DOST Admission 2024 Apply Online, Notification | తెలంగాణ డిగ్రీ అడ్మిషన్స్‌

DOST Admission 2023 in telugu : Registration Process Apply Online, Dates, Eligibility, Cut Off, Web Option, Counselling in telugu || దోస్త్‌  తెలంగాణ -2023 నోటిఫికేషన్‌, ఆన్‌లైన్‌ అప్లై, ముఖ్యమైన తేదీలు

దోస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ 2024, డిగ్రీ అడ్మిషన్
TS Dost Registration 2024 Open for Phase 1; Application Process, Seat Allotment

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌-2024 నోటిఫికేషన్‌ విడుదలైంది.  తెలంగాణ రాష్ట్రంలోని 2023-24 విద్యా సంవత్సరానికి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీస్‌, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయాల పరిధిలోని వివిధ కళాశాలల్లో అందించే బిఏ/ బికామ్‌/ బికామ్‌(వోకేషనల్‌)/బికామ్‌(హనర్స్‌)/బిఎస్సీ/బిఎస్‌డబ్ల్యూ/ బిబిఏ,/బిసిఏ,/బిబిఎం మొదలైన వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు దోస్త్‌ తెలంగాణ - 2024 ద్వారా ఆన్‌లైన్‌ ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మిడియట్‌ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల / బోర్డు నుండి సమాన గుర్తింపు కల్గిన పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

దోస్త్‌ తెలంగాణ - 2024 ప్రవేశాల కోసం మే 6, 2024 నుండి మొదటి విడత రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో కొనసాగే ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో ధరఖాస్తులు చేసుకోవచ్చు. 

డిగ్రీ దోస్త్‌ - 2024 ఆన్‌లైన్‌ ఆడ్మిషన్‌ల కొరకు విద్యార్థులు ముందుగానే తమ ఆధార్‌కార్డుకు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ చేసుకోవాలి. టియాప్‌ ద్వారా https://dost.cgg.gov.in విద్యార్థులు లాగిన్‌ కాగానే వారికి దోస్త్‌ ఐడీ, పిన్‌ నెంబర్‌ వస్తుంది. తర్వాత ఆన్‌లైన్‌ పద్దతి పూర్తి చేసిన తర్వాత సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా ఎంచుకున్న కాలేజికి వెళ్లి ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 

TS DOST 2023 – Degree Online Services Telangana

➠ దోస్త్ తెలంగాణ - 2024 ఫీజు వివరాలు :

  • మొదటి విడతలో 200/- రూపాయలు ఫీజు చెల్లించాలి. 
  • రెండవ / మూడవ విడతలో 400/- రూపాయలు ఫీజు చెల్లించాలి. 

➠ దోస్త్ తెలంగాణ - 2024 అర్హత :

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మిడియట్‌ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల / బోర్డు నుండి సమాన గుర్తింపు కల్గిన పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

➠ ముఖ్యమైన తేదీలు :

ఫేస్‌ - 1

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 25 మే 2024
  • వెబ్‌ ఆప్షన్లు : 15 నుండి 27 మే 2024 వరకు 
  • సీట్ల కేటాయింపు : 03 జూన్‌ 2024

ఫేస్‌ - 2

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 13 జూన్‌ 2024
  • వెబ్‌ ఆప్షన్లు : 04 నుండి 14 జూన్‌ 2024 వరకు 
  • సీట్ల కేటాయింపు : 18 జూన్‌ 2024

ఫేస్‌ - 3

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 25 జూన్‌ 2024
  • వెబ్‌ ఆప్షన్లు : 19 నుండి 26 జూన్‌ 2024 వరకు 
  • సీట్ల కేటాయింపు : 29 జూన్‌ 2024
  • తరగతులు ప్రారంభం : 08 జూలై 2024



కేటగిరి అడ్మిషన్స్‌
రాష్ట్రం తెలంగాణ
తరగతి డిగ్రీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌)
దశలు మూడు
అర్హత ఇంటర్మిడియట్‌
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
ధరఖాస్తు ఫీజు 200/-, 400/-
కోర్సులు బిఏ/ బికామ్‌/బికామ్‌(వోకేషనల్‌)/బికామ్‌(హనర్స్‌)/బిఎస్సీ/బిఎస్‌డబ్ల్యూ/బిబిఏ,/బిసిఏ,/బిబిఎం
యూనివర్సిటీలు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీస్‌, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయాలు
రిజిస్ట్రేషన్‌ ఆఖరు తేది ఫేస్‌ - 1 ః 25-05-2024
ఫేస్‌ - 2 ః 13-06-2024
ఫేస్‌ - 3 ః 25-06-2024
అప్లై ఆన్‌లైన్‌ Click Here

Post a Comment

0 Comments