Jawahar Navodaya Vidyalaya Admission in Telugu || Lateral Entry Admission Class 9, Class 11
నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కొరకు లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 9వ, 11వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. సెలక్షన్ టెస్టు ద్వారా ప్రవేశాల కల్పిస్తారు. జవహర్ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 650 స్కూల్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 09, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 ఉన్నాయి. నవోదయ విద్యాయాల్లో కో-ఎడ్యూకేషన్ రెసిడెన్షియల్ స్కూళ్లు. కానీ బాలబాలికలకు విడివిడిగా హస్టల్ సదుపాయం ఉంటుంది. ఇందులో అడ్మిషన్ పొందిన వారికి ఉచితంగా వసతి, రుచిరకమైన భోజనం, యూనిఫారమ్, పాఠ్యపుస్తకాలు ఇస్తారు. ఇందులో మెథమేటిక్స్, సైన్స్ సబ్జెక్టులను ఇంగ్లీష్‌మీడియంలో, సోషల్ సైన్స్‌ను హిందీ/ఇంగ్లీష్ మీడియంలో భోదిస్తారు. ఇందులోని విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్ ఉంటుంది. ప్రతి సంవత్సరం సీబీఎస్‌సీ నిర్వహించే వార్షిక పరీక్షలను రాయాల్సి ఉంటుంది.
జవహర్
నవోదయ విద్యాలయాల్లోని లెటరల్ ఎంట్రి కొరకు 8వ / 10వ తరగతి చదువుతున్న
విద్యార్థులు అన్‌లైన్ ధరఖాస్తు చేసుకోవాలి.
➺ 9వ తరగతిలో మిగిలిన సీట్లు :
తెలంగాణ
- ఆదిలాబాద్ - 07
- కరీంనగర్ - 12
- ఖమ్మం - 03
- మహబూబ్‌నగర్ - 13
- మెదక్ - 07
- నల్లగొండ - 11
- నిజామాబాద్ - 17
- రంగారెడ్డి - 07
- వరంగల్ - 05
ఆంధ్రప్రదేశ్
- అనంతపురం - 10
- చిత్తూర్ - 14
- తూర్పు గోదావరి - 13
- గుంటూర్ - 22
- అన్నమయ్య - 16
- కృష్ణా - 11
- కర్నూల్ - 10
- నెల్లూర్ - 12
- ప్రకాశం - 20
- శ్రీకాకుళం - 14
- విశాఖపట్టణం - 10
- విజయనగరం - 10
- పశ్చిమ గోదావరి - 07
- తూర్పు గోదావరి - 06
➺ 11వ తరగతిలో మిగిలిన సీట్లు
అన్ని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జేఎన్‌వీల్లో 11వ తరగతిలో సైన్స్ గ్రూప్ సీట్లు ఉన్నాయి. ఖమ్మం, చిత్తూర్, గుంటూర్ జేఎన్‌వీల్లో మాత్రమే కామర్స్ సీట్లు ఉన్నాయి.
➺ విద్యార్హత :
- 9వ తరగతి అడ్మిషన్‌కు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు.
- వీరు 01 మే 2010 నుండి 31 జూలై 2012 మధ్య జన్మించిన వారై ఉండాలి.
- 11వ తరగతి ప్రవేశానికి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నవారు ధరఖాస్తు చేసుకోవాలి.
- వీరు 01 జూన్ 2008 నుండి 31 జూలై 2010 మధ్య జన్మించాలి.
➺ ఎంపిక విధానం :
- సెలక్షన్ టెస్టు ద్వారా
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది. 09-11-2024
సెలక్షన్ టెస్టు తేది : 08 ఫిబ్రవరి 2025
0 Comments