Basara IIIT Admissions, Online Apply | TS RGUKT B.Tech Program | బాసర ట్రిపుల్‌ ఐటీ అడ్మిషన్స్

 

Basara IIIT Admission 2023-24 in telugu at rgukt.ac.in for TS RGUKT B.Tech Program || IIIT Basara online application 2023-24 || బాసర ట్రిపుల్‌ఐటీ అడ్మిషన్స్

TS RGUKT IIIT Basara Notification 2024-2025 for B.Tech admisions apply online at rgukt.ac.in

ఎస్‌.ఎస్‌.సి (10వ తరగతి) లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్మల్‌ జిల్లా బాసరలోని Rajiv Gandhi University of Knowledge Technologies-Basar (RGUKT) లో బిటెక్‌లో ప్రవేశం పొందడానికి అవకాశం కల్పిస్తుంది. చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాసరలోని ట్రిపుల్‌ ఐటిలో అడ్మిషన్‌ ఎలా పొందాలో తెలియక సీటు దక్కించుకోలేకపోతారు. ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ధరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, ఆన్‌లైన్‌ ప్రక్రియ, ముఖ్యమైన తేదీల గురించి వివరంగా కింద ఇవ్వడం జరిగింది. 

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జియూకేటీ) బాసర ట్రిపుల్‌ఐటీలో 6 సంవత్సరాల ఇంజనీరింగ్‌ కోర్సు ఉంటుంది. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులు ఎస్‌.ఎస్‌.సి(10వ తరగతి) రెగ్యులర్‌ విధానంలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. సప్లమెంటరీ వ్రాసిన వారు అర్హులు కాదు. ధరఖాస్తు చేసుకునే అభ్యర్థి 18 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు దాటవద్దు. 

➠ Basara IIIT 2024-25 ఎంపిక విధానం : 

ఎస్‌.ఎస్‌.సి(10వ తరగతి)లో పొందిన జిపిఏ(గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌) ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ప్రతీ సబ్జెక్టులో అభ్యర్థి పొందిన గ్రేడ్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లకు లోబడి ఎంపిక విధానం ఉంటుంది. నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఆదర్శ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 0.4 జిపిఏ పాయింట్లు అదనంగా కలుపడం జరుగుతుంది. మొత్తం సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. మిగతా 15 శాతం సీట్లను అన్‌ రిజర్వుడ్‌ సీట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా గ్లోబల్‌ కేటగీరి కింద 5 శాతం సీట్లు రిజర్వ్‌గా, గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 2 శాతం సీట్లు కేటాయిస్తారు. 

➠ Basara IIIT 2024-25 విద్యా సౌకర్యాలు :

ఇందులో ఎంపికైన విద్యార్థులకు 6 సంవత్సరాల పాటు విద్యను అందించడంతో పాటు ల్యాప్‌టాప్‌ ఉచితంగా అందిస్తారు. మరియు యూనిఫామ్స్‌, సంవత్సరానికి రెండు జతల షూ, హస్టల్‌ వసతి ఉచితంగా కల్పిస్తారు. 


రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జియూకేటీ) ముఖ్యమైన తేదీలు
ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 01-06-2024
ధరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది 26-06-2024

Post a Comment

0 Comments