడు అని ఈ శాసనం పేర్కొంటుంది.
➺ ఇండోర్ శాసనం :
గుప్తుల కాలంలో కౌలుదారి వ్యవస్థను వివరించే ఈ శాసనాన్ని స్కందగుప్తుడు వేయించాడు.
➺ ఎరాన్ శాసనం :
దేశంలో మొదటిసారి సతీసహగమనం గురించి ఈ శాసనంలో లిఖించారు. దీనిని భానుగుప్తుడు వేయించాడు. దీనిని అలెగ్జాండర్ కన్నీంగ్‌హోమ్ కనుగొనడం జరిగింది.
0 Comments