
Navodaya Vidyalaya (JNVST) Class 6 Admission
నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 6వ తరగతి లో సీట్లను భర్తీ చేయనున్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 650 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 09, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 ఉన్నాయి. నవోదయ విద్యాలయాల్లో కో`ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూళ్లు. కానీ బాలబాలికలకు విడివిడిగా హస్టల్ సదుపాయం ఉంటుంది. ఇందులో అడ్మిషన్ పొందిన వారికి ఉచితంగా వసతి, రుచికరమైన భోజనం, యూనిఫారమ్, పాఠ్యపుస్తకాలు ఇస్తారు. ఒక్కసారి ఇందులో అడ్మిషన్ సాధిస్తే ఇంటర్మిడియట్ వరకు నాణ్యమైన ఉచిత విద్య లభిస్తుంది.
➺ అడ్మిషన్ :
- 6వ తరగతి
➺ విద్యార్హత :
- 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు
- 01 మే 2013 నుండి 31 జూలై 2015 మధ్య జన్మించిన వారై ఉండాలి
➺ తెలుగు రాష్ట్రాలలో స్కూల్స్
- తెలంగాణ - 09
- ఆంధ్రప్రదేశ్ - 15
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ఎంపిక విధానం :
- ఎగ్జామ్
➺ పరీక్షా విధానం :
- మెంటల్ ఎబిలిటి - 50 మార్కులు (40 ప్రశ్నలు)
- ఆర్థమెటిక్ - 25 మార్కులు (20 ప్రశ్నలు)
- లాంగ్వేజ్ టెస్టు - 25 మార్కులు (20 ప్రశ్నలు)
మొత్తం 2 గంటల వ్యవధిలో 100 మార్కులకు గాను 80 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
➺ ఎంట్రన్స్ టెస్టు తేది :
- 18 జనవరి 2025 (ఏపి, తెలంగాణ)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 23 సెప్టెంబర్ 2024
For Online Apply
0 Comments