
కేంద్ర అటార్నీ జనరల్
Attorney General of India in Telugu | Gk in Telugu
భారత రాజ్యాంగంలోని 76వ నిబంధన అటర్ని జనరల్ అధికారాలు, విధులు నిర్వచిస్తుంది. అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత న్యాయాధికారిగా, ప్రధాన న్యాయ సలహాదారుడిగా వ్యవహరిస్తాడు. ఈయన రాష్ట్రపతిచే నియమించబడతాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్దతి ప్రకారం అటార్నీ జనరల్ తొలగిస్తారు. అటార్నీ జనరల్ యొక్క పదవీ కాలం రాష్ట్రపతి నిర్ణయం మేరకు ఉంటుంది.
➺ అర్హతలు :
- భారతదేశ పౌరుడై ఉండాలి.
- కనీసం 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయాలి.
- 10 సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగా పనిచేయాలి.
➺ విధులు :
- దేశ న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం కోసం వాదిస్తాడు.
- రాష్ట్రపతి కోరిన ఇతర న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనలు చేస్తారు.
- పార్లమెంటు శాసన కార్యక్రమాల్లో పాల్గొని సభలో తన వాదనను, అభిప్రాయాలను చెప్పవచ్చు. ఓటు వేసే అధికారం ఉండదు.
0 Comments