SBIF Asha Scholarship in Telugu
పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించడం కోసం ఆర్థిక సహాయం అందించడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ (ఎస్‌బీఐఎఫ్) ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ - 2024ను ప్రకటించింది. 6వ తరగతి నుండి పీజీ వరకు చదివే అభ్యర్థుందరూ ఈ స్కాలర్‌షిప్ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ సంఖ్యలో సగాన్ని మహిళలకు / విద్యార్థినులకు కేటాయించారు.
➺ స్కాలర్‌షిప్ పేరు :
- ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ - 2024
➺ విద్యార్హతలు :
పాఠశాల విద్యార్థులకు :
- ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుండి 12వ తరగతి చదువుతూ ఉండాలి.
- వార్షికాదాయం 3 లక్షలకు మించరాదు.
- రూ॥15,000/- ల స్కాలర్‌షిప్ అందిస్తారు.
డిగ్రీ విద్యార్థులకు :
- ఐఐటీలు / నిట్ సంస్థలు / ఎన్‌ఐఆర్‌ఎప్ ర్యాంకింగ్ ఉన్న కాలేజిల్లో డిగ్రీ అడ్మిషన్ పొంది ఉండాలి
- వార్షికాదాయం 6 లక్షలకు మించరాదు.
- నిట్ సంస్థలు / ఎన్‌ఐఆర్‌ఎఫ్ కాలేజి విద్యార్థులకు రూ॥50,000/-, ఐఐటీ విద్యార్థులకు రూ॥2,00,000/-ల స్కాలర్‌షిప్ అందిస్తారు.
పీజీ విద్యార్థులకు :
- ఐఐటీలు / నిట్ సంస్థలు / ఎన్‌ఐఆర్‌ఎప్ ర్యాంకింగ్ ఉన్న కాలేజిల్లో డిగ్రీ అడ్మిషన్ పొంది ఉండాలి
- వార్షికాదాయం 6 లక్షలకు మించరాదు.
- నిట్ సంస్థలు / ఎన్‌ఐఆర్‌ఎఫ్ కాలేజి విద్యార్థులకు రూ॥70,000/-, ఐఐటీ విద్యార్థులకు రూ॥7,50,000/-ల స్కాలర్‌షిప్ అందిస్తారు.
➺ ఎంపిక విధానం :
- మెరిక్ ఆధారంగా
➺ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- మార్కుల మెమో
- ఆధార్ కార్డు
- అడ్మిషన్ లెటర్
- ఐడీ కార్డు
- బోనఫైడ్ సర్టిఫికేట్
- ఫీజు రశీదు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- పాస్‌పోర్టు ఫోటో
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 01 అక్టోబర్ 2024
For Online Apply
0 Comments