ఇంటర్‌తో బీఈడీ చేయాలనుకుంటున్నారా ..
నాలుగేళ్లలో బీఈడీ పూర్తి
డిగ్రీ మరియు బీఈడీ నాలుగేళ్లలో పూర్తి
ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఎన్‌సీఈటీ) - 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఆర్‌ఐఈలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు / యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కల్పిస్తారు.
ఇంటర్మిడియట్ పూర్తి చేసిన తర్వాత ఒకే సమయంలో డిగ్రి మరియు బీఈడీ పూర్తి చేయవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ సమీకృత బీఈడీ కోర్సు (ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్) కాలపరిమితి నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న విద్యావిధానం ప్రకారం బీఈడీ చేయాలంటే మూడు సంవత్సరాల డిగ్రీ, రెండేళ్ల బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యూకేషన్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులుగా ఉండేవారు. దీనికి మొత్తం 5 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు ప్రవేశపెట్టిన సమీకృత బీఈడీ కోర్సు ద్వారా నాలుగు సంవత్సరాలలోనే డిగ్రీతో పాటు బీఈడి పూర్తి చేసే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలోని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ) ఈ నాలుగు సంవత్సరాల కోర్సు కొరకు వ్రాత పరీక్షను నిర్వహిస్తుంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఈ నాలుగు సంవత్సరాల కోర్సు నిర్వహించేందుకు తెలంగాణలోని మూడు కాలేజీలు(మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్ ఎన్‌ఐటీ, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల), ఆంధ్రప్రదేశ్‌లో (తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, శ్రీకాకుళంలోనిలో డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ) లను ఎంపిక చేయడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే వ్రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తిస్తారు.
ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే వ్రాత పరీక్షకు అర్హులు అవుతారు. ఈ వ్రాత పరీక్షలో మొత్తం 181 బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ అప్టిట్యూడ్‌ల నుండి ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
➺ కోర్సు పేరు :
- ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటిఈపి) / సమీకృత బీఈడి కోర్సు
➺ ఇంటిగ్రేటేడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అర్హత :
- ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ పరీక్షా విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్టు
➺ తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన కాలేజీలు
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, రాజేంద్రనగర్, రంగారెడ్డి
- బికాం - బీఈడీ : 50
- బీఎస్సీ - బీఈడీ : 50
- బీఏ - బీఈడీ : 50
Also Read :
వరంగల్ ఎన్‌ఐటీ
- బీఎస్సీ- బీఈడీ - 50
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్
- బీఏ- బీఈడీ - 50
➺ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపిక చేసిన కాలేజీలు
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో
- బీఏ - బీఈడీ
శ్రీకాకుళంలోనిలో డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ
- బీఎస్సీ - బీఈడీ
- బీఏ - బీఈడీ
➺ సబ్జెక్టు :
- జనరల్ నాలెడ్జ్
- కరెంట్ అపైర్స్
- జనరల్ మెంటల్ ఎబిలిటి
- న్యూమరికల్ ఎబిలిటీ
- లాజికల్ అండ్ అనలికల్ రీజనింగ్
- టీచింగ్ ఆప్టిట్యూడ్
➺ పరీక్షా పద్దతి :
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 ఏప్రిల్ 2024
- కరెక్షన్ విండో ఓపేన్ : 02 నుండి 04 మే 2024 వరకు
- ఎన్‌సీఈటీ పరీక్షా తేది : 12 జూన్ 2024
0 Comments